21 April 2025
Meta/Pexels/Pixa
TV9 Telugu
శరీరంలో B12 తగ్గితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. చేతులు, కాళ్ళలో జలదరింపు, తలతిరగడం, అలసట, ముఖం పాలిపోవడం, హృదయ స్పందన పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను విస్మరించవద్దు.
శరీరంలో విటమిన్ బి12 లోపం తీవ్రమైతే.. జ్ఞాపకశక్తి కోల్పోవడం, నిరాశ, నడుస్తున్నప్పుడు లేదా మాట్లాడేటప్పుడు తడబడటం, గందరగోళం వంటి సమస్యలకు దారితీస్తుంది .
బి12 లోపం వల్ల రక్తహీనత (అధిక రక్త నష్టం) ఏర్పడుతుంది. ఇది నాడీ వ్యవస్థను అంటే మెదడు నాడీ వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది.
విటమిన్ బి12 లోపం ఎక్కువగా శాఖాహారుల్లో సంభవిస్తుంది. ఎందుకంటే ఈ విటమిన్ మాంసాహార ఆహారాలలో సమృద్ధిగా లభిస్తుంది. శాఖాహారులు, మాంసాహారులిద్దరూ తినగలిగే ఆహారాల గురించి తెలుసుకుందాం.
షిటాకే పుట్టగొడుగులు గోధుమ రంగులో కనిపిస్తాయి. ఇందులో బి12 ఉంటుంది. కనుక ఇవి శాఖాహారులకు మంచి ఆహారం. ఇది అనేక ఇతర పోషకాలు కూడా ఈ పుట్టగోడుల్లో ఉన్నాయి.
షిటాకే పుట్టగొడుగులలో ప్రోటీన్, ఫైబర్, బి5, జింక్, మాంగనీస్, సెలీనియం, రాగి, నియాసిన్, రిబోఫ్లేవిన్, బి6, ఫోలేట్, విటమిన్ డి వంటి అనేక పోషకాలు ఉన్నాయి.
మీరు శాఖాహారులైతే, పాలు, పెరుగు , జున్ను, పన్నీర్ లో విటమిన్ బి12 లభిస్తుంది. శాఖాహార మొక్కల ఆధారిత బలవర్థకమైన పాలను అంటే వేగన్ మిల్క్ ని కూడా తీసుకోవచ్చు.