లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. కాసేపట్లో ఢిల్లీకి తరలింపు..

బీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ కేసులో కవితకు సెర్చ్ వారెంట్‌తో పాటు అరెస్ట్ వారెంట్‌నూ జారీ చేశారు అధికారులు.

Follow us
Ravi Kiran

|

Updated on: Mar 15, 2024 | 6:14 PM

బీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ కేసులో కవితకు సెర్చ్ వారెంట్‌తో పాటు అరెస్ట్ వారెంట్‌నూ జారీ చేశారు అధికారులు. ఆమె రెండు ఫోన్లనూ స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని కవిత నివాసం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కవిత నివాసానికి భారీగా చేరుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఈడీ దాడులకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు ధర్నాకు దిగాయి. కేంద్రం, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సౌత్ గ్రూప్‌కు కవిత నేతృత్వం వహించారనేది ప్రధాన ఆరోపణ.

అసలు జరిగింది ఇది..

ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఏడాది గ్యాప్‌ తర్వాత ఎమ్మెల్సీ కవితకు గత నెలలో సీబీఐ నోటీసులు ఇచ్చింది. 2022 డిసెంబర్‌లో కవిత నివాసంలోనే స్టేట్‌మెంట్ తీసుకున్న సీబీఐ.. గత నెల 26న ఢిల్లీకి రావాలని, తమ ఎదుట విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో కవితను నిందితురాలిగా చేర్చి 41-A కింద నోటీసులు ఇచ్చింది సీబీఐ. లిక్కర్ కేసులో కీలక నిందితులు అప్రూవర్లుగా మారడంతో.. వారి స్టేట్మెంట్స్ ఆధారంగా కవితకు నోటీసులు జారీ చేసింది సీబీఐ. ఇదే కేసులో ఇప్పటికే కవితను ఈడీ కూడా విచారించింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు MLC కవిత. ఈ పిటిషన్‌ను ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. సీఆర్పీసీ నిబంధనల ప్రకారం విచారణ జరపడం లేదని కవిత ఆరోపించారు. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి ప్రశ్నించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై ఎలాంటి బలవంతపు చర్యలను ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కవిత కోరారు.