వేడి వేడి కాఫీ.. గొంతులోకి అలా దిగుతుంటే ఆ మజానే వేరు. వెంటనే ఎక్కడలేని హుషారు వచ్చేస్తుంది. అప్పటిదాకా ఉన్న నిస్సత్తువ మటుమాయం అయిపోతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది
TV9 Telugu
ఇదంతా కాఫీలోని కెఫీన్ మహాత్మ్యమే. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఫలితంగా చురుకుదనం, హుషారు వస్తుంది. అయితే దీంతో కొన్ని ఇబ్బందులు లేకపోలేదు
TV9 Telugu
అయితే డయాబెటిస్‌తో బాధపడేవారు కాఫీ తాగడం వల్ల ఒంట్లో చక్కెర స్థాయి పెరుగుతుందా? అనే సందేహం చాలా మందికి ఉంది. ఈ విషయం గురించి అనేక మందిలో గందరగోళం ఉంది
TV9 Telugu
సాదా కాఫీ రక్తంలో చక్కెర స్థాయిలను నేరుగా పెంచదు. కాఫీలోని కెఫిన్ అడ్రినలిన్ స్రావాన్ని ప్రేరేపిస్తుంది. ఇది రక్తంలో చక్కెరలో తాత్కాలిక పెరుగుదలకు కారణమవుతుంది
TV9 Telugu
కెఫిన్ కొంతమందిలో ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గించవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. చక్కెరతో కాఫీ లేదా క్రీమర్ తయారు చేసుకుని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది
TV9 Telugu
కాబట్టి కాఫీలో చక్కెర మొత్తాన్ని తగ్గించాలి. వీలైతే చక్కెర లేకుండానే కాఫీ తాగడం మంచిది. మీకు మధుమేహం ఉంటే లేదా మీ రక్తంలో చక్కెరను నియంత్రించడం కష్టంగా అనిపిస్తే కెఫిన్ మొత్తాన్ని పరిమితంగా తీసుకోవడం మంచిది
TV9 Telugu
కాఫీలో మెగ్నీషియం, క్రోమియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి
TV9 Telugu
అలాగే కాఫీతో మూత్రం ఎక్కువగా వస్తుంది. దీంతో ఉప్పు, నీరు ఎక్కువగా బయటకు వెళ్లిపోయి ఒంట్లో నీటిశాతం తగ్గే (డీహైడ్రేషన్) ప్రమాదముంది. ఛాతీలో మంట వంటి సమస్యలతో బాధపడేవారూ మితం పాటించటం మంచిది