కొత్తిమీర వాటర్ ఇలా వాడితే జుట్టు సమస్యలకు చెక్..! వెంట్రుకలు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతాయి..
సాధారణంగా ధనియాలు, కొత్తిమీరను వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇవి ఆ వంటకాల రుచిని పెంచుతుంది. అయితే జుట్టు అందాన్ని పెంచేందుకు కొత్తిమీరను ఉపయోగిస్తారని మీకు తెలుసా.? అవును జుట్టు సమస్యలను తీర్చే గుణాలు కొత్తిమీరలో ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీరలో విటమిన్ కె, విటమిన్ ఇ, విటమిన్ ఎ లాంటివి పుష్కలంగా ఉంటాయి. సహాజ పద్దతిలో ధనియా హెయిర్ ప్యాక్‌ను ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గడంతో పాటు పొడవాటి, మందపాటి జుట్టు మీ సొంతం అవుతుందని చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం...
Updated on: Apr 21, 2025 | 7:48 PM

కొత్తిమీర రసాన్ని తలకు పట్టించడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రేరిపిస్తుంది. జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది. ఇది మంచి జుట్టు పెరుగుదలకు దోహదపడే సహజమైన, ముఖ్యమైన పోషకాలతో నిండివుంటుంది. మీ జుట్టు బలంగా, పొడవుగా ఉండటానికి కొత్తిమీర నీటిని మీ తలకు అప్లై చేసి ఒక గంటపాటు అలాగే వదిలేయాలి. తరువాత తేలికపాటి షాంపూతో కడిగేసుకోవాలి.

కత్తిమీర వాటర్ ని రెగ్యులర్ గా వాడటం వల్ల మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లతో సమృద్ధిగా ఉంటుంది, ఇది కుదుళ్లను బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఇది స్కాల్ప్‌ను శుభ్రపరచడంలో సహాయపడుతుంది, అదనపు నూనె, ధూళి, చుండ్రును తొలగిస్తుంది.

ఇందుకోసం కొంచెం తాజా కొత్తిమీరను రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయం ఆ నీటిని వడకట్టాలి. ఇప్పుడు ఈ నీటిని షాంపూ చేసిన తర్వాత కండిషనర్ లా తలకు పట్టించుకోవాలి. తలలో సున్నితంగా రాసి మసాజ్ చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తూ ఉంటే జుట్టు సమస్యలు తీరిపోయి జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.

కొత్తిమీరలో జుట్టు ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ జుట్టు కుదుళ్లని బలంగా చేస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. కొత్తిమీరు నీరు స్కాల్ప్‌ని క్లీన్ చేస్తుంది.

కొత్తిమీర ఆకులతో హెయిర్ మాస్క్ కూడా తయారు చేయొచ్చు. ఇందుకోసం కొత్తిమీర ఆకులను శుభ్రంగా కడిగి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అందులో కావాల్సినంత అలోవెరాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 20 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి.. ఆ తర్వాత జుట్టును సాధారణ నీటితో, గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలను శుభ్రం చేసుకోవాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.




