ఏడాదిగా బాక్స్‌లో ఇరుక్కున్న కుక్క తల.. ఎట్టకేలకు విముక్తి..

చిన్న పిల్లలు, పిల్లి లేదా ఇతర చిన్న జంతువుల తల ఒక పాత్రలో ఇరుక్కుపోయినట్లు కనిపించే ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో చాలానే చూసి ఉంటారు. అయితే నెలల తరబడి పెట్టెలో తల ఇరుక్కుపోయిన కుక్కను మీరు ఎప్పుడైనా చూశారా? అవును అలాంటిదే అమెరికాలోని అలబామాలో కనిపించింది. నిజానికి ఇక్కడ ఒక కుక్క తల ఒక సంవత్సరం పాటు పెట్టెలో ఇరుక్కుపోయింది. ఇప్పుడు దాని నుండి స్వేచ్ఛ పొందింది.

ఏడాదిగా బాక్స్‌లో ఇరుక్కున్న కుక్క తల.. ఎట్టకేలకు విముక్తి..
Dog Viral News
Follow us
Surya Kala

|

Updated on: Mar 11, 2024 | 1:10 PM

కొన్నిసార్లు కొన్ని వింత కేసులు వెలుగులోకి వస్తుంటాయి. వీటిని నమ్మడం కష్టం ఏమో అనిపిస్తుంది. అయితే నమ్మాల్సిందే.. ఇదిగో సాక్ష్యం అంటూ వీడియోలు, ఫోటోలు కళ్ల ముందు కనిపిస్తాయి. తాజాగా ఒక కేసు ఒకటి  చర్చనీయాంశమైంది. చిన్న పిల్లలు, పిల్లి లేదా ఇతర చిన్న జంతువుల తల ఒక పాత్రలో ఇరుక్కుపోయినట్లు కనిపించే ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో చాలానే చూసి ఉంటారు. అయితే నెలల తరబడి పెట్టెలో తల ఇరుక్కుపోయిన కుక్కను మీరు ఎప్పుడైనా చూశారా? అవును అలాంటిదే అమెరికాలోని అలబామాలో కనిపించింది. నిజానికి ఇక్కడ ఒక కుక్క తల ఒక సంవత్సరం పాటు పెట్టెలో ఇరుక్కుపోయింది. ఇప్పుడు దాని నుండి స్వేచ్ఛ పొందింది.

UPI న్యూస్ నివేదిక ప్రకారం కుక్క పేరు బేర్. సిటీ ఆఫ్ మొబైల్ యానిమల్ సర్వీసెస్ అధికారులు మాట్లాడుతూ కుక్క తల ఒక బాక్స్ లో ఇరుక్కుపోయింది. ఇలా ఈ కుక్క చాలా నెలలుగా సముద్ర తీరంలో తిరుగుతున్న కుక్కను ఒక రెస్క్యూ టీమ్ చూసింది. దీంతో గత ఫిబ్రవరిలో రెస్క్యూ టీమ్ ఆ కుక్క తల ను..  పెట్టెలో నుంచి తొలగించగలిగిందని చెప్పారు. దాదాపు ఏడాది పాటు కుక్క తల ఈ బాక్స్ లో  ఇరుక్కుపోయింది. బాక్స్ పెద్దది.. దీని నిర్మాణం కుక్క తల ను దాని నుంచి ఎవరూ తీయలేని విధంగా ఉంది. ఈ విషయంలో ఎన్నో ప్రయత్నాలు చేసినా ప్రతిసారీ అపజయం ఎదురైంది.

అయినప్పటికీ సిటీ ఆఫ్ మొబైల్ యానిమల్ సర్వీసెస్ ..  మొబైల్ కౌంటీ యానిమల్ షెల్టర్ రెండు బృందాలు కలిసి కుక్క తల ను పెట్టెలో నుంచి తొలగించడానికి ప్రయత్నం చేశాయి. మార్టిన్ మిల్లర్ అనే వ్యక్తి ఈ కుక్కను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కుక్క తలను ఆ పెట్టెను తీసివేయడంలో సహాయపడిన అదే బృందంలో మార్టిన్ ఒక సభ్యుడు. మార్టిన్ ఆ కుక్కకు తన పేరు ని కూడా పెట్టుకున్నాడు.

ఈ కుక్క తల నుండి పెట్టెను తొలగించడం అంత తేలిక అవ్వలేదు. ఎందుకంటే కుక్కకు ఏ మాత్రం ఇబ్బడిని అనిపించినా తనకు మేలు చేస్తున్న వ్యక్తులపై కూడా దాడి చేయగలదు. అందుకే ముందుగా కుక్కను కంట్రోల్ చేసి.. ఆ తర్వాత బాక్స్‌ నుంచి కుక్క తలను సురక్షితంగా తొలగించారు. కుక్క ప్రశాంతమైన ప్రవర్తన..  స్నేహపూర్వక స్వభావం కలిగి ఉందని రెస్క్యూ బృందం పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ