ఐపీఎల్‌కి ముందు అట్టర్ ఫ్లాప్.. కొన్నందుకు ఆర్‌సీబీపై విమర్శలు.. కట్‌చేస్తే.. పవర్ ప్లేలో గుంటూర్ మిర్చినే
Phil Salt Became The Highest Run Scorer in The Power Play: ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మన్ ఫిల్ సాల్ట్ భారీ రికార్డు సృష్టించాడు. దీంతో చాలా మంది దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లను వదిలిపెట్టి ముందుకు సాగాడు.

Phil Salt became the highest run scorer in the power play: ఐపీఎల్ 2025లో జరిగిన 28వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రాజస్థాన్ రాయల్స్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించింది. ఇంకా 15 బంతులు మిగిలి ఉండగానే ఏకపక్ష విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో, ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ RCB తరపున హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్‌లు ఆడారు. మొదటి వికెట్‌కు ఇద్దరూ 8.4 ఓవర్లలో 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు విజయానికి పునాది వేశారు. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మన్ ఫిల్ సాల్ట్ ఒక ప్రత్యేక మైలురాయిని సాధించాడు. పవర్ ప్లేలో జట్టుకు వేగవంతమైన ఆరంభాన్ని ఇవ్వడంతో పాటు, తన పేరు మీద కొత్త రికార్డును కూడా సృష్టించాడు. దీంతో ఎంతోమంది దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లను వెనక్కునెట్టేశాడు.
పవర్ ప్లేలో అత్యధిక పరుగులు..
ఐపీఎల్ 2025లో, రాయల్ ఛాలెంజర్స్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ అనేక మ్యాచ్‌లలో జట్టుకు త్వరిత ఆరంభాన్ని అందించాడు. దీని ఆధారంగా, ఈ సీజన్‌లో పవర్-ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అతను అగ్రస్థానానికి చేరుకున్నాడు. 6 మ్యాచ్‌లలో 6 ఇన్నింగ్స్‌లలో 45.50 సగటు, 193.61 స్ట్రైక్ రేట్‌తో 182 పరుగులు చేశాడు. ఇందులో 23 ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి. ఈ విషయంలో అతను నికోలస్ పూరన్, అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్‌లను అధిగమించాడు. ఇది కాకుండా, సాల్ట్ ఈ సీజన్‌లో 6 మ్యాచ్‌ల్లో 6 ఇన్నింగ్స్‌లలో 34.66 సగటుతో 208 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ పై ఈ సీజన్ లో అతను తన రెండవ అర్ధ సెంచరీ సాధించాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే కోల్‌కతాపై సెంచరీ సాధించాడు.
స్టార్క్ ఓవర్లో 30 పరుగులు..
ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, ఆర్‌సీబీ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మన్ ఫిల్ సాల్ట్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌ను చిత్తు చేశాడు. స్టార్క్ వేసిన ఈ ఓవర్లో అతను 30 పరుగులు పిండుకున్నాడు. మ్యాచ్ మూడో ఓవర్ మొదటి బంతికి సాల్ట్ మిడ్-ఆఫ్‌లో సిక్స్ కొట్టి తన అంతరంగం ఏంటో చూపించాడు. ఈ ఓవర్‌లో ఎలాంటి బీభత్సం చేస్తాడో ముందే చూపించాడన్నమాట. ఆ తరువాతి మూడు బంతుల్లో సాల్ట్ బ్యాట్ నుంచి మూడు ఫోర్లు వచ్చాయి. అలాగే మరో రెండు సిక్సర్లు కొట్టడం ద్వారా మొత్తం 30 పరుగులు పిండుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ ఇంకా ముందకు వెళ్లేది. కానీ, దురదృష్టవశాత్తు అతను 37 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..