AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: మహిళా సాధికారతకు కేంద్రం చేసింది ఇదే.. వీడియోలు షేర్‌ చేసిన ప్రధాని మోదీ.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌ వేదికగా కొన్ని వీడియోలను పంచుకున్నారు. మహిళా సాధికారతకతకు తమ ప్రభుత్వం చేసిన కృషి, అమలు చేస్తున్న పలు పథకాల గురించి ప్రధాని వివరించారు. ఇందులో భాగంగా మొత్తం నాలుగు పథకాలకు సంబంధించిన వీడియోలను షేర్‌ చేశారు..

PM Modi: మహిళా సాధికారతకు కేంద్రం చేసింది ఇదే.. వీడియోలు షేర్‌ చేసిన ప్రధాని మోదీ.
Pm Modi (file Photo)
Narender Vaitla
|

Updated on: Mar 08, 2024 | 5:41 PM

Share

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌ వేదికగా కొన్ని వీడియోలను పంచుకున్నారు. మహిళా సాధికారతకతకు తమ ప్రభుత్వం చేసిన కృషి, అమలు చేస్తున్న పలు పథకాల గురించి ప్రధాని వివరించారు. ఇందులో భాగంగా మొత్తం నాలుగు పథకాలకు సంబంధించిన వీడియోలను షేర్‌ చేశారు..

ఇల్లు గౌరవానికి పునాది..

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎమ్‌ అవాస్‌ యోజన పథకం గురించి వివరించి రూపొందిచిన వీడియోను షేర్‌ చేసిన ప్రధాని. ‘ఇల్లు గౌరవానికి పునాది. ఇక్కడే సాధికారత ప్రారంభమవుతుంది, కలలు నిజమవుతాయి. మహిళల సాధికారకతకు పీఎం ఆవాస్‌ యోజన ఒక గేమ్‌ ఛేంజర్‌’ అని రాసుకొచ్చారు.

లఖపతి దీదీ యోజన..

మహిళల ఆర్థిక భద్రతకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లఖపతి దీదీ యోజన పథకానికి సంబంధించిన వీడియోను షేర్‌ చేసిన ప్రధాని.. ‘దేశవ్యాప్తంగా మహిళల సాధికారత కోసం లఖపతి దీదీ యోజన ఒక ప్రధాన మాధ్యమంగా మారుతోంది. స్వయం సహాయక సంఘాలతో అనుబంధం ఉన్న మన తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో బలమైన పాత్ర పోషిస్తున్నారు’ అంటూ రాసుకొచ్చారు.

పీఎం స్వానిధి యోజన..

ఇక కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న మరో పథకం పీఎం స్వానిధి యోజన గురించి వివరిస్తూ.. ‘ పీఎం స్వానిధి యోజన పేద కార్మికుల జీవితాల్లో కొత్త ఆనందాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం లబ్ధిదారుల్లో పెద్ద సంఖ్యలో మన మన తల్లులు, సోదరీమణులు ఉన్నారని’ రాసుకొచ్చారు.

నమో డ్రోన్‌ దీదీ..

ఆధునిక మహిళల సాధికారకతకు నిదర్శనంలా తీసుకొచ్చిన నమో డ్రోన్‌ దీదీస్‌ పథకం గురించి వివరిస్తూ.. ‘మహిళా సాధారికత కోసం తమ ప్రభుత్వం డ్రోన్ల శక్తిని ఉపయోగిస్తోంది. ఈ ఆవిష్కరణ మహిళల స్వీయ విశ్వాసాన్ని పెంచుతుంది’ అని మోదీ రాసుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..