మహిళలూ.. మీరిది తప్పకుండా చేయాల్సిందే.. లేదంటే ??

సాధారణంగా చాలామంది మహిళలు ఇంటిపని, బాధ్యతలతో తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోరు. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని నిపుణులు ఎంత చెప్పినా కొందరు లైట్‌ తీసుకుంటారు. ఇంటి పనులతోనే సరిపోతుంది. ఇంక వ్యాయామానికి టైమెక్కడ? అంటుంటారు. ఇక ఉద్యోగం చేసే మహిళలైతే అస్సలు చెప్పనక్కర్లేదు. కొందరు ఇంటిపని, ఆఫీసుపని చక్కగా నిర్వర్తిస్తూ చాలా చురుకుగా ఆరోగ్యంగా ఉన్నాం.. ఇంకా ప్రత్యేకంగా ఎక్సర్‌సైజులెందుకు అనుకుంటారు. కానీ అదే పొరపాటు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మహిళలూ.. మీరిది తప్పకుండా చేయాల్సిందే.. లేదంటే ??

|

Updated on: Mar 08, 2024 | 6:32 PM

సాధారణంగా చాలామంది మహిళలు ఇంటిపని, బాధ్యతలతో తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోరు. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని నిపుణులు ఎంత చెప్పినా కొందరు లైట్‌ తీసుకుంటారు. ఇంటి పనులతోనే సరిపోతుంది. ఇంక వ్యాయామానికి టైమెక్కడ? అంటుంటారు. ఇక ఉద్యోగం చేసే మహిళలైతే అస్సలు చెప్పనక్కర్లేదు. కొందరు ఇంటిపని, ఆఫీసుపని చక్కగా నిర్వర్తిస్తూ చాలా చురుకుగా ఆరోగ్యంగా ఉన్నాం.. ఇంకా ప్రత్యేకంగా ఎక్సర్‌సైజులెందుకు అనుకుంటారు. కానీ అదే పొరపాటు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ ధోరణి అనారోగ్యానికి ఆహ్వానం పలకడమే అంటున్నారు. అంతేకాదు చాలామంది మహిళలు ఊబకాయంతో సతమతమవుతుంటారు. ఇలాంటి వారికి వ్యాయామం తప్పనిసరి అంటున్నారు. మహిళలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, కీళ్లనొప్పులు వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చని, అందుకు మహిళలు తప్పనిసరిగా చేయాల్సిన నాలుగు వ్యాయామాలు గురించి నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం. మహిళలు చేయాల్సిన మొట్టమొదటి వ్యాయామం.. వాకింగ్‌. నడక గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, కీళ్లు, కండరాల నొప్పులు తగ్గించడంలో సహాయపడుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తలనొప్పిగా ఉందని పక్కకు వెళ్లి కూర్చున్నాడు.. అంతే క్షణాల్లో..

అనంత్‌ అంబానీ వాచ్‌కి జుకర్‌బర్గ్‌ సతీమణి ఫిదా

గురిపెడితే బుల్లెట్ దిగాల్సిందే.. ఈ మహిళా స్నైపర్ రూటే సపరేటు..

వైఫ్ సీరియస్.. ఆ విషయంలో స్టార్ హీరోకు వార్నింగ్

Premalu: మలయాళం సూపర్ హిట్ ప్రేమలు మూవీ హిట్టా ?? ఫట్టా ??

Follow us