Telangana: బీజేపీలోకి ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎంపీలు.. కిషన్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు అందుకేనా..

తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుపు లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే 9 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన అధిష్ఠానం మిగిలిన 8 స్థానాలపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఉన్న ఆశావహుల గెలుపు లక్ష్యాలు పరిశీలిస్తూనే పక్క పార్టీ నేతలకు ఆహ్వానం పలుకుతోంది. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా.. బీఆర్ఎస్ మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గెడం నగేష్‌లను పార్టీలోకి ఆహ్వానిస్తోంది కమలం పార్టీ..

Telangana: బీజేపీలోకి ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎంపీలు.. కిషన్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు అందుకేనా..
Telangana Politics
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 09, 2024 | 12:23 PM

తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుపు లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే 9 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన అధిష్ఠానం మిగిలిన 8 స్థానాలపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఉన్న ఆశావహుల గెలుపు లక్ష్యాలు పరిశీలిస్తూనే పక్క పార్టీ నేతలకు ఆహ్వానం పలుకుతోంది. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా.. బీఆర్ఎస్ మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గెడం నగేష్‌లను పార్టీలోకి ఆహ్వానిస్తోంది కమలం పార్టీ.. సీతారాం నాయక్‌ ఇంటికి నేరుగా వెళ్లిన కిషన్ రెడ్డి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు గెడం నగేష్‌ను పార్టీలో చేర్చే బాధ్యతను బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి అప్పగించారు. తెలంగాణలో గెలిచిన 8 అసెంబ్లీ స్థానాల్లో 4 ఆదిలాబాద్‌ జిల్లాలోనే ఉన్నాయి. అందుకే ఇక్కడ ఎంపీ సీటును గెలుచుకునేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. అమిత్‌షా టూర్‌లో సీతారాం నాయక్, నగేష్‌ బీజేపీ కండువా కప్పుకోనున్నారు. మరోవైపు జలగం వెంకట్రావును సైతం పార్టీలోకి ఆహ్వానిస్తోంది బీజేపీ. ఖమ్మం ఎంపీ సీటు ఆయనకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

అయితే, 12వ తేదీన అమిత్ షా సమక్షంలో మాజీ ఎంపీలు, సీతారాంనాయక్, నగేష్ బీజేపీ లో చేరనున్నట్లు సమాచారం.. ఆదిలాబాద్ బీజేపీ సీటు కోసం తీవ్ర పోటీ నెలకొని ఉండటంతో ఆదివాసీ నేతకే టికెట్ కట్టబెట్టాలంటూ అదిష్టానం నిర్ణయించింది. ఇప్పటికే.. బీఆర్ఎస్ మాజీ ఎంపి‌ నగేష్‌తో బీజేపీ చర్చలు జరపగా.. సుముఖత వ్యక్తంచేసినట్లు సమాచారం.. అటు సీతారాం నాయక్ కూడా బీజేపీలో చేరుతున్నట్లు కేడర్ కు సమాచారం ఇచ్చారు..

కిషన్ రెడ్డికి పిలుపు..

ఇదిలాఉంటే.. తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్ఠానం.. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఢిల్లీకి రావాలంటూ ఆహ్వానం పంపింది.. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. పెద్దలతో భేటీతోపాటు.. రేపటి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి హాజరుకానున్నారు. ఎల్లుండి రెండో జాబితా విడుదలకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. దీనిలో కీలక నేతల పేర్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎల్లుండి హైదరాబాద్‌కు అమిత్‌షా రానున్నారు. 12న ఎల్బీ స్టేడియంలో బూత్‌ కమిటీలతో సమావేశమై డబుల్ డిజిట్ స్థానాలు గెలుపు లక్ష్యంగా ప్లాన్ రచించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..