Kaleshwaram Project: ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకొచ్చేదెలా..? జలసౌధలో NDSA నిపుణుల కమిటీ భేటి..
కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలన తర్వాత ఎన్డీఎస్ఎ (NDSA) నిపుణుల కమిటీ జలసౌధా చేరుకుంది. అనంతరం ఎన్డీఎస్ఏ అధికారులు ఇరిగేషన్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ, ENC అధికారులతో సమావేశమయ్యారు. ప్రాజెక్టు పరిశీలనలో తేలిన అంశాలపై అధికారులతో సమీక్షిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభంలోపు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకొచ్చే అంశంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలన తర్వాత ఎన్డీఎస్ఎ (NDSA) నిపుణుల కమిటీ జలసౌధా చేరుకుంది. అనంతరం ఎన్డీఎస్ఏ అధికారులు ఇరిగేషన్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ, ENC అధికారులతో సమావేశమయ్యారు. ప్రాజెక్టు పరిశీలనలో తేలిన అంశాలపై అధికారులతో సమీక్షిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభంలోపు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకొచ్చే అంశంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగుబాటుకు కారణాలు, లోపాలను తేల్చేందుకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ రంగంలోకి దిగింది. ఆరుగురు సభ్యుల బృందం మొదటిరోజు మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించారు. తొలి రోజు ఎనిమిది గంటలకు పైగా మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించిన నిపుణుల కమిటీ.. రెండోరోజు అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్ ప్రాంతాల్లో పర్యటించారు. అన్నారం సరస్వతీ బ్యారేజ్‌లో బుంగలను పరిశీలించింది. తర్వాత బ్యారేజ్ 5 బ్లాక్‌లోని 38వ పియర్ డౌన్ స్ట్రీమ్ వెంట్‌ను స్థానిక అధికారులతో కలిసి సందర్శించింది NDSA బృందం. ఆయా బ్యారేజీలను క్షుణ్ణంగా పరిశీలించి.. తెలంగాణ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
బ్యారేజ్ కుంగిన ప్రాంతాన్ని NDSA బృందం పరిశీలించింది. దాదాపు మూడు గంటలపాటు బ్యారేజ్‌పైనే తిరిగి వివరాలు సేకరించారు. ఆ తర్వాత.. కాపర్ డ్యామ్ ద్వారా కిందకు వెళ్లారు. 7వ బ్లాక్‌లో 18, 19, 20, 21 పిల్లర్లను పరిశీలించారు. పగుళ్లు తేలిన పిల్లర్లు, క్వాలిటీని క్షేత్ర స్థాయిలో పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. బ్యారేజ్‌లోని 8 బ్లాక్‌లను దశల వారీగా పరిశీలించి.. పూర్తిగా వీడియో, ఫోటోగ్రఫి నిర్వహించారు. ఒక రోజంతా మేడిగడ్డ బ్యారేజ్ వద్దే వివరాలు సేకరించిన నిపుణుల కమిటీ.. బ్యారేజ్ అప్ స్ట్రీమ్– డౌన్ స్ట్రీమ్ వైపు విచారణ జరిపారు. ప్రధానంగా.. 20వ పిల్లర్ కుంగుబాటుపై లోతుగా అధ్యయనం జరిపారు.
వీడియో చూడండి..
పగుళ్ల కొలతలను రికార్డు చేసిన నిపుణులు.. డ్యామేజ్‌కు ముందు డామేజ్ తర్వాత తీసుకున్న చర్యలపై ఇంజనీరింగ్ అధికారులకు పలు ప్రశ్నలు సంధించారు. బ్యారేజ్ నిర్మాణానికి ముందు సాయిల్, బోర్ హోల్ టెస్టింగ్ నివేదికలపై ఆరా తీశారు. మొత్తంగా.. క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి ఒక అంచనాకు వచ్చిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందిస్తోంది. NDSA బృందం. ఇక.. నిపుణుల కమిటీ విచారణ సందర్బంగా మేడిగడ్డ దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బ్యారేజ్ వద్దకు ఇతరులను ఎవరినీ అనుమతించలేదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..