Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Hacks: విమానం ఎక్కకుండా విదేశాలకు ప్రయాణం.. ! ఎలాగో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. జామ్‌ జామ్‌ అంటూ..

మీరు కారులో సులభంగా భూటాన్ చేరుకోవచ్చు. ఇక్కడికి వెళ్లి వచ్చాక మీరు విదేశాలకు వెళ్లమని చెప్పవచ్చు. అంతేకాదు. భూటాన్ వెళ్తే తప్పకుండా పారొ, గ్యాంగ్టే, థింపూ, పునఖా, భుంథంగ్ పర్వత ప్రాంతాలను తప్పకుండా చూడండి. అక్కడి పురాతన బౌద్ధ సాంప్రదాయ కట్టడాలు సైతం పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. హనీమూన్‌కు కూడా ఇది అనుకూలమైన ప్రదేశం. ఈ వేసవిలో ఈ ప్రాంతం ఎంతో చల్లగా, అహ్లాదకరంగా ఉంటుంది. ఇండియా, నేపాల్ ప్రజలు భూటాన్ వెళ్లేందుకు వీసా అక్కర్లేదు.

Travel Hacks: విమానం ఎక్కకుండా విదేశాలకు ప్రయాణం.. ! ఎలాగో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. జామ్‌ జామ్‌ అంటూ..
Travel Hacks
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 11, 2024 | 2:02 PM

విదేశాలకు వెళ్లాలని అందరూ కోరుకుటారు.. మీలో ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా విదేశాలకు వెళ్లాలని కలలు కంటారు. కొందరికి ఈ కల నిజమైతే,చాలా మందికి ఈ కల జీవితాంతం కలగానే మిగిలిపోతుంది. విదేశాలకు వెళ్లాలంటే అత్యంత ఖరీదైనది విమాన టికెట్. కానీ, విమానం ఎక్కకుండానే విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయవచ్చని తెలిస్తే తొలుత ఆశ్చర్యపోతారు. ఆపై ఎగిరి గంతేస్తారు. నమ్మలేకపోతున్నారా..? కానీ, ఇది నిజమేనండోయ్..మీకు విమానం అవసరం లేని కొన్ని దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. మీరు ఎగరకుండానే కారు, షిప్ వంటి రవాణా మార్గాల ద్వారా అలాంటి విదేశాలకు సులభంగా చేరుకోవచ్చు. కాబట్టి, ఆ ఏ దేశాలు ఏవో తెలుసుకుందాం…

1) భూటాన్..

భారతదేశానికి పొరుగు దేశం భూటాన్. భూటాన్ చాలా ప్రశాంతమైన దేశం. భారతదేశం, భూటాన్ మధ్య సరిహద్దు చాలా చిన్నది. పశ్చిమ బెంగాల్‌లోని జైగావ్ సరిహద్దు భారతదేశం, భూటాన్‌లను కలుపుతుంది. మీరు కారులో సులభంగా భూటాన్ చేరుకోవచ్చు. ఇక్కడికి వెళ్లి వచ్చాక మీరు విదేశాలకు వెళ్లమని చెప్పవచ్చు. అంతేకాదు. భూటాన్ వెళ్తే తప్పకుండా పారొ, గ్యాంగ్టే, థింపూ, పునఖా, భుంథంగ్ పర్వత ప్రాంతాలను తప్పకుండా చూడండి. అక్కడి పురాతన బౌద్ధ సాంప్రదాయ కట్టడాలు సైతం పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. హనీమూన్‌కు కూడా ఇది అనుకూలమైన ప్రదేశం. ఈ వేసవిలో ఈ ప్రాంతం ఎంతో చల్లగా, అహ్లాదకరంగా ఉంటుంది. ఇండియా, నేపాల్ ప్రజలు భూటాన్ వెళ్లేందుకు వీసా అక్కర్లేదు.

ఇవి కూడా చదవండి

2) మయన్మార్..

భారతదేశ పొరుగు దేశాల జాబితాలో మయన్మార్ కూడా చేర్చబడింది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం నుండి మీరు సులభంగా మయన్మార్‌లోకి ప్రవేశించవచ్చు. పత్రాల గురించి మాట్లాడుతూ, దీని కోసం మీకు పాస్‌పోర్ట్, మయన్మార్ వీసా ఉండాలి. నవంబర్ నుండి మార్చి వరకు మయన్మార్ సందర్శించడానికి చాలా మంచి సమయంగా పరిగణించబడుతుంది.

3) థాయిలాండ్..

తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కానీ మీరు ఢిల్లీ నుండి రోడ్డు మార్గంలో సులభంగా థాయ్‌లాండ్ చేరుకోవచ్చు. ఢిల్లీ-థాయ్‌లాండ్ మధ్య దూరం దాదాపు 4198 కి.మీ. రోడ్డు మార్గంలో మీరు దాదాపు 71 గంటల్లో థాయ్‌లాండ్‌కి చేరుకోవచ్చు. కానీ పత్రాల తనిఖీలు, ఇతర కారణాల వల్ల కొంత సమయం పట్టవచ్చు. రోడ్డు మార్గంలో ప్రయాణించే వారికి వీసా, పర్మిట్, అంతర్జాతీయ పాస్‌పోర్ట్, 200 శాతం కార్నెట్ ఫీజు, లీడ్ కారు అవసరం.

4) మలేషియా..

థాయిలాండ్ మాత్రమే కాదు, మలేషియాకు కూడా కారులో వెళ్లవచ్చు. ఇందుకోసం 5533 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ ప్రయాణం మీకు 97 గంటలు పట్టవచ్చు. మలేషియాకు వెళ్లడానికి మీకు పాస్‌పోర్ట్, వీసా, డిపార్చర్, అరైవల్ పత్రాలు, ప్రయాణ పత్రాలు అవసరం. ఈ పత్రాలు లేకుండా మీరు ప్రయాణం చేయలేరు.

5) సింగపూర్..

భారతదేశానికి అత్యంత సన్నిహిత దేశాల్లో సింగపూర్ కూడా ఒకటి. ఇది చాలా అభివృద్ధి చెందిన, అందమైన దేశం. ఢిల్లీ, సింగపూర్ మధ్య రహదారి దూరం దాదాపు 5926 కి.మీ. రోడ్డు మార్గంలో ఈ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి దాదాపు 91 గంటలు పడుతుంది. మీరు సింగపూర్‌కు రోడ్డు మార్గంలో వెళ్లాలనుకుంటే కొన్ని పత్రాలు చాలా ముఖ్యం. డ్రైవింగ్ లైసెన్స్, ప్రయాణ పత్రం, ప్రత్యేక ఓవర్‌ల్యాండ్ అనుమతి, పాస్‌పోర్ట్, కార్నెట్ ఫీజు, వీసా మొదలైనవి.

ఇక, సింగపూర్‌కు వెళ్లాలంటే మీరు అనేక రాష్ట్రాలు, మలేషియా గుండా వెళ్లాలి. ఢిల్లీ నుంచి బయలుదేరి ఉత్తరప్రదేశ్, బీహార్, అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మయన్మార్, థాయ్‌లాండ్, మలేషియా మీదుగా సింగపూర్ వెళ్లవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి