AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Erithriaya Marriage: ఇక్కడ రెండు పెళ్లిళ్లు చేసుకోకపోతే జైలుకే.. ఏకంగా జీవిత ఖైదు!

భారతీయ వివాహ చట్టంలో కూడా ఒక వ్యక్తికి ఒకే భార్య అనే నిబంధన ఉంది. రెండో పెళ్లి చేసుకుంటే జైలుకెళ్లక తప్పదు. కానీ ఈ దేశంలో మాత్రం రెండో పెళ్లి చేసుకోకపోతే క్రిమినల్‌ కేసు పెట్టి, జైలు శిక్ష విధిస్తారట. అదేంటీ ఇలాంటి దేశాలు కూడా ఉంటాయా? అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు ఈ దేశం గురించి తెలుసుకోవల్సిందే..

Erithriaya Marriage: ఇక్కడ రెండు పెళ్లిళ్లు చేసుకోకపోతే జైలుకే.. ఏకంగా జీవిత ఖైదు!
Erithriaya Marriage
Srilakshmi C
|

Updated on: Mar 11, 2024 | 6:43 PM

Share

పెళ్లంటే నూరేళ్ల పంట. మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. పంచభూతాలు మేళతాలాల మధ్య అతిథుల సమక్షంలో నిండు నూరేళ్లూ ఒకరికొకరు తోడునీడగా కలిసి ఉంటామని ప్రమాణాలు చేసుకుని వధూవరులు పెళ్లి బంధంలోకి అడుగుపెడతారు. అలాగే.. ఏకపత్నీ వ్రతం ఆజన్మాతం ఆచరిస్తూ సంసార బాధ్యతలు ఆచరించాలనేది మన దేశ ఆచారం. భారతీయ వివాహ చట్టంలో కూడా ఒక వ్యక్తికి ఒకే భార్య అనే నిబంధన ఉంది. రెండో పెళ్లి చేసుకుంటే జైలుకెళ్లక తప్పదు. కానీ ఈ దేశంలో మాత్రం రెండో పెళ్లి చేసుకోకపోతే క్రిమినల్‌ కేసు పెట్టి, జైలు శిక్ష విధిస్తారట. అదేంటీ ఇలాంటి దేశాలు కూడా ఉంటాయా? అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు ఈ దేశం గురించి తెలుసుకోవల్సిందే..

ప్రపంచంలో రెండో పెళ్లి తప్పనిసరిగా చేసుకోవాలని పురుషులను ఆదేశించే దేశాలు కూడా ఉన్నాయి. ఈ దేశాల్లో ఒక పెళ్లి మాత్రమే చేసుకుంటే చట్టరిత్యా నేరం. ఈ దేశాల్లో పురులందరూ తప్పనిసరిగా ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకోవాలి. రెండో భార్యతో మొదటి భార్యకు సమస్య వస్తే..ఆ ఇద్దరూ జైలు కెళ్లాల్సిందే. తూర్పు ఆఫ్రికాలోని ఎరిత్రియాలో ఈ ఆచారం ఉంది. మన దేశంలో రెండో పెళ్లి చేసుకోవడం లేదా రెండో భార్యను కలిగి ఉండటం నేరం అయితే, ఎరిత్రియాలో అది సరిగ్గా వ్యతిరేకం. ఇక్కడ ఒక వ్యక్తి ఇద్దరు మహిళలపే వివాహం చేసుకోకపోయినా, రెండో పెళ్లి చేసుకునేందుకు నిరాకరించినా జైలు శిక్ష తప్పదు. అదికూడా చిన్నా చితక శిక్ష విధించరు. ఏకంగా జీవిత ఖైదు విధిస్తారు.

Erithriaya Marriage

Erithriaya Marriage

ఎరిట్రియాలో ఈ విధమైన చట్టం అమలు చేయడానికి ప్రత్యేక కారణం ఉంది. అక్కడ తరచూ అంతర్యుద్ధాలు జరుగుతుంటాయి. అలాంటి యుద్ధ సమయాలో ఒంటరిగా ఉన్న మహిళలు ప్రమాదం నుంచి విముక్తి పొందలేరు. అందుకే అక్కడి పురుషులు స్త్రీలను రక్షించడానికి రెండు పెళ్లిళ్లు చేసుకోవల్సి వస్తుంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఇక్కడ స్త్రీల కంటే పురుషుల సంఖ్య చాలా తక్కువ. అందుకే మహిళలు ఒంటరిగా తమ జీవితాన్ని గడపలేరని, ప్రతి పురుషుడు ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకోవాలని అక్కడి ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ఎవరైనా దీనిని తిరస్కరించినట్లయితే.. కటకటాల వెనక్కి వెళ్లక తప్పదు. అలాగే ఏ మహిళ అయిన తన భర్త రెండో పెళ్లి చేసుకోకుండా నివారించే ప్రయత్నం చేస్తే ఆమెకు కూడా జీవిత ఖైదు విధిస్తుంది అక్కడి ప్రభుత్వం. ఇరాక్‌లో కూడా ఈ విధమైన ఆచారం అమలులో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.