ఎవరూ లేకుండానే బాలికల హాస్టల్ బాత్రూం నుంచి చప్పుళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా
వేసవి తాపాన్ని తట్టుకోలేక చల్లదనాన్ని వెతుక్కుంటూ పాములు పుట్టల్లోంచి బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇళ్లు, స్కూళ్లు, వాహనాలు ఎక్కడంటే అక్కడ చేరి జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మహానంది మండలం తిమ్మాపురం మోడల్ స్కూల్‌లో నాగుపాము హల్ చల్ చేసింది.
స్కూల్‌కు చెందిన లేడిస్ హాస్టల్‌లో నాగుపాము సంచరించడంతో విద్యార్థినులు భయంతో పరుగులు తీశారు. భయంతో విద్యార్ధినులు పరుగులు తీస్తుండటంతో ఏం జరిగిందని వార్డెన్ అడగ్గా.. వాష్‌రూమ్‌లో నాగుపామును చూసిన విషయం చెప్పారు. వెంటనే వార్డెన్ స్థానిక స్నేక్ క్యాచర్ మహేష్‌కు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న మహేష్ నాగుపామును పట్టుకునేందుకు రెండు గంటలు శ్రమించాల్సి వచ్చింది. తనను పట్టుకునే క్రమంలో నాగుపాము స్నేక్ క్యాచర్‌ను ముప్పుతిప్పలు పెటింది. మొత్తానికి ఎంతో చాకచక్యంగా మహేష్ నాగుపామును బంధించగలిగాడు. దానిని తీసుకొని వెళ్లి నల్లమల అడవిలో సురక్షితంగా వదిలిపెట్టాడు. దీంతో విద్యార్ధినులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా వెతికిన తండ్రి.. ఏంటి మావా ఇది
పాముల హనీమూన్ స్పాట్ చూసారా.. ప్రపంచంలో కెల్లా వింత
చావుకు ముందు ఏం జరుగుతుంది ?? మరణాన్ని ఆపేందుకు మెదడు పోరాడుతుందా ??
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు
వాహనాదారులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి టోల్ ఫ్రీ

