వేసవిలో పాలలో చిటికెడు యాలకుల పొడి వేసి తాగారంటే..

21 April 2025

TV9 Telugu

TV9 Telugu

యాలకుల్ని మనం తీపి పదార్థాల తయారీలో ఎక్కువగా వాడుతుంటాం. చక్కటి సువాసన కలిగి అదనపు రుచి తెచ్చే వీటిలో ఎన్నో పోషకాలూ ఉన్నాయి

TV9 Telugu

యాలకుల్లో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును అదుపు చేస్తాయి. క్యాన్సర్‌ కారక కణాలు పెరగకుండా నిరోధిస్తాయి

TV9 Telugu

వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి. ఆరోగ్యకరమైన కణాల అభివృద్ధికి తోడ్పడతాయి

TV9 Telugu

యాలకులలో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శరీరాన్ని నిర్విషీకరణ చేసి రోగనిరోధక శక్తిని పెంచుతాయి

TV9 Telugu

యాలకులు జీర్ణవ్యవస్థను బలపరుస్తాయి. గ్యాస్, అజీర్ణం, ఆమ్లత్వం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. యాలకులు ఒంటికి చల్లదనాన్ని ఇస్తాయి

TV9 Telugu

కాబట్టి వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. యాలకులు ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడే సహజ యాంటీ-ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి

TV9 Telugu

యాలకులు శరీర రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ-మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి. యాలకుల పొడి కలిపిన పాలు తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది

TV9 Telugu

యాలకుల పొడి కలిపిన పాలు తాగితే రక్తపోటును నియంత్రిస్తుంది. మంచి నిద్ర వస్తుంది. వేసవిలో యాలకుల పాలు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొంతమందికి దీని వల్ల అలెర్జీ వస్తుంది. ఇటువంటి వారు తాగకపోవడమే మంచిది