AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: రంజాన్ వేళ పాక్‌లో మండుతున్న ధరలు.. కూరగాయలు, పండ్ల ధరలు తెలిస్తే షాక్..

దాయాది దేశం పాకిస్తాన్ లో రంజాన్‌ పండుగ వాతావరణం కనిపించడం లేదు. దేశంలో నిత్యావసర ధరలు కొండెక్కాయి. ఎం కొనేటట్లు లేదు.. ఎం తినేటట్లు లేదంటూ పెరిగిన ధరలతో ప్రజలు ఆందోళన చెంతున్నారు. రంజాన్ మాసాన్ని ఆసరాగా చేసుకొని నిత్యావసర సరుకులు పెంచారంటూ ప్రజలు వాపోతున్నారు .

Pakistan: రంజాన్ వేళ పాక్‌లో మండుతున్న ధరలు.. కూరగాయలు, పండ్ల ధరలు తెలిస్తే షాక్..
Fruits Vegetables Price Hike
Surya Kala
|

Updated on: Mar 11, 2024 | 8:07 AM

Share

ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుంది. అయితే దాయాది దేశం పాకిస్థాన్ లో ఎక్కడా పండగ వాతావరణం కనిపించడం లేదు. పాకిస్తాన్‌లో నిత్యావసర ధరలు కొండెక్కాయి. కూరగాయలు, పాలు, పంచదార, వంటనూనెలు, నెయ్యి, మాంసం, గుడ్లు, పప్పుల ధరలు మూడు రెట్ల మేరకు పెరిగాయి. అన్ని రకాల ఆహార పదార్థాలు, ఉత్పత్తులు భారీగా ఖరీదైపోవడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పెరిగిన నిత్యావసర ధరలను చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.పేద, మధ్య ఆదాయ వర్గాల ప్రజలు అవసరమైన వాటిని కూడా ఎంతో కష్టంగా కొనాల్సి వస్తోందని వాపోతున్నారు.

ప్రస్తుతం పాకిస్తాన్‌లో కేజీ ఉల్లి ధర 150 నుండి 300 రూపాయలకు పెరిగింది. రంజాన్‌కు ముందు కాలంలో బంగాళదుంప ధర కేజీ 50 పీకేఆర్‌ ఉండగా.. ప్రస్తుతం 80 రూపాయలకు పెరిగింది. క్యాబేజీ ధరకిలో ధర  80-100గా పీకేఆర్‌ నుంచి 150 పీకేఆర్‌కు పెరిగింది. పచ్చిమిర్చి కిలో 200 నుంచి ఏకంగా 320 రూపాయలకు విక్రయిస్తున్నారు. క్యాప్సికం ధర కూడా రెట్టింపు పెరిగింది. కిలో 400 రూపాయలకు చేరింది. సాధారణంగా రంజాన్ మాసంలో పండ్ల విక్రయాలు పెరుగుతాయి. చిన్న సైజు అరటి పండ్ల ధర డజను 80 నుంచి 120 రూపాయలకు పెరిగింది. మంచి నాణ్యమైన పెద్ద అరటిపండ్లు డజన్‌కు 200 రూపాలయకు విక్రయిస్తున్నారు. పుచ్చకాయ ధర కూడా 150 నుంచి 200 రూపాయలకు అమ్ముతున్నారు.

గత కొన్ని నెల క్రితం పాకిస్తాన్ వ్యాప్తంగా కూరగాయలు, సరుకుల సాధారణ పెరుగుదల 31.5 శాతం ఉండేది. కానీ  పండుగ మాసంలో గతంకంటే 60 శాతం వరకు పెరిగాయి. కూరగాయల ధరలతో పాటు వివిధ రకాల పండ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. అవకాశాన్ని వాడుకుంటున్న కొందరు వ్యాపారుల కారణంగా కూడా దేశవ్యాప్తంగా ధరలు గణనీయంగా పెరిగేందుకు కారణం. ఇలా హఠాత్తుగా నిత్యావసర వస్తువుల ధరలలో ఈ గణనీయమైన పెరుగుదల తక్కువ-మధ్య-ఆదాయ వినియోగదారుల ఆర్థిక బాధలను పెంచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..