- Telugu News Photo Gallery Testosterone Level: For These 4 Reasons Cause Low Level Of Testosterone In Body, Affect Men’s Health
Testosterone Level: ఈ అలవాట్లు పురుషుల్లో ఉన్నాయా.. లైంగిక సామర్ధ్యం తగ్గించే అవకాశం..
టెస్టోస్టెరాన్ పురుషుల శరీరంలో చాలా ముఖ్యమైన పాత్రలను పోషించే ముఖ్యమైన హార్మోన్ .. టెస్టోస్టెరాన్ వృషణాలు, ప్రోస్టేట్ వంటి పురుష పునరుత్పత్తి కణజాలాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. పురుషుల లైంగిక కోరిక శరీరంలోని ఈ హార్మోన్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. అంతేకాదు ఈ హార్మోన్ ఎముకలు, కండరాల నిర్మాణం, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
Updated on: Mar 11, 2024 | 11:57 AM

సగటున యుక్త వయసులో పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయి స్త్రీ కంటే ఏడు నుండి ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంటాయి. పురుషుల్లో టెస్టోస్టెరాన్ జీవక్రియ ఎక్కువగా కనిపిస్తుంది కనుక రోజువారీ ఉత్పత్తి 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది.

అయితే మారిన కాలంతో పాటు మారిన రోజువారీ అలవాట్లు కూడా పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తాయి. అది ప్రమాదానికి నాంది. దీని కారణంగా జీవితంలో తీవ్రమైన సమస్యలు వస్తాయి.

తినే ఆహారం,,, రుగ్మతలు టెస్టోస్టెరాన్‌ను ప్రభావితం చేస్తాయి. అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర అధికంగా ఉండే ఆహారం, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ టెస్టోస్టెరాన్‌పై ప్రభావం చూపుతాయి.

ధూమపానం టెస్టోస్టెరాన్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలిక మద్యపానం, ధూమపానం అలవాట్లు టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తాయి. లైంగిక పనితీరును తగ్గిస్తాయి.

ఊబకాయం టెస్టోస్టెరాన్ స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుంది. అధిక బరువు మగ శరీరంలో లైంగిక హార్మోన్ల స్థాయిని తగ్గిస్తుంది. అంతేకాదు లైంగిక కోరికల స్థాయి పెరగాలంటే అదనపు కొవ్వును తొలగించుకోవడం అవసరం

నిద్ర లేమి.. టెస్టోస్టెరాన్‌ను ప్రభావితం చేస్తుంది. హైపర్ టెన్షన్, నిద్ర లేకపోవడం, కొలెస్ట్రాల్ టెస్టోస్టెరాన్ హార్మోన్ల చర్యకు ఆటంకం కలిగిస్తాయి.

మధుమేహం ప్రభావం పురుషుల శారీరక రూపంపై మాత్రమే కాదు.. లైంగిక స్థాయిపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. రక్తంలో చక్కెర రోజురోజుకు పెరగడం టెస్టోస్టెరాన్ పని తీరుకు ఆటంకం కలిగిస్తుంది.





























