Weather Alert: బిగ్ అలర్ట్.. రెండు రోజులు వర్షాలే వర్షాలు.. కానీ, ఈ ప్రాంతాల్లో ఎండలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ఎండ.. మరోవైపు అకాల వర్షాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో అప్డేట్ ఇచ్చింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల నుండి తెలంగాణలోని మధ్య ప్రాంతం వరకు సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ఎండ.. మరోవైపు అకాల వర్షాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో అప్డేట్ ఇచ్చింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల నుండి తెలంగాణలోని మధ్య ప్రాంతం వరకు సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కోస్తా ఆంధ్ర తీరం మధ్య ప్రాంతంతో పాటు యానం పరిసరాలలో సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
దీని ప్రభావంతో సోమవారం, మంగళవారం తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ జిల్లాలకు అలర్ట్..
సోమవారం తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ రోజు గరిష్టంగా ఆదిలాబాద్ లో 41.3, కనిష్టంగా హైదరాబాద్‌లో 37.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది..
నిన్న ఖమ్మం, భద్రాచలం, నిజామాబాద్, ఆదిలాబాద్, రామగుండం, మహబూబ్ నగర్ లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. ఖమ్మం.. 41.8, భద్రాచలం.. 40.6, నిజామాబాద్.. 40.5, ఆదిలాబాద్.. 40.3, రామగుండం.. 40, మహబూబ్ నగర్.. 40, మెదక్.. 39.8, హనుమకొండ.. 38, నల్లగొండ.. 38, హైదరాబాద్.. 37.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇవాళ.. తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జగిత్యాల నిజామాబాద్, జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. పై 8 జిల్లాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉందని పేర్కొంది. రాగల మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ రెండు నుండి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.. ఈరోజు రాష్ట్రంలోని తూర్పు జిల్లాలలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటనలో తెలిపింది.
ఏపీలో వాతావరణం ఇలా..
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇవాళ కాకినాడ 3, కోనసీమ 7, తూర్పు గోదావరి గోకవరం మండలాల్లో తీవ్రవడగాలులు(11), మరో 98 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..