విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్న వ్యక్తి.. బ్రెయిన్ స్కాన్ చేసిన షాక్ తిన్న వైద్యులు

ఓ వ్యక్తి విపరీతమైన తలనొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్ళాడు. అతని మెదడులో ఏముందో చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. అమెరికాలోని ఫ్లోరిడాలో 52 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన తలనొప్పి సమస్యతో చాలా ఇబ్బంది పడ్డాడు. నొప్పి భరించలేనంతగా మారడంతో ఆసుపత్రికి వెళ్లి పక్షలు చేయించుకున్నాడు. అయితే బ్రెయిన్ స్కానింగ్ తర్వాత మెదడులో కనిపించింది చూసి డాక్టర్లు కూడా షాక్ అయ్యారు.

విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్న వ్యక్తి.. బ్రెయిన్ స్కాన్ చేసిన షాక్ తిన్న వైద్యులు
Tapeworms Found In Florida Man
Follow us
Surya Kala

|

Updated on: Mar 12, 2024 | 8:33 AM

తన మెదడు కీటకాలకు నిలయంగా మారిందని ఆ వ్యక్తికీ తెలియదు. వైద్యులుఅతని మెదడును ఎంఆర్‌ఐ చేయగా.. మెదడులో బద్దెపురుగు (టేప్‌వార్మ్) పెరుగుతున్నాయని.. అవి క్రమంగా మృత్యువు అంచుల వరకు తీసుకెళ్తున్నాయని గుర్తించారు. ఈ పురుగు ఒక రకమైన పరాన్నజీవి. ఇవి సాధారణంగా ప్రేగులలో కనిపిస్థాయి. అయితే ఈ వ్యక్తికి మాత్రం మెదడుకి చేరింది.

ఫ్లోరిడాకు చెందిన 52 ఏళ్ల వ్యక్తి (పేరుని గోప్యంగా ఉంచారు) తీవ్రమైన మైగ్రేన్‌తో బాధపడుతూ నగరంలోని ఓ ఆసుపత్రికి చేరుకున్నాడు అక్కడ వైద్యులు అతని తలను స్కాన్ చేయగా.. రిపోర్ట్ చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే వైద్యులు అతని మెదడులో చాలా గడ్డలను కనుగొన్నారు. అయితే ఆ గడ్డలు… టేప్‌వార్మ్‌లు, వాటి గుడ్లుగా గుర్తించారు. ఉడకని మాంసాన్ని తినడం వల్లే రోగికి ఈ పరిస్థితికి వచ్చినట్లు వైద్యులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

న్యూయార్క్ పోస్ట్ ప్రకారం ఈ వ్యక్తి గత నాలుగు నెలలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాడు. తనకు సాఫ్ట్ బేకన్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. ఈ వంటకం పంది మాంసంతో లేదా పొట్ట లేదా వెనుక భాగంలో కొవ్వుతో తయారు చేస్తారు. అతను ఈ బేకన్  ను తక్కువగా ఉడికించి తినడం వల్ల ఈ పరిస్థితిలో ఉన్నదని వైద్య సిబ్బంది చెప్పారు. వైద్య పరిభాషలో ఈ పరాన్నజీవుల సంక్రమణను న్యూరోసిస్టిసెర్కోసిస్ అంటారు.

షాక్‌కి గురిచేసే మెడికల్ కేసు!!

ఈ మహిళకు సంబంధించిన కేస్ స్టడీ ఇటీవల అమెరికన్ జర్నల్ ఆఫ్ కేస్ రిపోర్ట్స్‌లో ప్రచురించబడింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ వింత వ్యాధికి బేకన్ బాధ్యత వహించదు. వాస్తవానికి అతను  సరిగ్గా ఉడకని బేకన్‌ను తిన్నాడు. దీని కారణంగా టేప్‌వార్మ్ దాడి జరిగింది.

మెదడులో పురుగులు ఉన్నట్లు గుర్తించిన వెంటనే రోగిని ఐసీయూలో చేర్చారు. అప్పుడు అతని మెదడులో వాపు తగ్గడానికి చికిత్స ఇచ్చారు. పురుగుల వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా రెండు వారాల పాటు మందులు ఇచ్చారు. క్రమంగా గడ్డలు మాయమయ్యాయని.. రోగికి మైగ్రేన్ నుంచి ఉపశమనం లభించిందని వైద్యులు చెప్పారు.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం న్యూరోసిస్టిసెర్కోసిస్ కారణంగా అమెరికాలో ప్రతి సంవత్సరం సుమారు వెయ్యి మంది ఆసుపత్రిలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇది మెదడు సంక్రమణకు సంబంధించిన తీవ్రమైన పరిస్థితిగా పరిగణించబడుతుంది. ఈ వైద్య పరిస్థితిలో రోగి తీవ్రమైన తలనొప్పి, మాట్లాడటంలో ఇబ్బంది, బలహీనత , మూర్ఛ వంటి లక్షణాలను అనుభవించవచ్చు. ఇన్ఫెక్షన్ కారణంగా, టేప్‌వార్మ్‌లు మెదడు, కాలేయంతో పాటు ప్రేగులలో వేగంగా పెరుగుతాయి. ఇది మరణానికి కూడా కారణమవుతాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడకు క్లిక్ చేయండి..