Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Haunted Village: దెయ్యాలు పాలించే ఈ గ్రామంలో అపారమైన నిధులు..! 200 ఏళ్లుగా ఎవరూ టచ్‌ చేసింది లేదు..? మన దేశంలోనే..

ఇదిలా ఉంటే, చరిత్రకారుల ప్రకారం, పాలివాల్ బ్రహ్మణులు తమ సంపదను ఇక్కడే పాతిపెట్టారు. అందులో భారీ మొత్తంలో బంగారం, వెండి, వజ్రాలు, ఆభరణాలు భూగర్భంలో ఉన్నాయని చెబుతారు.. ఇక్కడికి ఎవరు వచ్చినా వివిధ చోట్ల తవ్వకాలు జరపడం వెనుక ఇదే కారణం. ఆ స్వర్ణం తమకు దక్కుతుందన్న ఆశతో ఈ గ్రామం ఇప్పటికీ చాలా ధ్వంసమైందట.

Haunted Village: దెయ్యాలు పాలించే ఈ గ్రామంలో అపారమైన నిధులు..! 200 ఏళ్లుగా ఎవరూ టచ్‌ చేసింది లేదు..? మన దేశంలోనే..
Kuldhara Village In Rajasthan
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 11, 2024 | 12:49 PM

దెయ్యం అంటే మనలో చాలా మందికి భయం. ఇవి భూమిపై ఉన్నాయో లేదో ఎవరికీ తెలియదు.. కానీ, వాటి గురించి వింటే భయంతో వణికిపోతున్నారు. ఎక్కడో దెయ్యం ఉందని ఎవరైనా చెబితే చూడడానికి కూడా భయపడతారు. ఎందుకంటే దెయ్యాల ఉనికిని నమ్మే వారు చాలా మంది ఉన్నారు. అలాంటిది దెయ్యాలు పాలించే గ్రామం ఒకటి ఉందని మీకు తెలుసా.? ఇక్కడికి వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఈ ప్రదేశం హాంటెడ్ విలేజ్‌గా ప్రసిద్ధి చెందింది. ఇంతకీ ఇది ఎక్కడ..? ఈ గ్రామాన్ని హాంటెడ్ అని ఎందుకు పిలుస్తారు? ఈ వివరాలన్నీ ఇక్కడ తెలుసుకుందాం..

రాజస్థాన్‌లో అలాంటి గ్రామం ఒకటి ఉంది. భారతదేశంలో అత్యంత హాంటెడ్ గ్రామం ఇది. కులధార అనేది రాజస్థాన్‌కు నైరుతి దిశలో 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం. ఒకప్పుడు రాజస్థాన్‌లోని పాలివాల్ బ్రాహ్మణులు ఈ గ్రామంలో నివసించేవారు. 300 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఈ గ్రామం ఒకప్పుడు బ్రాహ్మణులచే స్థాపించబడి సంతోషకరమైన, సంపన్నమైన గ్రామంగా విలసిల్లేదని చెబుతారు. కానీ, ఇప్పుడు ఇక్కడ ఆత్మలు సంచరిస్తాయని, ఇక్కడ ఎవరూ ఉండరని స్థానికులు చెబుతున్నారు. దెయ్యాల భయంతో గ్రామం రాత్రికి రాత్రే కనుమరుగైంది. ఈ గ్రామం గత 170 ఏళ్లుగా నిర్జనమైపోయింది. రాత్రికి రాత్రే నిర్మానుష్యంగా మారిన ఈ గ్రామం శతాబ్దాల తరబడి నిర్మానుష్యంగా మారడానికి గల రహస్యం ఏమిటో నేటికీ అర్థం చేసుకోలేకపోయారు.

కానీ, కులధారా గ్రామాన్ని ప్రజలు విడిచిపెట్టడానికి సంబంధించి ఒక వింత కథ ప్రచారంలో ఉంది. వాస్తవానికి, కులధార కథ దాదాపు 200 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. కులధార గ్రామం గతంలో ఎంతో కలకలలాడుతూ ఉండేదని, దాని చుట్టుపక్కల 84 గ్రామాలలో పాలివాల్ బ్రహ్మణులు నివసించేవారని చెబుతారు. ఓ సారి కులధారపై ఎవరిదో చెడు దృష్టి పడిందని, అతను రాక్షస కన్ను గ్రామంలోని ఒక అందమైన అమ్మాయిపై పడింది. 19వ శతాబ్దం ప్రారంభంలో పాలకుడు సలీం సింగ్ ప్రజలను హింసించాడని చెబుతారు. ఆ దుర్మార్గుడు గ్రామానికి చెందిన ఒక అమ్మాయిపై పిచ్చిని పెంచుకున్నాడు. అతను ఆమెను ఎలాగైనా పొందాలనుకున్నాడు. ఇందుకోసం బ్రాహ్మణులపై ఒత్తిడి తేవడం ప్రారంభించాడు. అధికారం మత్తులో ఉన్న సలీం సింగ్‌ వచ్చే పౌర్ణమిలోగా ఆ అమ్మాయి తనకు దక్కకపోతే, చిత్రహింసలకు గురిచేస్తానని గ్రామస్తులను హెచ్చరించాడు. ఊరిపై దాడి చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్తానని ఆ అమ్మాయి ఇంటికి సందేశం పంపాడు.

ఇవి కూడా చదవండి

సలీం సింగ్‌ వేధింపులతో విసిగిపోయిన 85 పలివార బ్రాహ్మణ కుటుంబాలు గ్రామంలో ఒక్కటయ్యాయి. తమ గ్రామ పెద్ద కుమార్తెను ఆ దుర్మార్గుడికి అప్పగించేందుకు నిరాకరించారు. కానీ, అతని నుండి తమను తాము రక్షించుకోవడానికి గ్రామంలోని పెద్ద కుటుంబంతో పాటు గ్రామ ప్రజలంతా రాత్రికి రాత్రే ఊరు విడిచి వెళ్లిపోయారు. అయితే రాత్రికి రాత్రే గ్రామస్తులంతా ఎక్కడికి వెళ్లారు.? ఎలా వెళ్లారో ఎవరికీ తెలియదు. ఊరు విడిచి వెళ్ళేటప్పుడు ఆ బ్రాహ్మణులు ఈ ప్రదేశాన్ని శపించారని చెబుతారు. ఆ తరువాత నుంచి కులధార గ్రామం దెయ్యాల గ్రామంగా మారిందని చెబుతారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కుల్‌ధార గ్రామంలో కొత్తగా ఎలాంటి ఏర్పాటు చేయలేదని స్థానికులు చెబుతున్నారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా ఇక్కడి చుట్టుపక్కల 82 గ్రామాలు పునర్నిర్మించబడ్డాయి. కానీ, కులధారా, ఖాభా అనే రెండు గ్రామాలు మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా నేటికీ జనావాసాలు లేరు. ఈ గ్రామాలు ఇప్పుడు భారత పురావస్తు శాఖ రక్షణలో ఉన్నాయి. ప్రతిరోజూ పగటిపూట పర్యాటకుల సందర్శన కోసం తెరుస్తారు.

ఇదిలా ఉంటే, చరిత్రకారుల ప్రకారం, పాలివాల్ బ్రహ్మణులు తమ సంపదను ఇక్కడే పాతిపెట్టారు. అందులో భారీ మొత్తంలో బంగారం, వెండి, వజ్రాలు, ఆభరణాలు భూగర్భంలో ఉన్నాయని చెబుతారు.. ఇక్కడికి ఎవరు వచ్చినా వివిధ చోట్ల తవ్వకాలు జరపడం వెనుక ఇదే కారణం. ఆ స్వర్ణం తమకు దక్కుతుందన్న ఆశతో ఈ గ్రామం ఇప్పటికీ చాలా ధ్వంసమైందట.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..