Delhi Court: ఐటీఆర్ దాఖలు చేయలేదనీ.. మహిళకు ఆరు నెలలు జైలు శిక్ష విధించిన కోర్టు
రెండు కోట్ల ఆదాయంపై ఐటీఆర్ దాఖలు చయలేదని ఓ మహిళలను దోషిగా నిర్ధారించిన ఢిల్లీ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఇన్‌కంట్యాక్స్ ఆఫీసు నమోదు చేసిన ఓ ఫిర్యాదుపై కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో నిందితురాలికి రెండు కోట్ల ఆదాయం వచ్చింది. అందుకు రూ.రెండు లక్షలు పన్ను వసూల్ చేసింది. అయితే 2014-15 సంవత్సరానికి ఎటువంటి రిటర్న్స్ నిందితురాలు దాఖలు..
న్యూఢిల్లీ, మార్చి 11: రెండు కోట్ల ఆదాయంపై ఐటీఆర్ దాఖలు చయలేదని ఓ మహిళలను దోషిగా నిర్ధారించిన ఢిల్లీ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఇన్‌కంట్యాక్స్ ఆఫీసు నమోదు చేసిన ఓ ఫిర్యాదుపై కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో నిందితురాలికి రెండు కోట్ల ఆదాయం వచ్చింది. అందుకు రూ.రెండు లక్షలు పన్ను వసూల్ చేసింది. అయితే 2014-15 సంవత్సరానికి ఎటువంటి రిటర్న్స్ నిందితురాలు దాఖలు చేయలేదని ఇన్‌కంట్యాక్స్ ఆఫీసు ఆరోపించింది.
వాదనల సమయంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (SPP) అర్పిత్ బాత్రా మాట్లాడుతూ.. ఒక దోషికి శిక్ష విధించడానికి అవసరమైనది పన్ను ఎగవేత మొత్తం కాదని, నిబంధనలే ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. సకాలంలో తమ ఆదాయ రిటర్న్‌ను ఫైల్ చేయడానికి, తదనుగుణంగా పన్ను చెల్లించడమే ఈ నిబంధన ఉద్దేశ్యం అని కూడా వివరించారు. నిందితురాలు సకాలంలో పన్ను చెల్లించనందున గరిష్ట స్థాయిలో జైలు శిక్ష విధించాలని, అలాగే అధికమొత్తంలో జరిమానా కూడా విధించాలని ఈ సందర్భం ఆయన పేర్కాన్నారు. మరోవైపు దోషి వితంతు మహిళ అని, చదువుకోలేదని దోషి తరపు న్యాయవాది (ప్రాసిక్యూషన్) కోర్టుకు తెలియజేశారు. నిందితురాలు సావిత్రి కుటుంబంలో ఆమె తప్ప కుటుంబాన్ని పోషించే వారు ఎవరూ లేరని అన్నారు. ప్రాసిక్యూషన్ ప్రకారం 2014-15 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయబడిందా లేదా అనే దానిపై డేటాను ధృవీకరించడానికి దోషికి సెప్టెంబర్ 11, 2017న ఓ నోటీస్ జారీ చేశారు. అయితే నిందితులు దానిపై స్పందించడంలో విఫలమయ్యారని ప్రాసిక్యూషన్ చెప్పారు.
ఈ కేసులో వాదనలు విన్న అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మయాంక్ మిట్టల్ కేసు పూర్వపరాలను పరిగణనలోకి తీసుకుని నిందితురాలు సావిత్రికి జైలుశిక్ష విధించారు. నిందితురాలికి ఆరునెలల సాధారణ జైలుశిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తున్నట్లు ఏసీఎఎం మిట్టల్ తెలిపారు. జరిమానా చెల్లించడంలో విఫలమైతే మరో నెల అదనంగా జైలు శిక్ష అనుభవించవల్సి ఉంటుందని మార్చి 4 ఏసీఎఎం మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కోర్టులో కేసును సవాల్ చేసేందుకు 30 రోజుల పాటు బెయిల్ కూడా మంజూరీ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.