ఈ పక్షిలో సగం ఆడ, సగం మగ లక్షణాలు
కొలంబియాలోని ఓ పొలంలో అత్యంత అరుదుగా కనిపించే గ్రీన్ హనీక్రీపర్ పక్షిని గుర్తించారు. విల్లామారియా ప్రాంతంలోని ఓ రైతుకు చెందిన పొలంలో 2023లో ఇది మొదటిసారి కనిపించింది. అప్పటి నుంచి ఈ పక్షి అక్కడివారిని కనువిందు చేస్తోంది. గత వందేళ్లలో రెండోసారి మాత్రమే ఈ పక్షి కనిపించిందని పరిశోధకులు ప్రకటించారు.
ఈ పక్షికి సగం ఆకుపచ్చ అంటే ఒక వైపు ఆడ, మరొకవైపు నీలం అంటే మగ పక్షిలా ఈకలు ఉన్నాయి. దీన్ని శాస్త్రీయంగా బైలేటరల్ గైనాండ్రోమోర్ఫ్ అని పిలుస్తారు. ఇది ఆడ, మగ లక్షణాలను ప్రదర్శిస్తుంది. ఒకవైపు ఉన్న ఈకలను చూస్తే.. పురుష పునరుత్పత్తి అవయవాలు ఉంటాయి. అలాగే మరొక వైపు ఉండే ఈకలను చూస్తే స్త్రీలో ఉండే ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. యూనివర్సిటీ ఆఫ్ ఒటాగా పక్షి శాస్త్రవేత్త ప్రొఫెసర్ హామిష్ స్పెన్సర్ కొలంబియాలో ఈ పక్షి జాతిని కనుగొన్నారు. అయితే ఇలా ఏ జాతి పక్షిలో తానింత వరకు ద్వైపాక్షిక ఆడ, మగ లక్షణాలను చూడలేదన్న హామిష్ స్పెన్సర్ ఈ పరిశోధన వివరాలు ఆర్నిథాలజీ జర్నల్‌లో ప్రచురించారు. వందేళ్లలో కనిపించిన వివిధ పక్షి జాతుల్లో ఇలా గైనండ్రోమోర్ఫిజం లక్షణాలను నమోదు చేసిన రెండో పక్షి ఇదే అని అన్నారు. కణ విభజన సమయంలో ఏర్పడే లోపం కారణంగా ఇలాంటి పక్షులు పుట్టుకొస్తాయని అన్నారు. ఇక్కడ ఒక గుడ్డు, రెండు స్పెర్మ్‌ల ద్వారా రెండుసార్లు ఫలదీకరణం చెందితే ఇలా జరుగుతుందని ప్రొఫెసర్ స్పెన్సర్ వివరించారు.కొలంబియా రకరకాల పక్షులకు ఆవాసం. ప్రపంచంలో మరే ఇతర దేశంలో లేనన్ని వెరైటీ పక్షులు కొలంబియాలో కనిపిస్తాయి. ఈ దేశంలోని అమెజాన్ అడవులు అరుదైన పక్షులకు ఆవాసంగా ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రపంచంలోనే అరుదైన ‘గోల్కొండ బ్లూ’ వజ్రం వేలం..
17 మంది డాక్టర్లు గుర్తించలేకపోయిన జబ్బును చాట్ జీపీటీ గుర్తించింది
వింత విమానాశ్రయం! మామిడి చెట్టు కిందే వెయిటింగ్
ఆ డెలివరీ వ్యాన్‌కు దెయ్యం పట్టిందా ఏంది..? సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన దృశ్యం
ఎవరూ లేకుండానే బాలికల హాస్టల్ బాత్రూం నుంచి చప్పుళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..

