APPSC Group 1 Cancelled: ‘ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దుపై సుప్రీంకు వెళ్తాం’.. ఛైర్మన్ గౌతమ్ సవాంగ్

ఆంధ్రప్రదేశ్‌లో 2018లో నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు చేయాని హైకోర్టు బుధవారం (మార్చి 13) ఏపీపీఎస్సీని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పుపై అభ్యర్థులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం వెల్లడించింది. ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడతామని హామీ ఇచ్చింది. ఉద్యోగుల తరఫున న్యాయపోరాటానికి దిగుతామని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ప్రకటంచింది..

APPSC Group 1 Cancelled: 'ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దుపై సుప్రీంకు వెళ్తాం'.. ఛైర్మన్ గౌతమ్ సవాంగ్
APPSC Group 1 Cancelled
Follow us

|

Updated on: Mar 14, 2024 | 4:42 PM

అమరావతి, మార్చి 14: ఆంధ్రప్రదేశ్‌లో 2018లో నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు చేయాని హైకోర్టు బుధవారం (మార్చి 13) ఏపీపీఎస్సీని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పుపై అభ్యర్థులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం వెల్లడించింది. ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడతామని, ఉద్యోగుల తరఫున న్యాయపోరాటానికి దిగుతామని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్తామని ప్రకటించింది. కాగా ఏపీలో 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షపై మార్చి 13న రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబుపత్రాల మాన్యువల్‌ మూల్యాంకనంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఆ ప్రక్రియను రద్దుచేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జవాబు పత్రాలను రెండు సార్లు మాన్యువల్‌ (చేతితో దిద్దడం) విధానంలో మూల్యాంకనం చేశారంటూ ఆరోపించారు.

దీనిని విచారించిన కోర్టు గతంలో జరిగిన మెయిన్స్‌ పరీక్షను రద్దు చేసింది. పరీక్షకు ముందు అభ్యర్థులకు కనీసం రెండు నెలల సమయం ఇవ్వాలని, ఎంపిక ప్రక్రియను ఆరునెలల్లో పూర్తిచేయాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ పోస్టులకు ఎంపికై ఉద్యోగాలు చేస్తు్న్న వారు కోర్టు ఆదేశాల మేరకు కట్టుబడి ఉంటామని తెల్పుతూ అఫిడవిట్‌ ఇచ్చినట్లు కోర్టు గుర్తు చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు బుధవారం కీలక తీర్పు ఇచ్చారు.

కాగా 162 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి 2018లో డిసెంబర్‌ 31న నోటిఫికేషన్‌ వెలువరించింది. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన వారందరికీ ప్రిలిమ్స్‌ నిర్వమించారు. వీటి జవాబు పత్రాలను డిజిటల్‌ మూల్యాంకనం చేసి, 326 మందిని ఏపీపీఎస్సీ అర్హులుగా తేల్చింది. ఆ తర్వాత మొదటిసారి మాన్యువల్‌ మూల్యాంకనంలో వారిలో 202 మందిని అంటే దాదాపు 62 శాతం మందిని అనర్హులుగా నిర్ణయించింది. జవాబుపత్రం ఒకటే అయినప్పుడు ఎలా మూల్యాంకనం చేసినా అంతమంది ఎలా అనర్హులవుతారని అభ్యర్ధులు ప్రశ్నించారు. వీటిని రెండోసారి కూడా మాన్యువల్‌ మూల్యంకనం చేసినట్లు పిటషనర్లు ఆధారాలతో సహా రుజువు చేశారు. మొదటిసారి దిద్దిన ఫలితాలను పక్కదారిమళ్లించి, రెండోసారి దిద్దించి నచ్చిన వారిని ఎంపిక చేసుకొని ఏపీపీఎస్సీ ఫలితాలు ప్రకటించిందని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం మెయిన్స్‌ జవాబు పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసి 6 నెలల్లోపు మళ్లీ పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది. హైకోర్టు తాజా తీర్పుతో ప్రస్తుతం గ్రూప్‌ 1 అధికారులుగా ఉన్న 143 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ