Suicide Forest: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదమైన అడవులు.. వెళ్తే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుందట ఎందుకంటే..

శాన్ ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ తర్వాత ప్రపంచంలోనే అత్యధిక ఆత్మహత్య ఘటనలు అకిగహారా అడవుల్లో జరిగాయి. అందుకే ఈ అడవిని 'సూసైడ్ ఫారెస్ట్' అని పిలుస్తారు. అయితే ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం అనేది ఇప్పుడు జరుగుతున్నది కాదు.. జపాన్ చరిత్ర పుటలను తిరగేస్తే సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం ఇది అడవి కాదట.. ఆ సమయంలో ఇక్కడ లావా ప్రవహించేది. వాస్తవానికి 864 సంవత్సరంలో జపాన్‌లోని ఫుజి పర్వతం వద్ద 6 నెలల పాటు భారీ పేలుడు సంభవించింది

Suicide Forest: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదమైన అడవులు.. వెళ్తే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుందట ఎందుకంటే..
AokigaharaImage Credit source: Unsplash
Follow us

|

Updated on: Mar 11, 2024 | 1:37 PM

అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ ఉత్తమయింది. తల్లిదండ్రులు ఇచ్చిన అపురూపమైన బహుమతి మానవ జన్మ. పుట్టిన మనిషికి మరణం తప్పదు. అయితే ప్రకృతి ప్రసాదించిన మరణం సహజంగా మన వరకూ వచ్చే వరకూ ఎన్ని కష్టాలు, నష్టాలు దుఃఖాలు వచ్చినా వాటిని తట్టుకుని విలువైన జీవితాన్ని గడపలింది.. ఎందుకంటే తల్లిదండ్రులు,  పిల్లలు  కుటుంబం గురించి ఆలోచించాలి .. అదే సమయంలో ఏదైనా సమస్యలు మీ మీకే వస్తాయి అనుకోవద్దు.. అదే సమయంలో సమస్యలను మీ స్నేహితులతో సన్నిహితులతో పంచుకుంటే అవి తేలికగా కనిపిస్తాయి. ఇలాంటి అర్ధం వచ్చే ఒక బోర్డు అడవి బయట కనిపిస్తుంది. అవును

జపాన్ రాజధాని టోక్యో సమీపంలో ఉన్న అడవి వెలుపల ఇలాంటి సైన్ బోర్డు ఏర్పాటు చేయబడింది. టో క్యో నుంచి కేవలం 2 గంటల ప్రయాణించి ఈ అడవికి చేరుకోవచ్చు. సాధారణంగా అడవిలో ప్రమాదకరమైన జంతువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ హెచ్చరిక బోర్డుని ఏర్పాటు చేస్తారు. అయితే జపాన్‌లోని అకిగహారా అనే అడవిలో మాత్రం ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ ఒక బోర్డుని ఏర్పాటు చేశారు. ప్రపంచం లోని అత్యంత ప్రసిద్ధ సూసైడ్ పాయింట్లలో ఒకటైన ఆ రహస్యమైన ప్రదేశం గురించి తెలుసుకుందాం.

అకిగహారా అడవి దాదాపు 35 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది చాలా దట్టంగా ఉంటుంది.  దీనిని ‘చెట్ల సముద్రం’ అని కూడా పిలుస్తారు. చాలా మంది ప్రజలు ప్రకృతి మధ్య వాకింగ్ చేయడానికి,  స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించడానికి ఇక్కడకు వస్తారు. అయితే అందరు పర్యాటకులు ఇలాంటి మంచి ఉద్దేశాలను కలిగి ఉండరు. 2013-2015 మధ్య ఇక్కడ 100కు పైగా ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఇక్కడ  ఆత్మహత్యలు చేసుకోకుండా నిరోధించే ప్రయత్నంలో భాగంగా జపాన్ ప్రభుత్వం అకిగహారాలో జరుగుతున్న  ఆత్మహత్యలపై గణాంకాలను నివేదికను నిలిపివేసింది.

ఇవి కూడా చదవండి
Aokigahara Sucide Forest

Aokigahara Sucide Forest

ఆత్మహత్యల అడవి

శాన్ ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ తర్వాత ప్రపంచంలోనే అత్యధిక ఆత్మహత్య ఘటనలు అకిగహారా అడవుల్లో జరిగాయి. అందుకే ఈ అడవిని ‘సూసైడ్ ఫారెస్ట్’ అని పిలుస్తారు. అయితే ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం అనేది ఇప్పుడు జరుగుతున్నది కాదు.. జపాన్ చరిత్ర పుటలను తిరగేస్తే సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం ఇది అడవి కాదట.. ఆ సమయంలో ఇక్కడ లావా ప్రవహించేది. వాస్తవానికి 864 సంవత్సరంలో జపాన్‌లోని ఫుజి పర్వతం వద్ద 6 నెలల పాటు భారీ పేలుడు సంభవించింది. ఆ సమయంలో సమీపంలోని అనేక గ్రామాలు సమాధి అయ్యాయి. గత కొన్ని వందల సంవత్సరాలలో ఘనీభవించిన లావా స్థానంలో దట్టమైన దట్టమైన అడవి ఏర్పడింది. ఈ అడవిని నేడు అకిగహారా అని పిలుస్తారు.

ఈ అడవుల్లోనే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు?

1960లో ప్రసిద్ధి చెందిన ‘టవర్ ఆఫ్ వేవ్స్’ అనే చిన్న కథలో కూడా అకిగహారా ప్రస్తావన ఉంది. సమాజం కలవకుండా అడ్డుకున్న ప్రేమికుల జంటపై కథ దృష్టి పెడుతుంది. చివరికి ప్రధాన స్త్రీ పాత్ర అడవికి వెళ్లి తన ప్రాణాలను తీసుకుంటుంది. ప్రేమికులు జీవితాన్ని త్యాగం చేయడం గురించి జానపద కథలు ఇప్పటికే జపాన్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఇలాంటి కథలు ఆ ఆలోచనను మరింత బలపరిచాయి. అయితే అకిగహారా అడవుల్లో ఆత్మహత్య చేసుకోవడానికి ఇదొక్కటే కారణం కాదు.

‘నేను జీవించాలనే కోరికను కోల్పోయాను’

2009లో అకిగహారాలో తన జీవితాన్ని ముగించుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని CNN ఇంటర్వ్యూ చేసింది. ఆ వ్యక్తి జీవించాలనే కోరికను కోల్పోయాడు. అతడిని ఉద్యోగం నుంచి తొలగించడంతో అడవిలో ఆత్మహత్య చేసుకుని భూమ్మీద కనిపించకుండా పోవాలనుకున్నాడు. అయితే తన ఆత్మహత్య ప్రయత్నంలో విజయం సాధించలేదు. అడవికి చేరుకున్న తర్వాత వ్యక్తి తన మణికట్టును కోసుకున్నాడు.. అయితే అతను చేసుకున్న గాయాలు ప్రాణాంతకం కాలేదు. అతను మూర్ఛపోయాడు. దాదాపు మరణం అంచు వరకూ వెళ్ళాడు.. అయితే అప్పుడు ఒక ప్రయాణీకుడు అతన్ని చూసి.. వెంటనే స్పందించి అతనిని రక్షించాడు.

భ్రమ కలిగించేలా శక్తుల ప్రభావం

మర్మమైన అడవిలో అద్భుత శక్తులు ఉన్నాయని కూడా పేర్కొన్నాడు. అడవిలో దెయ్యాలు నివసిస్తాయని ప్రజలు నమ్ముతారు. ఇవి అడవిలో అడుగు పెట్టె వారిని ఆత్మహత్య చేసుకోవాలంటూ బలవంతం చేస్తాయని నమ్మకం. అకిగహారాలోని దట్టమైన అడవిలో ఎవరైనా ఒక్కసారి తప్పిపోతే బయటకు రావడం చాలా కష్టమని వాదన కూడా వినిపిస్తుంది. కంపాస్ లేదా మొబైల్ వంటి పరికరాలు కూడా ఇక్కడ పని చేయవు. చాలా మంది ప్రజలు తాము తిరిగి బయటకు వచ్చే దారిని తెలుసుకోక ముందే అడవి జంతువులకు బలైపోతారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles