Frequent Urination: వేసవిలో కూడా తరచూ మూత్ర విసర్జన చేస్తున్నారా? మీ ఒంట్లో ఈ సమస్యలు ఉన్నట్లే..
శీతాకాలంలో, వర్షాకాలంలో తరచుగా మూత్రవిసర్జన చేయడం సహజం. కానీ వేసవిలో కూడా తరచుగా మూత్రవిసర్జన చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈ సమస్య మీకూ ఉంటే వెంటనే అప్రమత్తం అవ్వాలి. ఎందుకంటే వేసవిలో చెమట కారణంగా నీరు అధికంగా బయటకు పోతుంది. దీంతో యూరిన్..

సాధారణంగా శీతాకాలంలో, వర్షాకాలంలో తరచుగా మూత్రవిసర్జన చేయడం సహజం. కానీ వేసవిలో కూడా తరచుగా మూత్రవిసర్జన చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈ సమస్య మీకూ ఉంటే వెంటనే అప్రమత్తం అవ్వాలి. ఎందుకంటే వేసవిలో సూర్యుడి వేడి ఎక్కువగా ఉంటుంది. దీంతో శరీరం నుంచి ఎక్కువగా చెమట వెలువడుతుంది. మూత్రానికి బదులుగా నీరు చెమట రూపంలో బయటకు వెళుతుంది. అయితే తరచుగా మూత్ర విసర్జన చేయడం వల్ల మనకు మూత్ర నాళాల ఇన్ఫెక్షన్, మూత్రపిండాల సమస్యలు, మూత్రాశయ సమస్యలు, నిర్జలీకరణం వంటివి తలెత్తుతాయి. వేసవిలో మనం ఎక్కువ నీరు త్రాగడం వల్ల తరచుగా మూత్ర విసర్జన చేస్తామనే అభిప్రాయం ఉండవచ్చు. అయితే వేసవిలో తరచుగా మూత్రవిసర్జన చేయడం అనేక తీవ్రమైన వ్యాధులను సూచిస్తుంది. వేసవిలో తరచుగా మూత్రవిసర్జన వల్ల వచ్చే వ్యాధులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
మూత్రనాళ ఇన్ఫెక్షన్
మూత్రనాళ ఇన్ఫెక్షన్ తరచుగా మూత్ర విసర్జనకు ఒక సాధారణ కారణం. ఈ సమస్య వల్ల తరచుగా మూత్ర విసర్జన చేయడం, మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా అనిపించడం జరుగుతుంది. దానితో పాటు జ్వరం కూడా వస్తుంది.
డయాబెటిస్
డయాబెటిస్ ఉన్న రోగులు తరచుగా మూత్ర విసర్జన చేస్తారు. ఇది పదే పదే ఇలా జరగడానికి కారణం కావచ్చు. మధుమేహం ప్రారంభ లక్షణాలు కూడా ఇలాగే ఉంటాయి. ఈ వ్యాధి ప్రారంభంలో ప్రతి అరగంటకు ఒకసారి మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.
డీహైడ్రేషన్
వేసవిలో తరచుగా మూత్రవిసర్జనకు డీహైడ్రేషన్ కూడా ఒక కారణం కావచ్చు. శరీరంలో నీరు లేకపోవడం వల్ల మూత్రం చిక్కగా మారుతుంది. దీనివల్ల తరచుగా మూత్రవిసర్జన జరగవచ్చు.
మూత్రాశయం లేదా ప్రోస్టేట్ సమస్యలు
కొన్నిసార్లు మూత్రాశయం అతిగా చురుగ్గా మారుతుంది. దీనివల్ల తరచుగా మూత్ర విసర్జన చేయవలసి వస్తుంది. ప్రోస్టేట్ గ్రంధితో సమస్యలు ఉన్నా ఇలా జరుగుతుంది. ప్రోస్టేట్ గ్రంథిలో సమస్య ఉంటే అన్ని మూత్రం అంతా ఒకేసారి బయటకు రావు. అందుకే తరచుగా మూత్ర విసర్జన చేయవల్సి వస్తుంది. మీకూ ఈ సమమ్య ఉంటే వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స పొందడం మంచిది.
గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే అందించాం. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.