Liver Diseases in Women: మహిళల్లో పెరుగుతున్న లివర్‌ ఫెయిల్యూర్స్‌.. కారణం ఏమిటో తెలుసా?

కాలేయ వ్యాధులకు అనేక కారణాలు ఉన్నాయి. కానీ కొన్ని కారణాల వల్ల పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఈ వ్యాధి బారీన పడుతున్నారు. జీవనశైలి అలవాట్లు, జన్యుపరమైన కారకాలు కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. అయితే మహిళలు స్వయం ప్రతిరక్షక వ్యాధులకు ఎక్కువగా గురవుతారు. అందువల్లనే ఆటో ఇమ్యూన్ సంబంధిత కాలేయ వాపు, హెపటైటిస్ మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. మహిళల్లో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇది సాధారణంగా ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత, మెటబాలిక్ సిండ్రోమ్‌తో సంబంధం..

Liver Diseases in Women: మహిళల్లో పెరుగుతున్న లివర్‌ ఫెయిల్యూర్స్‌.. కారణం ఏమిటో తెలుసా?
Liver Diseases In Women
Follow us

|

Updated on: Mar 08, 2024 | 9:26 PM

కాలేయ వ్యాధులకు అనేక కారణాలు ఉన్నాయి. కానీ కొన్ని కారణాల వల్ల పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఈ వ్యాధి బారీన పడుతున్నారు. జీవనశైలి అలవాట్లు, జన్యుపరమైన కారకాలు కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. అయితే మహిళలు స్వయం ప్రతిరక్షక వ్యాధులకు ఎక్కువగా గురవుతారు. అందువల్లనే ఆటో ఇమ్యూన్ సంబంధిత కాలేయ వాపు, హెపటైటిస్ మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. మహిళల్లో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇది సాధారణంగా ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత, మెటబాలిక్ సిండ్రోమ్‌తో సంబంధం కలిగి ఉంటుంది. గత కొన్నేళ్లుగా మహిళల్లో కాలేయ వ్యాధుల కేసులు పెరుగుతున్నాయి. దీనికి చాలా కారణాలున్నాయి. మహిళల్లో ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది దీర్ఘకాలిక పరిస్థితికి దారి తీస్తుంది. దీనివల్ల శరీర రోగనిరోధక వ్యవస్థ పొరపాటున కాలేయ కణాలపై దాడి చేస్తుంది. అందువల్లనే లివర్‌ వాపు రావడం, లివర్‌ దెబ్బతినడం జరుగుతుంది. ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా సంభవిస్తుంది. ఈ వ్యాధి కాలేయ వైఫల్యానికి కారణమవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, గత రెండు దశాబ్దాలలో మహిళల్లో కాలేయ వ్యాధి కేసులు పెరిగాయి. వీటిలో ఫ్యాటీ లివర్‌, లివర్‌ సిర్రోసిస్‌ వ్యాధులు అధికంగా ఉన్నాయి.

మహిళల్లోనే కాలేయ వ్యాధులు ఎందుకు పెరుగుతున్నాయి?

హెపటైటిస్ ఎ, బి, సి, డి, ఇ కాలేయంలో మంటను కలిగిస్తాయని సనార్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్‌లోని హెచ్‌పిబి సర్జరీ అండ్‌ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ విభాగం హెచ్‌ఓడి డాక్టర్ అంకుర్ గార్గ్ అంటున్నారు. మహిళల్లో హెపటైటిస్ ఇ కేసులు పెరుగుతున్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటితోపాటు కాలేయ వ్యాధుల కేసులు కూడా పెరుగుతున్నాయి. నేటికాలంలో మద్యం సేవించే ధోరణి మహిళల్లో పెరిగింది. ఈ అలవాటు కాలేయాన్ని దెబ్బతీస్తుంది. కొన్ని మందులు కాలేయానికి హాని కలిగిస్తాయి. నోటి గర్భనిరోధకాలు వంటివి కాలేయ సామర్థ్యాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా మహిళల్లో నోటి గర్భనిరోధకాలు తీసుకునే ధోరణి పెరిగింది. మహిళల్లో కాలేయ వ్యాధులు పెరగడానికి ఇది కూడా ప్రధాన కారణం. ఇది కాకుండా, తప్పుడు ఆహారపు అలవాట్లు, మద్యపానం కూడా మహిళల్లో కాలేయ వ్యాధిని పెంచడానికి ప్రమాద కారకాలు.

ఇవి కూడా చదవండి

మరైతే ఏం చేయాలి?

  • సరైన ఆహారం తీసుకోవాలి
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
  • తగినంత నిద్ర పోవాలి
  • ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి
  • మద్యం సేవించకూడదు
  • ఫాస్ట్ ఫుడ్ మానుకోవాలి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ