Keerthika Govindhasamy: ‘అమ్మాయిలను చదువుకోనివ్వండి’.. ప్రధాని మోదీ నుంచి అవార్డు అందుకున్న కీర్తికా గోవిందస్వామి గురించి ఆసక్తికర విషయాలు

ఇటీవల నేషనల్ క్రియేటర్స్ అవార్డ్ కార్యక్రమం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ అవార్డు కార్యక్రమంలో ప్రధాని మోదీ, అవార్డు గ్రహీత కీర్తికా గోవిందస్వామి కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బెస్ట్ స్టోరీ టెల్లర్ కేటగిరీలో అవార్డు అందుకునే సమయంలో కీర్తికా ప్రధాని ఆశీస్సుల కోసం ఆయనకు నమస్కరించారు.

Keerthika Govindhasamy: ‘అమ్మాయిలను చదువుకోనివ్వండి’.. ప్రధాని మోదీ నుంచి అవార్డు అందుకున్న కీర్తికా గోవిందస్వామి గురించి ఆసక్తికర విషయాలు
Keerthika Govindasamy
Follow us
Balu Jajala

|

Updated on: Mar 11, 2024 | 11:55 AM

ఇటీవల నేషనల్ క్రియేటర్స్ అవార్డ్ కార్యక్రమం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ అవార్డు కార్యక్రమంలో ప్రధాని మోదీ, అవార్డు గ్రహీత కీర్తికా గోవిందస్వామి కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బెస్ట్ స్టోరీ టెల్లర్ కేటగిరీలో అవార్డు అందుకునే సమయంలో కీర్తికా ప్రధాని ఆశీస్సుల కోసం ఆయనకు నమస్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూతురు తన పాదాలను తాకినప్పుడు తాను ఉద్వేగానికి లోనవుతా అంటూ మోడీ కూడా బదులుగా ఆమె కు నమస్కారం చేశారు. శుక్రవారం జరిగిన తొలి నేషనల్ క్రియేటర్స్ అవార్డ్ లో ఈ ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఆమె ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందంటూ తన జర్నీ గురించి చెప్పారామె.

‘‘అప్పుడు నా వయసు 15 ఏళ్లు. నాకంటూ స్నేహితులు ఎవరు లేరు. నేను చదువులో ఫస్ట్. అయితే నా కుటుంబంలోని పురుషులపై ఆధారపడటం నాకు ఇష్టం లేదు. మా అమ్మాయిలను దగ్గర్లోని షాప్ కి వెళ్లనివ్వరు. నాకు ఏదైనా అవసరం ఉంటే నేను నా బ్రదర్స్ ను అడుగాల్సి వచ్చేది. అయితే జస్ట్ 100 మీటర్ల దూరంలో ఉన్న షాపుకు వెళ్లడంతో చెంపదెబ్బ తినాల్సి వచ్చింది’’ అంటూ ఆ పాత రోజులను గుర్తుచేసుకుంది కీర్తికా గోవిందస్వామి.

‘‘ చిన్న చిన్న అవసరాల కోసం లైఫ్ లో పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత పురావస్తు శాస్త్రవేత్త అయ్యాను. అందుకే ఆర్కియాలజీలో మాస్టర్స్ చేయడానికి వీలుగా గ్రాడ్యుయేషన్ కోసం హిస్టరీని ఎంచుకున్నాను. కానీ నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక పెళ్లి చేసుకుంటే సరిపోతుందని చెప్పారు. కానీ నాకు ఇష్టం లేదు. ఆ తర్వాత ఏ పని ఇచ్చిన చేయడం మొదలుపెట్టాను. ట్యూషన్ కూడా చెప్పాను. రిసెప్షనిస్ట్, ఎలక్ట్రీషియన్ గా కూడా పనిచేశా. సెకండ్ హ్యాండ్ ల్యాప్ ట్యాప్ కొనడానికి నాకు దాదాపు ఏడాదిన్నర పట్టింది. ఆరేళ్లుగా నేను, నాన్న మాట్లాడుకోవడం లేదు’’ తన మెమోరీస్ ను గుర్తు చేసుకున్నారు.

‘‘నా తల్లిదండ్రులను జడ్జ్ చేయకండి, వారు తమ వంతు కృషి చేశారు. గ్రామంలో మీ తల్లిదండ్రులు మాత్రమే మీ కోసం నిర్ణయాలు తీసుకోరు. బంధువులు ప్రధాన పాత్ర పోషిస్తారు. నాకు అండగా నిలవడానికి శాయశక్తులా ప్రయత్నించారు. నేను నిజంగా కఠినమైన అమ్మాయిని. పరిస్తితులను తట్టుకొని ఉన్నత స్తానంలోకి వెళ్లా. ఇప్పుడు నేను వారిని మొదటిసారి విమానంలో తీసుకెళ్లాను. మన దేశ ప్రధాని నుండి అవార్డు రావడం చూశారు. ఈ ఫీలింగ్ ని నేను వివరించలేను. వారి ముందే అవార్డు తీసుకోవడంతో నేను జీవితంలో గెలిచాను’’ అని ఎమోషన్ అయ్యారు. ఈ తరం అమ్మాయిలను చదువును ఇవ్వండి. వాళ్లను అర్ధం చేసుకోవాలి. అమ్మాయిలకు చదువుకోనివ్వండి. వారికి ఒక జీవితం ఉండనివ్వండి’’ అంటూ కీర్తికా ప్రతి తల్లిదండ్రులను వేడుకుంటోంది.