Rupert Murdoch: 93 ఏళ్ల వయసులో ఐదో పెళ్లికి రెడీ అయిన ప్రముఖ వ్యాపారవేత్త.. 67 ఏళ్ల ప్రియురాలితో త్వరలో పెళ్లి!

ప్రముఖ ఆస్ట్రేలియన్-అమెరికన్ బిలియనీర్, దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ మరోమారు వార్తల్లో నిలిచారు. 93 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లికి రెడి అయిపోయారు. ఇటీవల తన ప్రియురాలు 67 ఏళ్ల ఎలీనా జుకోవాతో ఎంగేజ్‌ మెంట్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఐదో పెళ్లి చేసుకోబోతున్నట్లు అమెరికా స్థానిక మీడియా సంస్థలు వెల్డించాయి. ఈ జంట వచ్చే జూన్‌లో కాలిఫోర్నియాలోని మర్దోక్‌ ఎస్టేట్‌లో వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. పెళ్లి పనులు కూడా మొదలు పెట్టారని, ఆహ్వానాలు కూడా పంపించినట్లు తెలుస్తోంది..

Rupert Murdoch: 93 ఏళ్ల వయసులో ఐదో పెళ్లికి రెడీ అయిన ప్రముఖ వ్యాపారవేత్త.. 67 ఏళ్ల ప్రియురాలితో త్వరలో పెళ్లి!
Rupert Murdoch
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 08, 2024 | 5:44 PM

వాషింగ్టన్‌, మార్చి 8: ప్రముఖ ఆస్ట్రేలియన్-అమెరికన్ బిలియనీర్, దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ మరోమారు వార్తల్లో నిలిచారు. 93 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లికి రెడి అయిపోయారు. ఇటీవల తన ప్రియురాలు 67 ఏళ్ల ఎలీనా జుకోవాతో ఎంగేజ్‌ మెంట్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఐదో పెళ్లి చేసుకోబోతున్నట్లు అమెరికా స్థానిక మీడియా సంస్థలు వెల్డించాయి. ఈ జంట వచ్చే జూన్‌లో కాలిఫోర్నియాలోని మర్దోక్‌ ఎస్టేట్‌లో వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. పెళ్లి పనులు కూడా మొదలు పెట్టారని, ఆహ్వానాలు కూడా పంపించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాగులు పెళ్లిళ్లు చేసుకున్న ఈ బిలియనీర్‌ ఐదో పెళ్లికి సిద్ధం అయ్యారు. ఎలీనా జుకోవాతో ఆరోసారి ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. గతేడాది ఆన్‌ లెస్లీ స్మిత్‌తో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. అయితే నెల వ్యవధిలోనే ఆ బంధానికి ముగింపు పలికారు. ఆ తర్వాత తన మాజీ భార్యల్లో ఒకరైన విన్‌డీ డెంగ్‌ ఇచ్చిన ఓ పార్టీలో మర్దోక్‌కు జుకోవా పరిచయమైంది. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అప్పటి నుంచి డేటింగ్‌లో ఉన్న ఈ జంట త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. రష్యాకు చెందిన ఎలీనా జుకోవా అమెరికాకు వలస వచ్చారు. ఇది ఆమెకు రెండో పెళ్లి. గతంలో మాస్కో ఆయిల్‌ బిలియనీర్‌ అలెగ్జాండర్‌తో వివాహం జరగగా.. వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. వీరికి ఓ కుమార్తె దాషా కూడా ఉంది. దాషా రష్యన్‌ ఓలిగార్క్‌ను పెళ్లి చేసుకుని విడిపోయారు.

ఇక మర్దోక్ విషయానికొస్తే.. ఇప్పటికే ఆయన నలుగురిని పెళ్లి చేసుకురి వారితో తెగదెంపులు చేసుకున్నారు. ఆయన మొదట ఆస్ట్రేలియాకు చెందిన పాట్రిషియా బుకర్‌ను వివాహం చేసుకున్నారు. 1960లో విడిపోయారు. ఆ తర్వాత జర్నలిస్ట్‌ అన్నా మరియా మన్‌, చైనా వ్యాపారవేత్త విన్‌డీ డెంగ్‌, అమెరికా మోడల్‌ జెర్రీ హాల్‌తో వివాహాలే, విడాకులు చకచకా అయిపోయాయి. నాలుగో భార్య జెర్రీ హాల్‌తో విడిపోయిన 7 నెలలు పూర్తికాకముందే ఆయన లెస్లీతో నిశ్చితార్థం చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. వీరి నిశ్చితార్థం జరిగిన వారాల వ్యవధిలోనే విడిపోయారు. రెండో భార్యతో విడిపోయిన సందర్భంలో ఆయన ఏకంగా 1.7 బిలియన్‌ డాలర్లు భరణంగా చెల్లించారు. ఇది అత్యంత ఖరీదైన భరణాల్లో ఒకటిగా నలిచిపోయింది.

రూపర్ట్ మర్దోక్ 1950ల్లో న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌, ది సన్‌ అనే వార్తా పత్రికలను స్థాపించడం ద్వారా మీడియా కెరీర్‌ ప్రారంభించారు. ఆ తర్వాత న్యూయార్క్‌ పోస్ట్‌, వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ వంటి పబ్లికేషన్స్‌ను కొనుగోలు చేశారు. 1996లో ఫాక్స్‌ న్యూస్‌ను, 2013లో న్యూస్‌కార్ప్‌ను స్థాపించారు. 2011లో వెలుగులోకి వచ్చిన ఫోన్‌ హ్యాకింగ్‌ కుంభకోణం కారణంగా న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ పత్రికను మూతపడింది. గతేడాది సెప్టెంబరులో కుమారులకు వ్యాపార బాధ్యతలు అప్పిగించిన మర్దోక్‌.. ప్రస్తుతం ఆ సంస్థలకు గౌరవ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా