జొమాటోకు ఓ కస్టమర్ రెండు కోరికలను తీర్చమని వింత రిక్వెస్ట్.. నెట్టింట్లో సంఘటన వైరల్

ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా వస్తువులు ఇంటికి తెప్పించుకుంటున్నారు.  ఆహారం కూడా ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారు. పగలు లేదా రాత్రి అయినా ఆకలి అనిపిస్తే చాలు  ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేస్తే చాలు.. కొన్ని నిమిషాల్లో డెలివరీ చేయబడుతుంది. ప్రస్తుతం ఫుడ్ డెలివరీకి సంబంధించిన విషయం నెట్టింట్లో చర్చ ఉంది.. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. వాస్తవానికి ఒక వ్యక్తి తన కోసం Zomato యాప్ నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేసాడు. అదే సమయంలో అతను కంపెనీకి ఓ వింత అభ్యర్థన చేసాడు

జొమాటోకు ఓ కస్టమర్ రెండు కోరికలను తీర్చమని వింత రిక్వెస్ట్.. నెట్టింట్లో సంఘటన వైరల్
Zomato Food OrderImage Credit source: Twitter/@Sahilarioussss/@zomato
Follow us
Surya Kala

|

Updated on: Mar 11, 2024 | 11:37 AM

కాలంతో పాటు జీవన విధానంలో కూడా మార్పు అవసరం. మనిషి జీవితంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఉదాహరణకు ఇంతకుముందు వ్యక్తులు ఏదైనా వస్తువులు కొనాలంటే మార్కెట్‌కి వెళ్లేవారు.. అయితే ఇప్పుడు ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా వస్తువులు ఇంటికి తెప్పించుకుంటున్నారు.  ఆహారం కూడా ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారు. పగలు లేదా రాత్రి అయినా ఆకలి అనిపిస్తే చాలు  ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేస్తే చాలు.. కొన్ని నిమిషాల్లో డెలివరీ చేయబడుతుంది. ప్రస్తుతం ఫుడ్ డెలివరీకి సంబంధించిన విషయం నెట్టింట్లో చర్చ ఉంది.. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది.

వాస్తవానికి ఒక వ్యక్తి తన కోసం Zomato యాప్ నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేసాడు. అదే సమయంలో అతను కంపెనీకి ఓ వింత అభ్యర్థన చేసాడు. అతని కోరిక వింటే ఎవరికైనా నవ్వు తెప్పిస్తుంది. సాధారణంగా ప్రజలు ఏదైనా కొనుగోలు చేసినప్పుడు ఖచ్చితంగా బిల్లు తీసుకుంటారు. అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టిన ఆ వ్యక్తి ఆహారంతో పాటు బిల్లును పంపవద్దని Zomatoని అభ్యర్థించారు. ఇది మాత్రమే కాదు..  అతను కంపెనీకి మరో అభ్యర్థన కూడా చేసాడు. ఫుడ్ ప్యాకెట్ మీద కానీ.. మరెక్కడైనా ఆహారంలో చికెన్ ఉందని రాయవద్దని రిక్వెస్ట్ చేశాడు. తన ఇంట్లో నాన్ వెజ్ ఫుడ్ కు అనుమతి లేదంటూ ఈ వింత రిక్వెస్ట్ పెట్టాడు. తనకు హ్యాపీగా నచ్చిన ఫుడ్ తినే అవకాశాన్ని కల్పించాలంటూ ఈ రెండు కోరికలను తీర్చమని జొమాటో సంస్థను కోరాడు.

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ పోస్ట్ వైరల్ అవుతోంది

అయితే, రెస్టారెంట్ .. తన కస్టమర్ చేసిన డిమాండ్లకు సరిగ్గా విరుద్ధంగా చేసింది. రెస్టారెంట్ అతనికి ఆహార బిల్లును పంపడమే కాకుండా.. ఆ బిల్లుపై అతను ఏమి చెప్పాడో.. ఏమి ఆర్డర్ పెట్టాడో కూడా రాసింది. ఈ ఫన్నీ పోస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @Sahilarioussss అనే ఐడితో షేర్ చేశారు. అంతేకాదు దీనిని  ఇప్పటివరకు 94 వేల కంటే ఎక్కువ సార్లు చూడగా.. వేలాది మంది పోస్ట్‌ లైక్ చేసారు.

అదే సమయంలో ఈ పోస్ట్ చూసిన తర్వాత నెటిజన్లు వివిధ ఆసక్తికరమైన స్పందనలు ఇచ్చారు. ‘జొమాటో వ్యక్తులు కస్టమర్లను ఇలా మోసం చేసి ఉండకూడదు’ అని ఒకరు చెబుతుండగా, మరొక వినియోగదారు ‘వారు ఎప్పుడూ రిక్వెస్ట్ లను పట్టించుకోరు.. ఈ విషయాన్ని బిల్లుపై ముద్రించండి. అయినా కస్టమర్ కోరిక ఎంత  వింతగా ఉంది అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!