చంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా వెతికిన తండ్రి.. ఏంటి మావా ఇది
చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు, వారితో పేరెంట్స్ సరదాగా గడిపే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. చంటి పిల్లల మీద పేరెంట్స్ కేర్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. కంటికి రెప్పలా వారిని చూసుకుంటూ ఉంటారు. ఇంటిలో కళ్ల ముందు ఆడుతూ పాడుతూ సందడి చేసే పసిపిల్లలు ఒక్క క్షణం కనిపించకపోయినా తల్లిదండ్రులు పడే టెన్షన్ అంతా ఇంతా కాదు.
వారు కనిపించేంత వరకు మనసు ఆందోళన చెందుతూనే ఉంటుంది. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. నవ్వు తెప్పించేలా ఉన్న ఈ వీడియో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. “చంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా వెతికినట్లు” సామెత ఈ వీడియోలోని తండ్రికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే వైరల్ అవుతున్న క్లిప్‌లో ఓ వ్యక్తి తన బిడ్డను తన వీపునకు సురక్షితంగా కట్టేసుకున్నాడు. అయితే ఆ విషయం మరిచి తన బిడ్డ తప్పిపోయిందేమో అని టెన్షన్ పడ్డాడు. షాపింగ్ మాల్ లో ఓ చోట నిలబడి బిడ్డ కోసం వెతుకుతూ బాధతో చుట్టూ చూసాడు. స్ట్రోలర్‌ను తనిఖీ చేసి మొబైల్ ఫోన్‌లో ఎవరికో కాల్ చేస్తూ కనిపించాడు. ఇంతలో ఓ మహిళ అతని వీపు వైపు చూపించింది. శిశువు తన వీపుకు కట్టి ఉందని ఆ వ్యక్తికి అర్థమవుతుంది. దీంతో టెన్షన్ ఫ్రీ అయిన అతను తన మొబైల్ ఫోన్‌లో డయల్ చేయడం ఆపి నవ్వుతూ కనిపిస్తాడు. ఆ వ్యక్తి బిడ్డ కోసం వెతుకుతూ, బండిలోనే వదిలేశాడని బాధపడుతున్న దృశ్యం అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ పిల్లవాడు ఏడుస్తున్నప్పటికీ, ఆ క్షణంలో ఒత్తిడి వల్ల ఆ చిన్నారి తన వెనుకే ఉందని అతడు గమనించలేకపోతున్నాడని కామెంట్లు పెట్టారు నెటిజన్స్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాముల హనీమూన్ స్పాట్ చూసారా.. ప్రపంచంలో కెల్లా వింత
చావుకు ముందు ఏం జరుగుతుంది ?? మరణాన్ని ఆపేందుకు మెదడు పోరాడుతుందా ??
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

