AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Liquor Case: లిక్కర్‌ కేసులో కవిత అరెస్ట్‌పై ఈడీ అధికారులతో కేటీఆర్‌ వాగ్వివాదం

ఢిల్లీ లిక్కర్‌ కేసు సంచలన రేపుతోంది. శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా కవితతో పాటు ఆమె భర్త సెల్‌ఫోన్లు సైతం ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు

Delhi Liquor Case: లిక్కర్‌ కేసులో కవిత అరెస్ట్‌పై ఈడీ అధికారులతో కేటీఆర్‌ వాగ్వివాదం
Ktr
Subhash Goud
|

Updated on: Mar 15, 2024 | 6:46 PM

Share

ఢిల్లీ లిక్కర్‌ కేసు సంచలన రేపుతోంది. శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా కవితతో పాటు ఆమె భర్త సెల్‌ఫోన్లు సైతం ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారు. దీంతో కేటీఆర్‌, హరీష్‌రావు తదితర నేతలు కవిత ఇంటికి చేరుకున్నారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు సైతం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ఈడీ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను కేటీఆర్‌ ప్రశ్నించారు.

అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు లో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించిన కేటీఆర్

కావాలని శుక్రవారం వచ్చారు ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు కావాలని శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చారని కేటీఆర్‌ ఆరోపించారు. సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దు అంటూ హుకుం జారీ చేస్తున్న ఐడి అధికారులపై ఆయన మండిపడ్డారు. ఈరోజు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేందుకు అవకాశం లేదంటూనే… అరెస్టు అని చెప్పడం పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Follow Us
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!
భారీ గ్రహల సంచారం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం..
భారీ గ్రహల సంచారం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం..
మొదటి దోశ అంటుకుపోతుందా?డోంట్‌ వర్రీ..హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు
మొదటి దోశ అంటుకుపోతుందా?డోంట్‌ వర్రీ..హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు
పిస్తా vs పల్లీలు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? నిపుణుల నిజాలు ఇవే
పిస్తా vs పల్లీలు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? నిపుణుల నిజాలు ఇవే
తీవ్ర విషాదం.. ముగ్గురు సజీవదహనం!
తీవ్ర విషాదం.. ముగ్గురు సజీవదహనం!
రూ.7,500 తగ్గిన బంగారం ధర.. తాజాగా హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!
రూ.7,500 తగ్గిన బంగారం ధర.. తాజాగా హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!
బ్యాంక్ లోన్ కావాలా? ఇకపై సిబిల్ ఒక్కటి సరిపోదు.. ఇవి మ్యాండేటరీ
బ్యాంక్ లోన్ కావాలా? ఇకపై సిబిల్ ఒక్కటి సరిపోదు.. ఇవి మ్యాండేటరీ
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి