Heroes: ఆ హీరోలకు కష్టాలు డబుల్ కానున్నాయా..? వారే కారణమా.?
టాలీవుడ్‌లో మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఎందుకు ఆగుతున్నాయి..? స్టార్ హీరోల సినిమాలపై వందల కోట్లు పెట్టడానికి కూడా ముందుకొస్తున్న నిర్మాతలు.. మిడ్ రేంజ్ హీరోలపై 50 కోట్లు పెట్టడానికి కూడా ఎందుకంత ఆలోచిస్తున్నారు..? ఓటిటి పేరుతో జరిగిన స్కామ్‌లే దీనికి కారణమా..? ఇకపై మీడియం రేంజ్ హీరోలకు కష్టాలు డబుల్ కానున్నాయా..? ఇవన్నీ ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం..
Updated on: Mar 11, 2024 | 6:01 PM

తెలుగు ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోలకు ఊహించని కష్టాలు వచ్చాయి. ఒకప్పట్లా వీళ్లింక 20 కోట్లు కావాలి.. 25 కోట్లు కావాలి అనలేరు. నాని, రవితేజ, సాయి ధరమ్ తేజ్, రామ్, నితిన్.. ఇలా మిడ్ రేంజ్ హీరోలందరినీ ఈ కామన్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఓటిటి సంస్థల తెలివితేటలు, ముందు చూపుతో ఈ హీరోలకు షాక్ తగిలింది.

గతేడాది వరకు ఒక్కో సినిమాకు ఓటిటి రైట్స్ భారీగానే వచ్చేవి. కానీ ఇప్పుడంత సీన్ లేదు. నిర్మాతలు, ఓటిటి సంస్థలకు మధ్య బ్రిడ్జిలా ఉన్న కొందరు చేసిన స్కామ్ ఇప్పుడు మిడ్ రేంజ్ హీరోలపై పడింది. ఓ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేస్తామని ఓటిటి సంస్థలకు చెప్పి.. కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ చేసారు నిర్మాతలు. రావణాసుర, స్కంద, విరూపాక్ష లాంటి సినిమాలకు ఇదే జరిగింది.

మిడ్ రేంజ్ హీరోల సినిమాలకు కూడా పాన్ ఇండియా కదా అని భారీ రేట్ ఇచ్చాయి ఓటిటి సంస్థలు. కానీ జరుగుతున్న స్కామ్ బయటపడ్డాక సినిమాలు కొనడం తగ్గిపోయింది. మునపట్లా భారీ రేట్ కాకుండా.. రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం అంటున్నాయి ఓటిటి సంస్థలు. అందుకే గాంజా శంకర్, డబుల్ ఇస్మార్ట్ సహా చాలా సినిమాలకు బడ్జెట్ ఇష్యూస్ వస్తున్నాయి.

మొన్నటి వరకు థియెట్రికల్ పక్కనబెట్టి.. ఓటిటిని నమ్ముకున్నారు నిర్మాతలు. కానీ మళ్లీ ఇప్పుడు థియెట్రికల్ మార్కెట్‌పై ఫోకస్ చేస్తున్నారు. టాప్ హీరోలకు తప్ప.. మిడ్ రేంజ్ హీరోలకు థియెట్రికల్ రేంజ్ 30 కోట్ల కంటే తక్కువే. అందుకే పెద్ద హీరోలపై వందల కోట్లు పెడుతున్నా.. టైర్ 2 హీరోలపై 50 కోట్లు పెట్టడానికి కూడా ఆలోచిస్తున్నారు నిర్మాతలు.