Telangana: దారుణం.. కన్న తండ్రిని హత్య చేసి, ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించి..!

తండ్రిని హత్య చేసి ఆపే ఆత్మహత్యగా చిత్రించాడు కన్న కొడుకు. అనంతరం తన తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహనికి పోస్టుమార్టం చేయించడంతో అసలు నిజం బయటపడింది. హైదరాబాద్ మహానగరంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

Telangana: దారుణం.. కన్న తండ్రిని హత్య చేసి, ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించి..!
Murder
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Balaraju Goud

Updated on: Mar 09, 2024 | 1:17 PM

తండ్రిని హత్య చేసి ఆపే ఆత్మహత్యగా చిత్రించాడు కన్న కొడుకు. అనంతరం తన తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహనికి పోస్టుమార్టం చేయించడంతో అసలు నిజం బయటపడింది. హైదరాబాద్ మహానగరంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

వనస్థలిపురం వెంకటేశ్వర కాలనీలో కన్నకొడుకే తండ్రిని గొంతు నొల్లి మీ హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. అనంతరం లుంగీతో తన తండ్రిని ఉరివేసి ఆత్మహత్యగా చిత్రించాడు ఒక కసాయి కొడుకు. పోస్టుమార్టం నివేదికలో అసలు బండారమంతా బయటపడింది. హత్యగా నిర్ధారణ కావడంతో పోలీసుల ఎదుట తన తండ్రిని తానే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు ఒప్పుకున్నాడు నిందితుడు శేఖర్.

వనస్థలిపురంలో శేఖర్ తన తండ్రి మైసయ్య కలిసి నివసిస్తున్నారు. తండ్రి మైసయ్య పేరిట మహేశ్వరం ఒకటిన్నర ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని విక్రయించి కొడుకు శేఖర్‌కు డబ్బును అప్పచెప్పాడు. అది ప్రభుత్వ భూమి అని తేలడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని కొన్న వ్యక్తి అడిగాడు. దీంతో తన తండ్రి మైసయ్యకు కొడుకు శేఖర్‌కు మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 15న తండ్రి కొడుకుల మధ్య వివాదం మరింత ముదిరింది. దీంతో గొంతు నులిమి మైసయ్యను చంపేశాడు కొడుకు శేఖర్. అనంతరం లుంగీతో ఉరివేసి ఆత్మహత్యల చిత్రీకరించాడు. నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి తన తండ్రి ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు కట్టుకథ చెప్పాడు.

అయితే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. వైద్యులు అందించిన పోస్టుమార్టం నివేదికలో మైసయ్యది ఆత్మహత్య కాదు హత్యగా తేల్చారు.దీంతో కొడుకును అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. కాగా, తానే తన తండ్రిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. చివరికి శేఖర్‌ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…