AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oscars 2024: ఆస్కార్‌ వేదికపై రెడ్‌ పిన్‌లతో కనిపించిన హాలీవుడ్‌ అగ్రనటులు..! దీని అర్ధం ఏంటో తెలుసా..

లాస్ ఏంజిల్స్‌లో జ‌రిగిన 96వ అకాడ‌మీ అవార్డుల ప్రదానోత్సవంలో కొంద‌రు హాలీవుడ్‌ న‌టులు చిన్న సైజు రెడ్ పిన్స్ ధ‌రించి కనిపించారు. బిల్లీ ఎలిష్, ఫిన్నియాస్, మార్క్ రుఫెలో, అవా డువెర్నే, రామీ యూసఫ్ వంటి అనేక మంది ప్రముఖ నటులు చిన్న రెడ్ పిన్స్ ధరించి రెడ్‌ కార్పెట్‌పై కనిపించారు. ఈ పిన్‌ మధ్యలోఅరచేతి గుర్తు, అరచేతి మధ్యలో నల్ల రంగులో హార్ట్‌ సింబల్‌ ఉంది. ఈ విధమైన రెడ్ పిన్స్ ధ‌రించిన హాలీవుడ్‌ న‌టుల ఫోటోలు..

Oscars 2024: ఆస్కార్‌ వేదికపై రెడ్‌ పిన్‌లతో కనిపించిన హాలీవుడ్‌ అగ్రనటులు..! దీని అర్ధం ఏంటో తెలుసా..
Hollywood Stars Wear Red Pins At Oscars 2024
Srilakshmi C
|

Updated on: Mar 11, 2024 | 4:15 PM

Share

లాస్ ఏంజిల్స్‌, మార్చి 11: లాస్ ఏంజిల్స్‌లో జ‌రిగిన 96వ అకాడ‌మీ అవార్డుల ప్రదానోత్సవంలో కొంద‌రు హాలీవుడ్‌ న‌టులు చిన్న సైజు రెడ్ పిన్స్ ధ‌రించి కనిపించారు. బిల్లీ ఎలిష్, ఫిన్నియాస్, మార్క్ రుఫెలో, అవా డువెర్నే, రామీ యూసఫ్ వంటి అనేక మంది ప్రముఖ నటులు చిన్న రెడ్ పిన్స్ ధరించి రెడ్‌ కార్పెట్‌పై కనిపించారు. ఈ పిన్‌ మధ్యలోఅరచేతి గుర్తు, అరచేతి మధ్యలో నల్ల రంగులో హార్ట్‌ సింబల్‌ ఉంది. ఈ విధమైన రెడ్ పిన్స్ ధ‌రించిన హాలీవుడ్‌ న‌టుల ఫోటోలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. దీంతో అనేక మంది నెటిజన్లు ఈ రెడ్‌ పిన్‌ అర్ధం ఏంటి అంటూ ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతోన్న ఇజ్రాయెల్-హమాస్ వివాదంలో కాల్పుల విరమణ కోసం పిలుపునిస్తూ ఈ రెడ్‌ పిన్‌లు ధరించామని ‘పూర్ థింగ్స్’ నటుడు రమీ యూసఫ్ మీడియాకు వివరించారు. ఈ పిన్స్ గాజాలో శాంతిని కోరేందుకు క్రియేటివ్‌ల నేతృత్వంలోని చొరవలో భాగమని వివరించారు.

ఇజ్రాయిల్ – హ‌మాస్ సంక్షోభానికి తక్షణమే తెర‌దించాల‌ని, కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని పాటించాల‌ని, గాజాలో శాశ్వతంగా, త‌క్షణ‌మే కాల్పుల విర‌మ‌ణ పాటించాల‌ని, ప్రతి ఒక్కరూ సుర‌క్షితంగా ఉండాల‌ని పిలుపు ఇస్తున్నామ‌ని అన్నారు. పాల‌స్తీనా ప్రజ‌లకు కూడా శాంతి ద‌క్కాల‌ని, పిల్లల్ని చంప‌డం ఆపేయండని న‌టుడు యూసెఫ్ తెలిపారు. సెలబ్రెటీలు, సిని పరిశ్రమ సభ్యులకు ఆర్టిస్ట్‌4సీజ్‌ఫైర్ అనే సంస్థ ఆ రెడ్ పిన్నుల‌ను అందించినట్లు తెలిపారు. వీరంతా గాజాలో శాంతి నెల‌కొల్పాల‌ని కోరుతూ ఓ బహిరంగ లేఖ‌పై సంత‌కం చేసి అధ్యక్షుడు బైడెన్‌కు పంపారు. ఇజ్రాయెల్ – గాజాలో హింసను అరికట్టడానికి తక్షణ చర్య తీసుకోవాలని లేఖలో నటులందరూ కోరారు. లేఖపై సంత‌కం చేసిన న‌టుల్లో జెస్సికా చాస్టియ‌న్‌, క్వింటా బ్రున్‌స‌న్‌, రిచ‌ర్డ్ గేర్‌, అమెరికా ఫెరిరా, కేట్ బ్లాంకెట్‌, లుపిటా నుంగో, మెహ‌ర్‌షాలా అలీ ఉన్నారు.

ఇవి కూడా చదవండి

‘ప్రపంచ నాయకులందరినీ పవిత్ర భూమిలో ఉన్న జీవితాలను కాపాడాలని, ఆలస్యం లేకుండా కాల్పుల విరమణకు పిలుపునివ్వాలని మేము కోరుతున్నాం. గాజాపై బాంబు దాడికి ముగింపు పలికి, బందీలను సురక్షితంగా విడుదల చేయండి. గాజాలోని రెండు మిలియన్ల నివాసితుల్లో సగం మంది పిల్లలు, మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది శరణార్థులు, వారి వారసులు ఇళ్లను విడిచి పెట్టవలసి వస్తోంది. మానవతా దృక్పధంతో తక్షణ, శాశ్వత కాల్పుల విరమణ, బందీలందరినీ విడుదల చేయడం, గాజాలోని పౌరులకు అత్యవసరంగా మానవతా సహాయం అందించడం కోసం సామూహిక మద్దతును తెలుపుతూ రెడ్‌ పిన్‌లు ధరిస్తున్నాం’ అని మీడియాకు తెలిపారు. ‘అనాటమీ ఆఫ్ ఎ ఫాల్’ నటులు మిలో మచాడో-గ్రేనర్, స్వాన్ అర్లాడ్ పాలస్తీనా జెండా ఉన్న రెండ్‌ పిన్‌లను ధరించారు. అయితే నటుల మద్ధతును వ్యతిరేకిస్తూ పలువురు నిరసనకారులు హాలీవుడ్ వీధుల్లోకి పెద్ద ఎత్తున తరలివచ్చారు. పాలస్తీనాకు మద్దతుగా డాల్బీ థియేటర్ వెలుపల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.