IPL 2025 Points Table: 5 వరుస ఓటములకు చెక్ పెట్టిన చెన్నై.. కట్‌చేస్తే.. ధోనిసేనకు ఊహించని షాక్?
IPL 2025 Points Table Update After CSK vs LSG: చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించినప్పటికీ చివరి స్థానం నుంచి ముందుకు కదలేకపోయింది. లక్నోపై అద్భుత విజయం సాధించినా.. పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మార్చుకోలేకపోయింది. అయితే, ఓడిన లక్నో జట్టు నాల్గవ స్థానానికి చేరుకోవడం గమనార్హం.

IPL 2025 Points Table Update After CSK vs LSG: సోమవారం శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. దీంతో చెన్నై తన వరుస ఓటములకు చెక్ పెట్టేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 49 బంతుల్లో 63 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్ మిచెల్ మార్ష్ 25 బంతుల్లో 30 పరుగులు చేశాడు. తొలి ఆరు ఓవర్లలో ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ చెరో వికెట్ పడగొట్టగా, రవీంద్ర జడేజా 3 ఓవర్లలో 2/24 వికెట్లు తీసుకున్నాడు.
నాల్గవ స్థానంలో లక్నో..
అనంతరం ఛేజింగ్‌లో చెన్నై జట్టు 3 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. సీనియర్ ప్లేయర్ ఎంఎస్ ధోని 11 బంతుల్లో 26 పరుగులు చేయగా, ఓపెనర్ రచిన్ రవీంద్ర 22 బంతుల్లో 37 పరుగులు చేశాడు. శివమ్ దుబే 37 బంతుల్లో అజేయంగా 43 పరుగులు చేయగా, యువ అరంగేట్ర ఆటగాడు షేక్ రషీద్ 19 బంతుల్లో 27 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. లక్నోపై విజయంతో చెన్నై గత ఐదు మ్యాచ్‌ల పరాజయాల పరంపరకు ముగింపు పలికింది. కానీ, ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరి స్థానం నుంచి మాత్రం ముందుకు కదలలేకపోయింది. ఈ సీజన్‌లో మూడో ఓటమి తర్వాత లక్నో నాల్గవ స్థానంలో కొనసాగుతోంది.
కరుణ్ నాయర్ అద్భుతమైన బ్యాటింగ్ చేసినప్పటికీ, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2025 సీజన్‌లో తొలి ఓటమిని చవిచూసింది. 12 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత ముంబై ఏడో స్థానానికి చేరుకుంది. ఢిల్లీ నెట్ రన్ రేట్ తగ్గిపోవడంతో ఒక స్థానం దిగజారి రెండవ స్థానానికి పడిపోయింది.
IPL 2025 30వ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టిక..
1) గుజరాత్ టైటాన్స్ : (మ్యాచ్‌లు – 6, గెలుపు – 4, ఓడినవి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 8, నెట్ రన్ రేటు – +1.081)
2) ఢిల్లీ క్యాపిటల్స్ : (మ్యాచ్‌లు – 5, గెలుపు – 4, ఓటమి – 1, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 8, నెట్ రన్ రేటు – +0.899)
3) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : (మ్యాచ్‌లు – 6, గెలుపు – 4, ఓడినవి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 8, నెట్ రన్ రేటు – +0.672)
4) లక్నో సూపర్ జెయింట్స్ : (మ్యాచ్‌లు – 7, గెలుపు – 4, ఓడినవి – 3, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 8, నెట్ రన్ రేటు – +0.086)
5) కోల్‌కతా నైట్ రైడర్స్ : (మ్యాచ్‌లు – 6, గెలుపు – 3, ఓడినవి – 3, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 6, నెట్ రన్ రేటు – +0.803)
6) పంజాబ్ కింగ్స్ : (మ్యాచ్‌లు – 5, గెలుపు – 3, ఓడినవి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 6, నెట్ రన్ రేటు +0.065)
7) ముంబై ఇండియన్స్ : (మ్యాచ్‌లు – 6, గెలుపు – 2, ఓడినవి – 4, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 4, నెట్ రన్ రేటు – +0.104)
8) రాజస్థాన్ రాయల్స్ : (మ్యాచ్‌లు – 6, గెలుపు – 2, ఓటమి – 4, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 4, నెట్ రన్ రేటు – -0.838)
9) సన్‌రైజర్స్ హైదరాబాద్ : (మ్యాచ్‌లు – 6, గెలుపు – 2, ఓడినవి – 4, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 4, నెట్ రన్ రేటు – -1.245)
10) చెన్నై సూపర్ కింగ్స్ : (మ్యాచ్‌లు – 7, గెలుపు – 2, ఓడినవి – 5, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 4, నెట్ రన్ రేటు – -1.276)
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..