PM Modi: మహిళల డ్రోన్ ప్రదర్శనలు వీక్షించిన ప్రధాని మోదీ..
దేశవ్యాప్తంగా 10 వేర్వేరు ప్రదేశాల నుంచి ‘నమో డ్రోన్ దీదీ’లు ఏకకాలంలో డ్రోన్ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని 1000 మంది నమో డ్రోన్ దీదీలకు డ్రోన్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. 21వ శతాబ్ధంలో నారీ శక్తి భారతదేశ సాంకేతిక విప్లవానికి నాయకత్వం వహించగలదని...

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీలో నిర్వహించిన ‘సుశక్త్ నారీ విక్షిత్’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలకు దాదాపు రూ. 2,000 కోట్ల క్యాపిటలైజేషన్ సహాయ నిధిని మోదీ ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇదే కార్యక్రమంలోనే వ్యవసాయ డ్రోన్ ప్రదర్శలను వీక్షించారు.
దేశవ్యాప్తంగా 10 వేర్వేరు ప్రదేశాల నుంచి ‘నమో డ్రోన్ దీదీ’లు ఏకకాలంలో డ్రోన్ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని 1000 మంది నమో డ్రోన్ దీదీలకు డ్రోన్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని.. 21వ శతాబ్ధంలో నారీ శక్తి భారతదేశ సాంకేతిక విప్లవానికి నాయకత్వం వహించగలదని తాను నమ్ముతున్నానన్నారు. ప్రస్తుతం భారతీయ మహిళలు ఐటీ, అంతరిక్షం, సైన్స్ రంగాల్లో రాణిస్తున్నారని, మహిళా వాణిజ్య పైలట్ల సంఖ్యలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందనన్నారు.
నమో దీదీ డ్రోన్ కార్యక్రమం ద్వారా 15000 స్వయం సహాయక బృందాలను అనుసంధానం చేసి, మహిళలను డ్రోన్ పైలట్‌లుగా తీర్చిదిద్దనున్నట్లు మోదీ చెప్పుకొచ్చారు. ఈ డ్రోన్‌లు వ్యవసాయం అవసరాల కోసం, పంటల పర్యవేక్షణ, ఎరువులు జల్లడం, విత్తనాలు విత్తడం వంటి వాటితో మహిళలకు అతనపు ఆదాయ అవకాశాలు దక్కుతాయన్నారు. రానున్న రోజుల్లో దేశంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగం పెరగనుందని చెప్పుకొచ్చారు.
గత 10 ఏళ్లలో దేశంలో స్వయం సహాయక బృందాలు విస్తరించిన తీరు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్న మోదీ.. భారతదేశంలోని స్వయం సహాయక సంఘాలు మహిళా సాధికారత రంగంలో కొత్త చరిత్ర సృష్టించాయని అన్నారు. తాను మహిళా సాధికారత గురించి మాట్లాడినప్పుడల్లా కాంగ్రెస్ వంటి పార్టీలు తనను ఎగతాళి చేశాయన్న మోదీ, కానీ తమ ప్రభుత్వ పథకాలు అనుభవాల ఫలితమేనని ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




