- Telugu News Photo Gallery Cinema photos Why are fans worried that Tamil hero Ajith is getting regular health checkups?
Ajith: తమిళ హీరో అజిత్‌కు అసలేమైంది..? ఫ్యాన్స్ కి ఎందుకు ఇంత కంగారు.?
తమిళ హీరో అజిత్‌కు అసలేమైంది..? రెగ్యులర్ హెల్త్ చెకప్ అయితే అభిమానులు ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు..? ఆయన హాస్పిటల్ నుంచి వచ్చినా కూడా ఇంకా టెన్షన్ పడటానికి కారణమేంటి..? అజిత్ ఆరోగ్యం విషయంలో ఏమైనా దాస్తున్నారా లేదంటే అంతా బాగానే ఉందా..? అసలు అజిత్ హాస్పిటల్ ఎపిసోడ్‌పై ఆయన మేనేజర్ ఏమన్నారో తెలుసా..?
Updated on: Mar 11, 2024 | 6:16 PM

తమిళ హీరో అజిత్‌కు అసలేమైంది..? రెగ్యులర్ హెల్త్ చెకప్ అయితే అభిమానులు ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు..? ఆయన హాస్పిటల్ నుంచి వచ్చినా కూడా ఇంకా టెన్షన్ పడటానికి కారణమేంటి..? అజిత్ ఆరోగ్యం విషయంలో ఏమైనా దాస్తున్నారా లేదంటే అంతా బాగానే ఉందా..? అసలు అజిత్ హాస్పిటల్ ఎపిసోడ్‌పై ఆయన మేనేజర్ ఏమన్నారో తెలుసా..?

పేరుకు తమిళ హీరోనే అయినా.. అజిత్‌కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే అజిత్ హాస్పిటల్ న్యూస్ ఇక్కడా ట్రెండ్ అయింది. ఉన్నట్లుండి ఆయన ఆస్పత్రిలో అడ్మిట్ అవ్వడం.. బ్రెయిన్ సర్జరీ అంటూ వార్తలు రావడం.. ఇవన్నీ చూసి చాలా కంగారు పడ్డారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర అసలు ఏం జరిగిందో మీడియాకు తెలిపారు.

ఈ మధ్యే అజిత్ ప్రాణ స్నేహితుడు వెట్రి మరణించారు. ఆయన మరణం నుంచి ఈ హీరో ఇంకా బయటికి రాలేకపోతున్నారు. వెట్రి మరణం తర్వాత తన టీంలో ప్రతీ ఒక్కరు హెల్త్ చెకప్ చేయించుకోవాలని సూచించారని.. అందులో భాగంగానే అజిత్ కూడా రెగ్యులర్ చెకప్ చేయించుకున్నారని తెలిపారు ఆయన మేనేజర్.

ఆ టెస్టుల్లోనే అనుకోకుండా చెవి కింద ఓ ఇష్యూ బయటపడింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ చెవి కింద బుడుపు వల్ల ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. సర్జరీ చేసి దాన్ని తొలగించారు వైద్యులు. తాజాగా ఆయన డిశ్చార్జ్ కూడా అయ్యారు.

కానీ అంతలోనే ఆయనకు బ్రెయిన్ సర్జరీ అంటూ గాసిప్స్ రావడంతో.. అదంతా అబద్ధమని.. ఫ్యాన్స్ కంగారు పడొద్దంటూ అఫిషియల్ హెల్త్ అప్‌డేట్ ఇచ్చారు అజిత్ మేనేజర్. మరో వారం రోజుల్లో ఆయన నెక్ట్స్ సినిమా విడిముయార్చి సెట్స్‌లో జాయిన్ కానున్నారు.