AP DSC 2024 Postponed: ఏపీ డీఎస్సీ 2024 పరీక్ష వాయిదా.. కొత్త తేదీలను ప్రకటించిన సర్కార్! పూర్తి షెడ్యూల్‌ ఇదే..

ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌), ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ-డీఎస్సీ)ల షెడ్యూల్‌ను మార్చాలంటూ హైకోర్టు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ 2024 పరీక్షలపై ఏపీ సర్కార్‌ ఎట్టకేలకు వెనకడుగు వేసింది. ఈ మేరకు డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. కొత్త తేదీల ప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 30 వరకు ఉపాధ్యా నియమాక పరీక్షలు (డీఎస్సీ) నిర్వహించేలా..

AP DSC 2024 Postponed: ఏపీ డీఎస్సీ 2024 పరీక్ష వాయిదా.. కొత్త తేదీలను ప్రకటించిన సర్కార్! పూర్తి షెడ్యూల్‌ ఇదే..
AP DSC 2024 New Exam Dates
Follow us

|

Updated on: Mar 10, 2024 | 4:05 PM

అమరావతి, మార్చి 10: ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌), ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ-డీఎస్సీ)ల షెడ్యూల్‌ను మార్చాలంటూ హైకోర్టు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ 2024 పరీక్షలపై ఏపీ సర్కార్‌ ఎట్టకేలకు వెనకడుగు వేసింది. ఈ మేరకు డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. కొత్త తేదీల ప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 30 వరకు ఉపాధ్యా నియమాక పరీక్షలు (డీఎస్సీ) నిర్వహించేలా కొత్త షెడ్యూలును రూపొందించినట్లు పాఠశాల విద్య కమిషనర్‌ సురేష్‌కుమార్‌ శనివారం (మార్చి 9) రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. కాగా మొత్తం 6,100 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. డీఎస్సీ నోటిఫికేషన్‌తో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నోటిఫికేషన్‌ కూడా సర్కార్ విడుదల చేసింది. ఇప్పటికే టెట్‌ పరీక్షలు పూర్తికాగా ఫలితాలు వెల్లడించవల్సి ఉంది.

గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు మార్చి15 నుంచి ఉపాధ్యాయ నియామకం కోసం డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కావల్సి ఉంది. అయితే టెట్‌ పరీక్షకు, డీఎస్సీ పరీక్షకు కనీసం నాలుగు వారాల సమయం కావాలని శ్రీకాకుళం జిల్లాకు చెందిన పెద్దిరాజు, మరో నలుగురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. టెట్‌ ముగిసిన వెంటనే డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నారని, ప్రిపరేషన్‌కు అభ్యర్థులకు తగిన సమయంలేదని పిటిషనర్లు తెలిపారు. ఈ పిటీషన్లను విచారించిన కోర్టు ఆ మేరకు టెట్, డీఎస్సీ మధ్య నాలుగు వారాలు గడువు ఉండేలా పరీక్షల షెడ్యూల్ చేయాలని మార్చి 4న ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ పరీక్ష షెడ్యూల్లో మార్పులుచేస్తూ నూతన షెడ్యూల్‌ రూపొందించినట్లు సురేష్‌కుమార్‌ వెల్లడించారు. ఏప్రిల్‌లో జేఈఈ తదితర ఎంట్రన్స్‌ పరీక్షలు ఉండటంతో పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉండవలని, అందువల్లనే మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 30 వరకూ డీఎస్సీ పరీక్షలు నిర్వహించేలా షెడ్యూలు రూపొందించినట్లు తెలిపారు. ఇతర పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ లో చూసుకోవచ్చునని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

డీఎస్సీ 2024 కొత్త షెడ్యూల్‌ ఇదే..

  • మార్చి 20 నుంచి అభ్యర్థులు ఎగ్జాం సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్‌ ఆప్షన్స్‌ ఇచ్చుకోవాలి.
  • మార్చి 25 నుంచి హాల్‌ టికెట్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. రోజుకు రెండు సెషన్ల చొప్పున మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 3 వరకూ మొత్తం 10 సెషన్లలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పరీక్ష నిర్వహిస్తారు.
  • టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్‌ పోస్టులకు ఏప్రిల్‌ 7న ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్‌ ప్రొఫీషియన్సీ టెస్టు ఉంటుంది.
  • స్కూల్‌ అసిస్టెంట్, టీజీటీ, పీజిటి, ఫిజికల్‌ డైరెక్టర్, ప్రిన్సిపల్‌ పరీక్షలను ఏప్రిల్‌ 13 నుంచి ఏప్రిల్‌ 30 వరకు నిర్వహిస్తారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
మీ విజయాన్ని ఆపే శత్రువులు ఇవే.. అవి మీలోనే ఉన్నాయి..
మీ విజయాన్ని ఆపే శత్రువులు ఇవే.. అవి మీలోనే ఉన్నాయి..
మార్కెట్‌లోకి సూపర్ మైలేజ్‌నిచ్చే నయా ఈవీ స్కూటర్ లాంచ్
మార్కెట్‌లోకి సూపర్ మైలేజ్‌నిచ్చే నయా ఈవీ స్కూటర్ లాంచ్
కుమార్తె బర్త్ డే.. ఆటోవాలా చేసిన పనికి ఫిదా కావాల్సిందే.. వీడియో
కుమార్తె బర్త్ డే.. ఆటోవాలా చేసిన పనికి ఫిదా కావాల్సిందే.. వీడియో
ఒక్క ఫోన్ కాల్.. యువతికి నిద్ర లేని రాత్రులను తెచ్చింది..!
ఒక్క ఫోన్ కాల్.. యువతికి నిద్ర లేని రాత్రులను తెచ్చింది..!
క్రికెటర్‏తో అవికా గోర్ స్పెషల్ ఆల్బమ్..
క్రికెటర్‏తో అవికా గోర్ స్పెషల్ ఆల్బమ్..
కొనుగోలుదారుడికి వాడేసిన ల్యాప్‌టాప్ పంపిన అమెజాన్
కొనుగోలుదారుడికి వాడేసిన ల్యాప్‌టాప్ పంపిన అమెజాన్
వృద్ధాప్యంలో మీకు నిశ్చింత.. రోజుకు రూ. 50తో రూ. 31లక్షల సంపాదన..
వృద్ధాప్యంలో మీకు నిశ్చింత.. రోజుకు రూ. 50తో రూ. 31లక్షల సంపాదన..
'అక్షయ తృతీయ రోజు అమ్మకు బంగారు కానుక'..తల్లికి రైతు బిడ్డ గిఫ్ట్
'అక్షయ తృతీయ రోజు అమ్మకు బంగారు కానుక'..తల్లికి రైతు బిడ్డ గిఫ్ట్
పన్ను చెల్లించే ఉద్యోగులకు అలెర్ట్.. ఆ ఫామ్ లేకపోతే పన్ను బాదుడు
పన్ను చెల్లించే ఉద్యోగులకు అలెర్ట్.. ఆ ఫామ్ లేకపోతే పన్ను బాదుడు
వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో మరో కాంగ్రెస్ నేత..!
వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో మరో కాంగ్రెస్ నేత..!