Residential Hostel: బాలికల వసతిగృహంలో భారీ అగ్నిప్రమాదం.. నాలుగేళ్ల చిన్నారి సజీవ దహనం

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని పొటాక్‌బిన్ బాలికల హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి సజీవదహనమైంది. రాజీవ్‌గాంధీ ఎడ్యుకేషనల్‌ విజన్‌ జిల్లా కోఆర్డినేటర్‌ విజయేంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా ఊసూర్‌ బ్లాక్‌లోని ఆవుపల్లి చింతకుంట గ్రామంలో బాలికల పోర్టా క్యాబిన్ (ప్రీఫ్యాబ్రికేటెడ్ పోర్టబుల్ స్ట్రక్చర్) రెసిడెన్షియల్‌ పాఠశాల వసతిగృహంలో దాదాపు 380 మంది బాలికలు ఉంటున్నారు..

Residential Hostel: బాలికల వసతిగృహంలో భారీ అగ్నిప్రమాదం.. నాలుగేళ్ల చిన్నారి సజీవ దహనం
Fire Accident At Chhattisgarh Residential Girls Hostel
Follow us

|

Updated on: Mar 08, 2024 | 5:16 PM

బీజాపూర్, మార్చి 8: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని పొటాక్‌బిన్ బాలికల హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి సజీవదహనమైంది. రాజీవ్‌గాంధీ ఎడ్యుకేషనల్‌ విజన్‌ జిల్లా కోఆర్డినేటర్‌ విజయేంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా ఊసూర్‌ బ్లాక్‌లోని ఆవుపల్లి చింతకుంట గ్రామంలో బాలికల పోర్టా క్యాబిన్ (ప్రీఫ్యాబ్రికేటెడ్ పోర్టబుల్ స్ట్రక్చర్) రెసిడెన్షియల్‌ పాఠశాల వసతిగృహంలో దాదాపు 380 మంది బాలికలు ఉంటున్నారు. బుధవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా వసతి గృహంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనలకు గురైన బాలికలు బయటకు పరుగులు తీశారు. వెంటనే పాఠశాల అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కాసేపటికి అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదంలో లిస్సా(4) అనే బాలిక మంటల్లో చిక్కుకొని సజీవ దహనమైంది.

మృతురాలు లిస్సా పాఠశాల విద్యార్ధిని కాదు. అదే హాస్టల్‌లో ఎనిమిదో తరగతి చదువుతోన్న తన అక్క ఇటీవల ఆమె తన స్వగ్రామం తిమ్మాపూర్‌ వెళ్లగా తనతో పాటు చెల్లెలు లిస్సాను తీసుకొచ్చింది. దీంతో గత కొన్ని రోజులుగా లిస్సా అక్కతో పాటే ఉంటోంది. ఆమెను తీసుకెళ్లడానికి ఇటీవల తల్లిదండ్రులు వచ్చినా, అక్కతో కొద్ది రోజులు ఉండి వస్తానని చెప్పింది. ఇంతలో ఈ దారుణం చోటు చేసుకుంది. అప్పుడే తమతోపాటు వచ్చి ఉంటే తమ బిడ్డ ప్రాణాలతో ఉండేదని ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు ప్రతిఒక్కరినీ కలచివేసింది.

ఇవి కూడా చదవండి

కాగా తాజా ప్రమాదంలో బాలికల వసతి గృహం (పోర్టా క్యాబిన్) పూర్తిగా దగ్ధమైంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కొన్ని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి పోర్టా క్యాబిన్‌లను ఏర్పాటు చేస్తుంటారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.