AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Fraud: ఫోర్జరీ పత్రాలతో వినియోగదారులకు ఎస్‌బీఐ మేనేజర్ కుచ్చుటోపి.. రూ. కోట్లు స్వాహా!

ఇద్దరు ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్లు కుమ్మక్కయ్యారు. వినియోగదారుల పేరుతోనే రుణాలు మంజూరు చేశారు. వారికి తెలియకుండానే మంజూరైన కోట్ల రూపాయలను దర్జాగా ఖాళీ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో.. అవాక్కైన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

Bank Fraud: ఫోర్జరీ పత్రాలతో వినియోగదారులకు ఎస్‌బీఐ మేనేజర్ కుచ్చుటోపి.. రూ. కోట్లు స్వాహా!
Sbi Bank
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Mar 09, 2024 | 1:33 PM

Share

ఇద్దరు ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్లు కుమ్మక్కయ్యారు. వినియోగదారుల పేరుతోనే రుణాలు మంజూరు చేశారు. వారికి తెలియకుండానే మంజూరైన కోట్ల రూపాయలను దర్జాగా ఖాళీ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో.. అవాక్కైన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

రామంతపూర్ లోని ఎస్‌బీఐ బ్యాంక్‌లో భగీరథ గంగ మల్లయ్య మేనేజర్‌గా గతేడాది జులై 27 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పని చేశారు ఇదే సమయంలో షేక్ సైదులు ఎస్‌బీఐకి సంబంధించిన సీసీజీ బ్రాంచ్ లో మేనేజర్ గా పనిచేసేవాడు. వీరిద్దరూ కలిసి 19 మంది వినియోగదారుల రుణాలను నొక్కాశారు. ఎవరైతే వ్యక్తిగత రుణాలు కావాలని బ్రాంచ్‌కు వస్తారో వారి వద్ద నుండి రుణాలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ను తీసుకుంటారు. అనంతరం వారు అర్హులు కాదని అక్కడి నుండి పంపించేస్తారు. అనంతరం వారి పేర్ల మీద రుణాలు పొంది, ఖాతాదారులకు తెలియకుండానే 2.8 కోట్ల రూపాయలను కాజేశారు ఇద్దరు మేనేజర్లు. దీంతో అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టడంతో అసల బాగోతం వెలుగులోకి వచ్చింది.

వీటిలో ప్రధానంగా ఫారం 16 ఫోర్జరీ చేసి తప్పుడు అకౌంట్ స్టేట్మెంట్లను సృష్టించి దందా చేసినట్లు విచారణలో వెల్లడైంది. వారు ఇలా వినియోగదారులు పేరా మంచూరైన రుణం డబ్బులను మేనేజర్ గా ఉన్న సైదులు అతడు భార్య షేక్ సుష్మ కుమారుడు వీరయ్యలకు సంబంధించిన అకౌంట్లకు బదిలీ చేసేవాడు. ఈ విధంగా 19 మంది వినియోగదారుల రుణాలకు సంబంధించిన డబ్బులను అంటే సుమారుగా రెండు కోట్ల 84 లక్షల రూపాయలను వారి కుటుంబ సభ్యుల ఎకౌంట్లకు మళ్ళించాడు. ఇదంతా గంగ మల్లయ్య సహకారంతో షేక్ సైదులు చేసినట్లు ఉన్నతాధికారులు విచారణలో వెల్లడైంది.

గంగ మల్లయ్య బదిలీ అనంతరం మరొక మేనేజర్ వీర వసంతరాయుడు వచ్చారు. గతంలో రుణాలకు దరఖాస్తు చేసుకున్నవారు బ్రాంచికు వచ్చి మేనేజర్‌ను కలిసి లోన్ గురించి ఆరా తీసేవారు. ఆ డాక్యుమెంట్లను పరిశీలించి చూస్తే అప్పటికే రుణం తీసుకుని తిరిగి చెల్లించని స్థితిలో బ్యాంకు జాబితాలో కనిపించింది. దీంతో వినియోగదారులు షాక్ గురయ్యారు. దీనిపై ముందుగా బ్యాంకు మేనేజర్ వసంతరాయుడు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో రెండు కోట్లకు పైగా నగదు దారిమళ్ళిన విషయాన్ని గుర్తించారు. దీంతో నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ కేసులో ఉన్న మేనేజర్లు గంగ మల్లయ్య షేక్ సైదులు అతని భార్య సుష్మ కొడుకు పీరయ్యలు పరారీలో ఉన్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
ధోనీ స్టైల్ వేరబ్బా.. దాన్ని కాపీ కొడితే ముఖం పగులుద్ది
ధోనీ స్టైల్ వేరబ్బా.. దాన్ని కాపీ కొడితే ముఖం పగులుద్ది
జస్ట్ 70 మినెట్స్.. హైదరాబాద్- విజయవాడ ప్రయాణం మరింత ఈజీ!
జస్ట్ 70 మినెట్స్.. హైదరాబాద్- విజయవాడ ప్రయాణం మరింత ఈజీ!
NEET 2026 రీ-ఎగ్జామ్‌కు గంటల ముందే దారుణం.. మరో విద్యార్థిని బలి
NEET 2026 రీ-ఎగ్జామ్‌కు గంటల ముందే దారుణం.. మరో విద్యార్థిని బలి
స్పేస్ స్టేషన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన వ్యోమగాములు
స్పేస్ స్టేషన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన వ్యోమగాములు
ఈ ఏడాదిలోనే ఎక్కువ గంటలు పగలు ఉండే రోజు ఇదే.. కారణం?
ఈ ఏడాదిలోనే ఎక్కువ గంటలు పగలు ఉండే రోజు ఇదే.. కారణం?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు
NEET అలర్ట్.. డ్రెస్ కోడ్ నుంచి ID కార్డు వరకు ఇవి తెలుసుకోండి
NEET అలర్ట్.. డ్రెస్ కోడ్ నుంచి ID కార్డు వరకు ఇవి తెలుసుకోండి
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే వాటర్ బాటిల్‌తో ఇలా చేయాలంట.. ఎందుకంటే?
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే వాటర్ బాటిల్‌తో ఇలా చేయాలంట.. ఎందుకంటే?