IPL 2025: ఆట మారింది..రికార్డులు మారాయి?.. ఐపీఎల్ టాపర్స్ లేటెస్ట్ లిస్ట్ చూసేయండి!
ఐపీఎల్ 18 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఎవరూ ఊహించని జట్లు ఈ సీజన్‌లో దూసుకుపోతున్నాయి. ఐదు స్లార్లు ట్రోఫీ నెగ్గిన టీమ్స్ మాత్రం ఐపీఎల్ టేబుల్‌లో చివరికి చేరాయి. ఆయితే నిన్న జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్ టాపర్స్ లిస్ట్‌లో పెనుమార్పులు వచ్చాయి. ఐపీఎల్ 2025లో నిన్నటి వరకు జరిగిన మ్యాచ్‌ల ప్రకారం చూసుకుంటే అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో కొత్త ప్లేయర్స్ వచ్చి చేరారు. దీంతో పాటు ఎక్కువ పరుగులు, ఎక్కువ సిక్సర్స్, ఫోర్స్ కొట్టిన వారి జాబితాలో కూడా మార్పులు వచ్చాయి. అవేంటో వారేవరో ఓ లుక్కేద్దాం పదండి..

ఐపీఎల్ 2025లో అత్యథిక పరుగులు చేసిన ఆటగాళ్లు…
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఎక్కువ రన్స్ చేసిన వారి జాబితాలో ప్రస్తుతం లక్నో ప్లేయర్ నికోలస్ పురాన్ టాప్ రన్ స్కోరర్‌గా ఉన్నారు. 6 మ్యాచ్‌లలో 349 రన్స్, 215.43 స్ట్రైక్ రేట్‌లో టాప్‌లో ఉన్నాడు. అతని స్థిరమైన బ్యాటింగ్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 బంతుల్లో 87 చేసి నాటౌట్‌గా నిలవడం అతన్ని ఆరెంజ్ క్యాప్ రేసులో ముందంజలో ఉంచింది. ఇక 329 పరుగులతో గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి సుదర్శన్ రెండో ప్లేస్‌లో ఉన్నాడు. ఇక 265 పరుగులతో లక్నో ప్లేయర్ మిచేల్‌మార్ష్ 3వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఆతర్వాతి ర్యాంకుల్లో సన్‌రైజర్స్ ప్లేయర్ హెడ్ ఉండగా..నిన్న జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై 40 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్ శర్మ రన్-స్కోరర్స్ లిస్ట్‌లో పైకి దూసుకొచ్చాడు.
అత్యథిక వికెట్లు తీసిన ఆటగాళ్లు…
ఇక ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన వారి జీబితా చూసుకుంటే ఐపీఎల్ పాయింట్ల పట్టికలో లాస్ట్ ప్లేస్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ నూర్ అహ్మద్ ఎక్కువ వికెట్లు తీసిన జాబితాలో మాత్రం ముందున్నాడు. ఈ సీజన్‌లో ఆడిన ఆరు మ్యాచుల్లో 12 వికెట్లు తీసిన నూర్ అహ్మద్ టాప్ ప్లేస్‌లోకి వచ్చాడు. తర్వాత 11 వికెట్లతో లక్నో ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ రెండో ప్లేస్‌లో ఉండగా..10 వికెట్లతో గుజరాత్ ప్లేయర్ ప్రదీప్ కృష్ణ 3వ స్థానంలో ఉన్నాడు.
అత్యధిక సిక్సర్ కొట్టిన ఆటగాళ్లు..
ఇక ఈ సీజన్‌లో అత్యధిక సిక్సర్ కొట్టిన జాబితాను చూసుకుంటే ఇందులోనూ టాప్ స్కోరర్ నికోలస్ పూరన్ ఏ టాప్‌లో ఉన్నాడు. ఈ సీజన్ మొత్తం పూరన్ 31 సిక్సర్లు కొట్టాడు. ఇక రెండో ప్లేస్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఉన్నాడు. ఇతను ఈ సీజన్ మొత్తంలో ఇప్పటి వరకు 20 సిక్సర్స్ కొట్టాడు. ఆ తర్వాత స్థానంలో 15 సిక్సర్లతో లక్నో ప్లేయర్ మిచేల్ మార్ష్ ఉన్నాడు.
అత్యధిక బౌండరీస్ కొట్టిన ఆటగాళ్లు..
ఇక ఐపీఎల్ 2025లో ఎక్కువ బౌండరీలు కొట్టిన వారి జాబితా చూసుకుంటే. ఈ కేటగిరీలో గుజరాత్ ప్లేయర్ సాయి సుదర్శన్ టాప్‌లో ఉన్నారు. ఇతను ఈ సీజన్ మొత్తంలో 31 బౌండరీలు కొట్టాడు. ఆ తర్వాత 30 బౌండరీలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన ట్రావిస్ హెడ్ రెండో ప్లేస్ లో ఉన్నాడు. ఇక 28 బౌండరీలతో లక్నో ప్లేయర్ మిచేల్ మార్ష్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
గమనిక: ఈ గణాంకాలు ఏప్రిల్ 12, 2025 వరకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇవ్వబడ్డాయి. రోజువారీ మ్యాచ్‌లతో ఈ లిస్ట్‌లో మరిన్ని మార్పులు రావచ్చు.