ఈ గ్రామంలో హొలీ వేడుకలు చూస్తే వావ్ అనాల్సిందే.. విదేశీయులను సైతం ఆకర్షించే లత్మార్ హోలీ ప్రత్యేక ఏమిటంటే

ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర, బర్సానా, నంద గ్రామం పరిసర ప్రాంతాల్లో వసంత పంచమి నుంచి హోలీ వేడుక ప్రారంభమవుతుంది. ఈ పండుగ సుమారు 40 రోజుల పాటు కొనసాగుతుంది.. అంటే హొలీ రోజు వరకు కొనసాగుతుంది. మధుర చుట్టుపక్కల గ్రామాలలో జరుపుకునే హోలీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ హోలీని చూసేందుకు విదేశాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు మథురకు వస్తారు. అయితే మన దేశంలో మాత్రమే కాదు  ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన లత్మార్ హోలీ సంప్రదాయం ఎలా ప్రారంభమైంది?  దాని ప్రత్యేకత ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.. 

ఈ గ్రామంలో హొలీ వేడుకలు చూస్తే వావ్ అనాల్సిందే.. విదేశీయులను సైతం ఆకర్షించే లత్మార్ హోలీ ప్రత్యేక ఏమిటంటే
Holi In UpImage Credit source: Facebok- Mashable India
Follow us
Surya Kala

| Edited By: TV9 Telugu

Updated on: Mar 12, 2024 | 5:43 PM

హిందువులు జరుపుకునే పండగల్లో రంగుల పండుగ హొలీ.. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ రంగుల వేడుకలను జరుపుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. ఆ సేతు హిమాచలంలో హొలీ వేడుకలను జరుపుకుంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో హోలీని ఐదు రోజుల పాటు జరుపుకుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో రెండు రోజులు ఇలా రకరకాలుగా జరుపుకుంటారు. ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర, బర్సానా, నంద గ్రామం పరిసర ప్రాంతాల్లో వసంత పంచమి నుంచి హోలీ వేడుక ప్రారంభమవుతుంది. ఈ పండుగ సుమారు 40 రోజుల పాటు కొనసాగుతుంది.. అంటే హొలీ రోజు వరకు కొనసాగుతుంది. మధుర చుట్టుపక్కల గ్రామాలలో జరుపుకునే హోలీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ హోలీని చూసేందుకు విదేశాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు మథురకు వస్తారు. అయితే మన దేశంలో మాత్రమే కాదు  ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన లత్మార్ హోలీ సంప్రదాయం ఎలా ప్రారంభమైంది?  దాని ప్రత్యేకత ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

బ్రజ్‌లో లత్మార్ హోలీ

హోలీ ప్రతి సంవత్సరం వసంత పంచమి రోజు నుంచి జ్‌లో ప్రారంభమవుతుంది. రంగనాథ్ ఆలయంలో హోలీ ఆడటం ద్వారా ముగుస్తుంది. హోలాష్టక్ నుంచి బ్రజ్ దేవాలయాలలో హోలీ ఆడటం ప్రారంభమవుతుంది. హోలీ బర్సానా లడ్డూ-మార్‌తో ప్రారంభమవుతుంది. దీని తరువాత లత్మార్ హోలీ జరుగుతుంది. లత్మార్ హోలీ సంప్రదాయం చాలా సంవత్సరాలుగా శ్రీకృష్ణుడి నంద గ్రామం  ..  రాధా రాణి గ్రామం బర్సానేలో కొనసాగుతోంది. లత్మార్ హోలీకి ముందు.. ఇక్కడ పూల హోలీ, రంగుల హోలీ ఆడతారు. దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

ఇవి కూడా చదవండి

లత్మార్ హోలీని రెండు రోజుల పాటు ఆడతారు. బర్సానాలో ఒక రోజు నంద గ్రామంలో ఒక రోజు ఆడతారు.  ఈ వేడుకల్లో బర్సానా, నంద గ్రామంలోని అబ్బాయిలు, బాలికలు పాల్గొంటారు. ఒకరోజు నంద్‌గావ్‌లోని యువకులు బర్సానాకు వెళతారు. అక్కడ హొలీ వేడుకలను జరుపుకుంటారు. మరుసటి రోజు బర్సానా యువకులు నంద్‌గావ్‌కు చేరుకుని లత్మార్ హోలీ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. బ్రజ్‌లో  హోలీ ఆట రాధా-కృష్ణుల ప్రేమతో ముడిపడి ఉంది. దీని కారణంగా ఉత్తర్ ప్రదేశ్ లో హొలీ వేడుకల సందడి దేశంలో మిగిలిన ప్రాంతాల కంటే భిన్నంగా కనిపిస్తాయి.

 పూలతో చేసిన రంగులతో హోలీ

ఈ రంగుల పండుగలో బ్రజ్ ప్రజలు లత్మార్ హోలీ ఆడటమే కాదు.. ఈ రోజున ఉపయోగించే రంగులకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రంగుల్లో కల్తీ ఉండకూడదు. ఇందుకోసం ప్రత్యేకంగా సహజ పువ్వులతో  రంగులను తయారు చేస్తారు.

లత్మార్ హోలీ సంప్రదాయం ఇలా మొదలైంది

స్థానికుల నమ్మకాల ప్రకారం బ్రజ్‌లో హోలీ కేళీ రాధా-కృష్ణుల ప్రేమతో ముడిపడి ఉంది. రాధా రాణి, శ్రీ కృష్ణుల కాలం నుంచి లత్మార్ హోలీ సంప్రదాయం కొనసాగుతోందని విశ్వాసం. పురాణాల ప్రకారం, హోలీ పండుగ శ్రీ కృష్ణ భగవానుడికి చాలా ప్రీతికరమైనది. హోలీ రోజున శ్రీ కృష్ణుడు తన స్నేహితులతో కలిసి నంద గ్రామం నుంచి రాధారాణి గ్రామం బర్సానాకు వెళ్లేవాడు. అప్పుడు  శ్రీ కృష్ణుడితో పాటు, అతని స్నేహితులు..  రాధా రాణి వారి స్నేహితురాళ్లతో కలిసి హోలీ ఆడేవారు. అయితే రాధా రాణితో పాటు ఆమె స్నేహితురాళ్లు శ్రీ కృష్ణుడిని.. అతడి స్నేహితులను చెట్టు కొమ్మలతో, పొదలతో కొట్టేవారట. ఈ సంప్రదాయం అప్పటి నుంచి ప్రారంభమైందని..  నేటికీ ఈ సంప్రదాయం బర్సానా..  నందగ్రామాలు అనుసరిస్తున్నాయని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ