Oscars 2024 Winners: 20 యేళ్ల తర్వాత జసాన్‌ యానిమేటర్‌కు రెండో ఆస్కార్‌.. డిస్నీని వెనక్కినెట్టి బరిలోకి!

లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 96వ అకాడ‌మీ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో వివిధ కేటగిరీలలో నటీనటులు ఆస్కార్ గెలుచుకున్నారు. ప్రముఖ దర్శకుడు క్రిస్టఫర్‌ నోలన్‌ తెరకెక్కించిన బయోగ్రాఫికల్‌ థ్రిల్లర్‌ ‘ఓపెన్‌ హైమర్‌’ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఎడిటింగ్‌ వంటి పలు కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఈసారి ఆస్కార్‌ విజేతల్లో..

Oscars 2024 Winners: 20 యేళ్ల తర్వాత జసాన్‌ యానిమేటర్‌కు రెండో ఆస్కార్‌.. డిస్నీని వెనక్కినెట్టి బరిలోకి!
Japanese Animator Hayao Miyazaki
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 11, 2024 | 5:54 PM

లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 96వ అకాడ‌మీ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో వివిధ కేటగిరీలలో నటీనటులు ఆస్కార్ గెలుచుకున్నారు. ప్రముఖ దర్శకుడు క్రిస్టఫర్‌ నోలన్‌ తెరకెక్కించిన బయోగ్రాఫికల్‌ థ్రిల్లర్‌ ‘ఓపెన్‌ హైమర్‌’ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఎడిటింగ్‌ వంటి పలు కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఈసారి ఆస్కార్‌ విజేతల్లో ప్రముఖ జపనీస్‌ యానిమేటర్‌ హయావో మియాజాకి (83) కూడా ఉన్నారు. ఆయన తెరకెక్కించిన సెమీ ఆటో బయోగ్రాఫికల్‌ మాస్టర్‌పీస్‌ ‘ది బాయ్‌ అండ్‌ ది హెరాన్‌’ అనే యానిమేషన్‌ చిత్రానికి గానూ రెండో సారి ఆస్కార్ వరించింది. ఆస్కార్స్‌లో బెస్ట్ యానిమేటెడ్ ఫీచ‌ర్ క్యాట‌గిరీలో ఆయనకు ఈ అవార్డు దక్కింది. 20 యేళ్ల బ్రేక్‌ తర్వాత ఆయన రెండోసారి ఆస్కార్‌ గెలుచుకోవడం విశేషం. 2003లో స్పిరిటెడ్‌ అనే మువీకి తొలిసారి ఆయనకు ఆస్కార్ దక్కింది.

కాగా ది బాయ్ అండ్ ది హెరాన్ మువీ.. తల్లిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న ఓ చిన్న పిల్లవాడి ప్రయాణానికి సంబంధించిన కథనం. ఈ మువీ యానిమే గోల్డెన్ గ్లోబ్స్, BAFTA అవార్డులు కూడా ఎగరేసుకుపోయింది. ఇతర యానిమేటెడ్‌ సినిమాలు ‘స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్’, డిస్నీ ‘ఎలిమెంటల్’, నెట్‌ఫ్లిక్స్ ‘నిమోనా’, డైలాగ్-ఫ్రీ ‘రోబోట్ డ్రీమ్స్’లకు గట్టిపోటీ ఇచ్చి ఆస్కార్ దక్కించుకుందీ మువీ. 2023 బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా 13 మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది.

‘ది బాయ్ అండ్ ది హెరాన్’ మువీ కథ ఏంటంటే..

రెండవ ప్రపంచ యుద్ధం నేపధ్యంలో ఈ చిత్రం టోక్యో ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో తన తల్లిని కోల్పోయిన12 ఏళ్ల బాలుడి జీవన ప్రయాణం ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించారు. బాలుడు తన తండ్రి, సవతి తల్లితో కలిసి తన కొత్త జీవితానికి సర్దుబాటు చేస్తున్నప్పుడు, గ్రే హెరాన్‌ అనే బాతు లాంటి ప‌క్షితో పరిచయం అవుతుంది. అది బాలుడిని అద్భుత జీవులు నివసించే ఒక రహస్యమైన టవర్‌కి తీసుకువెళుతుంది. బాలుడి దుఃఖం తొలగించి, ఓదార్పు కలిగిస్తుంది. ఆ తర్వాత బాలుడి జీవితంలో జరిగే విచిత్ర పరిణామాలు ఆసక్తి కరంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.