AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వార్నీ.. ఇదెక్కడి విచిత్రం.. పట్టాల కింద పరిగెడుతున్న రైలు..!! వింత దృశ్యం వీడియో వైరల్‌

పట్టాలు వేయడానికి నగరంలో ఖాళీ స్థలం లేకపోవడంతో, ఇంజనీర్లు తమ చాతుర్యంతో ఇలాంటి వినూత్న రైలు మార్గాన్ని రూపొందించారు. దానిపై రైళ్లు తలక్రిందులుగా నడవడం ప్రారంభించాయి. ఈ రైలు రోజూ 13.3 కి.మీ ప్రయాణిస్తుంది. ఈ మార్గంలో 20 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో 123 ఏళ్లుగా నిరంతరంగా రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైలు వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

Watch Video: వార్నీ.. ఇదెక్కడి విచిత్రం.. పట్టాల కింద పరిగెడుతున్న రైలు..!! వింత దృశ్యం వీడియో వైరల్‌
Train Run Under The Track
Jyothi Gadda
|

Updated on: Mar 11, 2024 | 1:27 PM

Share

రైళ్లు ట్రాక్‌లపై పరుగెత్తడం అందరం చూశాం.. ఇది సాధారణ విషయమే. కానీ పట్టాలపై కాకుండా పట్టాల కింద నడిచే రైలును ఎప్పుడైనా చూశారా..? అంటే ఈ రైలు పట్టాల క్రింద వేలాడుతూ నడుస్తున్నట్లు కనిపిస్తుంది. వింటనే వింతగా, ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ.. ! ఇక చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. కానీ, ప్రపంచంలో కొన్ని దేశాల్లో పట్టాల కింద రైళ్లు పరిగెడుతున్నాయి. మీరు ఇప్పటికి చాలా సినిమాల్లో ఇలాంటి రైళ్లను చూసి ఉంటారు. కానీ జర్మనీలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలకు ఇలాంటి ట్రాక్‌ల క్రింద నడిచే రైళ్లు చాలా సాధారణం.

ఈ రైలును ‘హ్యాంగింగ్ ట్రైన్’ అని పిలుస్తారు. ఈ రైళ్లు భూమి నుంచి 40 అడుగుల ఎత్తులో ఉన్న ట్రాక్‌ కింద నడుస్తాయి. ఈ కొత్త టెక్నాలజీ అద్భుతాన్ని చాలా మంది వింతగా భావిస్తారు., కానీ విషయం అది కాదు.. ఎందుకంటే ఈ రైల్వేలు 21వ శతాబ్దానికి ముందే నిర్మించబడ్డాయి. ఇటువంటి రైళ్లు జర్మనీలోని వుప్పర్తాల్ నగరం నుండి నడుస్తాయి. ఇది వుప్పర్టల్ సస్పెన్షన్ రైల్వే కింద నడుస్తుంది. ఇప్పుడు చాలా మంది ఈ రైలు మార్గాలను ఈ విధంగా ఎందుకు రూపొందించారనే సందేహంలో పడివుంటారు. వుప్పర్తాల్ నగరం వీధుల్లో నడవడానికి కూడా ఖాళీ లేకుండా ఉండటమే దీని వెనుక కారణం. ఈ నగరం కొండ ప్రాంతంలో ఉన్నందున, భూగర్భ రైళ్లు కూడా అక్కడ నడవలేవు. పట్టాలు వేయడానికి నగరంలో ఖాళీ స్థలం లేకపోవడంతో, ఇంజనీర్లు తమ చాతుర్యంతో ఇలాంటి వినూత్న రైలు మార్గాన్ని రూపొందించారు. దానిపై రైళ్లు తలక్రిందులుగా నడవడం ప్రారంభించాయి. ఈ రైలు రోజూ 13.3 కి.మీ ప్రయాణిస్తుంది. ఈ మార్గంలో 20 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో 123 ఏళ్లుగా నిరంతరంగా రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైలు వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

ఈ రైలు ప్రపంచంలోని పురాతన మోనోరైళ్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ రైలు దాదాపు 19,200 టన్నుల ఉక్కుతో తయారు చేయబడింది. ఈ రైలులో ప్రయాణించే అనుభవం చాలా ఉత్తేజకరమైనది. ఈ రైలు గాలిలో తలకిందులుగా నడుస్తున్నప్పటికీ, ప్యాసింజర్ సీట్లు సాధారణ రైల్వే రైళ్లలా నిటారుగా ఉంటాయి. జర్మనీ కాకుండా ఇటువంటి రైళ్లు జపాన్‌లో మాత్రమే నడుస్తాయి, వీటిని సస్పెన్షన్ రైల్వేలు అంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..