AP High Court: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు చేస్తూ హైకోర్టు కీలక తీర్పు.. ‘అప్పీలుకి వెళ్తాం’ ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్‌ ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షపై రాష్ట్ర హైకోర్టు బుధవారం (మార్చి 13) కీలక తీర్పు వెలువరించింది. ఈ పరీక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జవాబు పత్రాలను మాన్యువల్‌గా (చేతితో దిద్దడం) రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మొదటిసారి దిద్దిన ఫలితాలను తొక్కిపెట్టి, రెండోసారి సమాధాన పత్రాలను దిద్దించి నచ్చిన వారిని ఎంపిక చేసి..

AP High Court: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు చేస్తూ హైకోర్టు కీలక తీర్పు.. 'అప్పీలుకి వెళ్తాం' ఏపీ సర్కార్
AP High Court
Follow us

|

Updated on: Mar 13, 2024 | 3:07 PM

అమరావతి, మార్చి 13: ఆంధ్రప్రదేశ్‌ ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షపై రాష్ట్ర హైకోర్టు బుధవారం (మార్చి 13) కీలక తీర్పు వెలువరించింది. ఈ పరీక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జవాబు పత్రాలను మాన్యువల్‌గా (చేతితో దిద్దడం) రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మొదటిసారి దిద్దిన ఫలితాలను తొక్కిపెట్టి, రెండోసారి సమాధాన పత్రాలను దిద్దించి నచ్చిన వారిని ఎంపిక చేసి ఏపీపీఎస్సీ ఫలితాలు ప్రకటించినట్లు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించింది. మెయిన్స్‌ జవాబు పత్రాలను రెండవసారి, మూడవసారి మూల్యాంకనం చేయడం చట్టవిరుద్దమని హైకోర్టు పేర్కొంది. ఈ క్రమంలో మెయిన్స్‌లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసింది.

ఆ పరీక్షను మళ్లీ నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. పరీక్ష నిర్వహణ, ఎంపిక ప్రక్రియను వచ్చే 6 నెలల్లోపు పూర్తిచేయాలని ఉన్నత న్యాయ స్థానం స్పష్టం చేసింది. కాగా ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు 2020 డిసెంబర్ 14 నుంచి 20 వరకు కమిషన్‌ నిర్వహించింది. ఈ పరీక్ష ఫలితాలు 2021 ఏప్రిల్‌లో ప్రకటించింది. మెయిన్స్‌లో జవాబు పత్రాలను మ్యాన్యువల్‌ పద్ధతిలో మళ్లీ మళ్లీ మూల్యాంకనం చేశారని, అయితే ఆ విషయాలను గోప్యంగా ఉంచినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో మెయిన్స్‌ పరీక్షను రద్దు చేయాలని కొందరు అభ్యర్ధులు కోర్టును ఆశ్రయించగా.. ఈ పరీక్షను రద్దు చేస్తూ కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది.

హైకోర్టు తీర్పును సవాల్‌ చేయనున్న ఏపీ ప్రభుత్వం

2018 గ్రూప్-1పై హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుపై అభ్యర్థులు ఆందోళన చెందవద్దని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఆ నోటిఫికేషన్ కింద ఎంపికై ఇప్పటికే ఉద్యోగాలు చేసుకుంటున్నవారి ప్రయోజనాలను కాపాడుతామని హామీ ఇచ్చింది. వారి తరపున న్యాయపోరాటం చేస్తామని పేర్కొంది. హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని, తీర్పుపై ఎవరూ ఆందోళన చెందవల్సిన అవసరం లేదని, వారి ప్రయోజనాలను పరిరక్షిస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి