- Telugu News Photo Gallery Cinema photos Elections in AP put brakes on the shooting of movies in Tollywood
Telugu Movies: ఏపీలో ఎన్నికలు.. టాలీవుడ్ లో సినిమాలకు బ్రేకులు.. కారణమేంటి.?
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లు మారిపోయిందిప్పుడు టాలీవుడ్ పరిస్థితి. ఏపీలో ఎన్నికలు జరుగుతుంటే.. ఇండస్ట్రీలో సినిమాలు ఆగిపోతున్నాయి. జరుగుతున్న షూటింగ్స్‌కు కూడా బ్రేక్ ఇస్తున్నారు మేకర్స్. ఏపీ ఎన్నికలకు, సినిమాలకు ఉన్న లింకేంటి..? అసలెన్ని సినిమాల షూటింగ్ ఆగిపోయాయి.. ఏవి నడుస్తున్నాయి..? తెలుగు ఇండస్ట్రీకి ఎన్నికల గండం మొదలైంది. ఏపీలో ఎలక్షన్ వేడి పెరిగేకొద్ది.. ఆ ప్రభావం ఇండస్ట్రీపై పడుతుంది.
Updated on: Mar 11, 2024 | 5:41 PM

తెలుగు ఇండస్ట్రీకి ఎన్నికల గండం మొదలైంది. ఏపీలో ఎలక్షన్ వేడి పెరిగేకొద్ది.. ఆ ప్రభావం ఇండస్ట్రీపై పడుతుంది. కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో ఏ సినిమా షూటింగ్ కూడా అనుకున్నట్లుగా సాగట్లేదు. పెద్ద సినిమాలన్నీ ఇప్పటికే సమ్మర్ సీజన్ నుంచి తప్పుకున్నాయి. ఇమ్మీడియట్ రిలీజ్ ఉన్న కొన్ని సినిమాల షూటింగ్స్ మాత్రమే జరుగుతున్నాయి.

ఇప్పుడు సెట్స్‌పై ఉన్న సినిమాలు చాలా తక్కువ. చిరంజీవి, రామ్ చరణ్, బాలయ్య, మహేష్ బాబు, వెంకటేష్.. ఇలా చాలా మంది స్టార్ హీరోల సినిమాలేవీ సెట్స్‌పై లేవు. ఎప్రిల్ 5న విడుదల కావాలి కాబట్టి ఫ్యామిలీ స్టార్‌తో బిజీగా ఉన్నారు విజయ్ దేవరకొండ.

మే 9న రిలీజ్ డేట్ ఉంది కాబట్టి.. ఇటలీలో కల్కి 2898 ఏడి పాట చిత్రకారణతో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఇక్కడ దిశా పటానితో ఓ మాస్ సాంగ్ షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ అంత అయిపోతుందని సమాచారం. తర్వత డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే మిగిలాయి.

అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ 15న విడుదల చేయాలని ఫిక్సైపోయారు నిర్మాతలు. అందుకే ఎన్నికల సీజన్ ఉన్నా.. షూటింగ్ మాత్రం ఆగట్లేదు.

అలాగే దేవర షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది. వీళ్లు మినహా.. మిగిలిన హీరోలంతా ఎన్నికల తర్వాతే చూసుకుందాం అన్నట్లున్నారు. ఎన్నికల సీజన్ కాబట్టి సినిమాలు విడుదల చేసినా.. ప్రమోషన్ చేసుకోలేరు. ఈ సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టే షూటింగ్స్ ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టారు. ఇక హీరోలు కూడా హాయిగా ఎలక్షన్ సీజన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లెక్కన ఇండస్ట్రీకి మునపటి కళ రావాలంటే ఎన్నికలు అవ్వాల్సిందే. అప్పటి వరకు ఈ సైలెన్స్ తప్పదు.




