Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ, కాంగ్రెస్ ఫుల్ ఫోకస్.. ఇవాళ సెంట్రల్ ఎలక్షన్ కమిటీల భేటీ..
లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ, కాంగ్రెస్ హైకమాండ్‌లు.. అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించాయి.. ఇప్పటికే మొదటి జాబితాను విడుదల చేశాయి. ఇప్పటికే 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేసిన బీజేపీ హైకమాండ్.. రెండో జాబితా కోసం కసరత్తుల్ని ముమ్మరం చేసింది. ఈ రోజు సాయంత్రం జరిగే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ, కాంగ్రెస్ హైకమాండ్‌లు.. అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించాయి.. ఇప్పటికే మొదటి జాబితాను విడుదల చేశాయి. ఇప్పటికే 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేసిన బీజేపీ హైకమాండ్.. రెండో జాబితా కోసం కసరత్తుల్ని ముమ్మరం చేసింది. ఈ రోజు సాయంత్రం జరిగే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బీజేపీలో భారీగా చేరికలు కనిపిస్తున్నాయి.తాజాగా బీఆర్‌ఎస్ మాజీ ఎంపీలు నగేష్, సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావ్‌లు కమలం పార్టీలో చేరిపోయారు. దీంతో వీరికి టికెట్స్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటికే బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు బీబీ పాటిల్, రాములు తనయుడు భరత్ టికెట్ దక్కించుకున్నారు. ఇక ఏపీలో పొత్తులో భాగంగా పోటీ చేసే 6 ఎంపీ సీట్లతో పాటు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కూడా ఇవాళ్టి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఢిల్లీలో ఈ సాయంత్రం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ..
ఎన్నో వడపోతలు, కసరత్తుల తర్వాత.. ఫస్ట్ జాబితాను రిలీజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ..నెక్స్ట్ లిస్ట్‌ను ఫైనల్ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. 39 మందితో ఫస్ట్ లిస్ట్‌ను రివీల్ చేసిన హస్తం పార్టీ..అందులో తెలంగాణ నుండి నలుగురు అభ్యర్థులను ఫైనల్ చేసింది. జహీరాబాద్ నుంచి సురేష్ కుమార్ షెట్కార్, మహబూబ్‌నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, నల్గొండ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్‌లను అభ్యర్థులుగా హైకమాండ్ నిర్ణయించింది. మిగిలిన 13 స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈ సాయంత్రం కాంగ్రెస్ హైకమాండ్ సమావేశం కానుంది. అయితే తెలంగాణలో ఆశావహులు లిస్ట్ భారీగా ఉండడంతో..ఎవరికి సీటు దక్కుతోందనన్న ఆసక్తి నెలకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..