TSPSC AEE Results 2024: టీఎస్పీయస్సీ ఏఈఈ ఎంపిక ఫలితాలు విడుదల.. మార్చి 18 నుంచి ధ్రువపత్రాల పరిశీలన
తెలంగాణ రాష్ట్రంలోని 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల నియామాకాలకు ఎంపిక ఫలితాలను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు మార్చి 18 నుంచి 22 తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెల్పింది. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి. కాగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల..
హైదరాబాద్, మార్చి 14: తెలంగాణ రాష్ట్రంలోని 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల నియామాకాలకు ఎంపిక ఫలితాలను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు మార్చి 18 నుంచి 22 తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెల్పింది. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి. కాగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి మే 8, 9, 21, 22 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏఈఈ పోస్టులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను కమిషన్ ప్రకటించింది.
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ అడ్మిషన్ బ్లాక్‌లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఆయా అభ్యర్థులు వెబ్‌సైట్‌లో పొందుపరచిన చెక్ లిస్టులోని పత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించింది. పరిశీలన సమయంలో ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని, ఆ విధంగా సమర్పించని వారికి తదుపరి సమయం ఇవ్వబోమని స్పష్టం చేసింది. షెడ్యూలు తేదీలో గైర్హాజరైన వారికి సైతం మళ్లీ అవకాశం ఉండబోదని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
కాగా వివిధ ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగాల్లో 1540 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ పోస్టులకు 2022 సెప్టెంబరులో టీఎస్‌పీఎస్సీ నోటిఫీకేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 81 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోస్టులకు తొలుత 2023 జనవరి 22న రాతపరీక్ష నిర్వహించారు. పశ్నపత్రాల లీకేజీ బట్టబయలు కావడంతో ఈ పరీక్షను రద్దు చేశారు. ఆ తర్వాత 2023 మే 8, 9, 21, 22 తేదీల్లో కమిషన్ ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల మెరిట్ జాబితాలను సబ్జెక్టుల వారీగా గతేడాది సెప్టెంబరులో కమిషన్ ప్రకటించింది. అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌లో 857 మంది, సివిల్ ఇంజినీరింగ్‌లో 27,145 మంది, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో 10,948 మంది, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 7,726 మందిని మెరిట్ జాబితాలో ఇచ్చింది. తాజాగా ఎంపిక ఫలితాలు ప్రకటించిన కమిషన్ 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన మార్చి 18 నుంచి నిర్వహించనుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.