Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫలితం రాకున్నా ప్రయత్నం చేయ్.. భగవద్గీత ఏం చెబుతుందో తెలుసా..?

భగవద్గీత మన జీవితంలోని భావోద్వేగాలను అర్థం చేసుకోవడంలో గొప్ప మార్గదర్శకంగా ఉంటుంది. ప్రేమ, కోల్పోయిన బాధ, నిరాశ, ఆశలు వంటి విషయాలపై స్పష్టతను ఇస్తుంది. ఈ క్షణాలలో మనం ఎలా స్పందించాలో, ఎలా ముందుకు సాగాలో భగవద్గీత బోధనలు మనకు తేలికగా, స్ఫూర్తిగా మారుతాయి.

ఫలితం రాకున్నా ప్రయత్నం చేయ్.. భగవద్గీత ఏం చెబుతుందో తెలుసా..?
Bhagavad Gita Teachings
Follow us
Prashanthi V

|

Updated on: Apr 13, 2025 | 8:03 PM

మన జీవితంలో కొన్ని క్షణాలు బాగా కష్టంగా అనిపిస్తాయి. మనం ప్రేమించిన మనిషి, మనం కష్టపడి సంపాదించిన ఉద్యోగం, మన గుర్తింపు అన్నీ పోతున్నాయనిపిస్తుంది. అప్పుడు మన హృదయం తట్టుకోలేక భయపడుతుంది. మనకి అన్నీ పోతున్నాయన్న భావన వస్తుంది. ఈ విషయాలలో భగవద్గీత ఏం చెబుతుందో తెలుసా..? మీరు కోల్పోతారని భయపడే ప్రతిదీ ఎప్పుడూ మీది కాదు అని.

మనమే కొన్ని విషయాలకు ఎక్కువగా ఆలోచిస్తాము. ప్రేమ శాశ్వతంగా ఉంటుందని నమ్ముతాము. జీవితం ఎప్పుడూ మనకిష్టమైనట్లు సాగుతుందని ఆశిస్తాము. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారుతుంది, మార్పును అంగీకరించమంటుంది. మనం బాధపడే కారణం అది కాదు.. అసలు సమస్య మన ఆశ.

మనకు కావాల్సినవాళ్లు ఎప్పటికీ మనతోనే ఉంటారని మనం అనుకుంటాము. మనం కష్టపడితే తప్పకుండా విజయం వస్తుందని ఆశించుకుంటాము. కానీ భగవద్గీత ఏం చెబుతుందో తెలుసా..? మన కర్మ మనం చేయాలి.. కానీ ఫలితంపై మనం ఎక్కువ ఆశ పెట్టుకోకూడదు. మనం చేసిన పని ఎంత ఉన్నా.. ఫలితం మన చేతిలో ఉండదు. మనం ప్రేమను ఇవ్వవచ్చు.. కానీ ఎవ్వరినీ మనతో ఉండాలని బంధించలేం.

మనం అన్ని విషయాలను మన నియంత్రణలో ఉంచాలనుకుంటాము. ఉద్యోగం, సంబంధం, ఆరోగ్యం అన్నీ మనవే అని అనిపిస్తుంది. కానీ ఇవన్నీ ఈ జీవితం ఇచ్చిన గిఫ్ట్‌లాగా ఉంటాయి. ఇవి ఎప్పుడు పోతాయో మనకి తెలియదు. కాబట్టి వాటిని బలంగా పట్టుకోవడం కన్నా.. ఆనందంగా అనుభవించాలి. జీవితం మీద నియంత్రణ కోల్పోయినప్పుడు మనసు స్వేచ్ఛగా ఉంటుంది.

వదిలిపెట్టడం అనేది బలహీనత కాదు.. అది ధైర్యంగా తీసుకునే నిర్ణయం. ఎవరినైనా ప్రేమిస్తే వారిని మన దగ్గర ఉండాలని బలవంతం చేయకూడదు. నిజమైన ప్రేమ అనేది స్వేచ్ఛను ఇస్తుంది.

మనం ఆశించిన విధంగా ఫలితాలు రాకపోయినా.. మన ప్రయత్నం నిజాయితీగా ఉంటే చాలు. విజయం ప్రతి సారి మన ఊహలానే రాదు. కానీ మన ప్రయత్నం శ్రద్ధగా ఉంటే మనకు ఆత్మసంతృప్తి లభిస్తుంది.

నిజమైన శాంతి మనలో నుంచే వస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండాలంటే మన మాటలు, ఆలోచనలు, చర్యలు మంచివే కావాలి. ప్రేమ, విజయాలు, సంబంధాలన్నీ బలవంతంగా కాకుండా సహజంగా కొనసాగితే జీవితం సుఖంగా ఉంటుంది. శ్రద్ధగా, ధైర్యంగా, స్వేచ్ఛగా జీవించడమే అసలైన బలం.

మీరు ఎవ్వరినైనా లేదా ఏదైనా కోల్పోతున్నాను అనిపిస్తే ఓ ప్రశ్న వేసుకోండి.. ఇది నిజంగా నా జీవితంలో నా నిర్ణయంతోనే వచ్చిందా..? లేక జీవితం ఇచ్చిన ఒక బహుమతా..? నేను ప్రేమను స్వేచ్ఛగా ఇచ్చానా..? నాకు దొరికిన అవకాశాన్ని గౌరవించానా..? ఈ ప్రశ్నలు మన దృష్టిని బాధల వైపు నుంచి స్పష్టత వైపు తీసుకెళ్తాయి.

జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను ఓ పాఠంగా చూడాలి. వదిలేయడం అనేది ఓడిపోవడం కాదు.. అది మన మనసు తేలికపడే నిర్ణయం. అలాంటి తేలికత మనకు అంతరంగికంగా ఓ ప్రశాంతతను ఇస్తుంది. నిజమైన ఆనందం కూడా అలాంటి తేలికత నుంచి మొదలవుతుంది.