Summer Season: కార్లలో వీటిని పొరబాటున కూడా ఉంచొద్దు.. పేలే ప్రమాదం ఉంది!
వేసవి ప్రారంభం కాకముందే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఈ ఏడాది తక్కువ వర్షపాతంతో పాటు పొడి వాతావరణం కారణంగా రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వేసవిలో సాధారణంగా కార్లు, బైక్‌లలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎండలో నిలిపిన కారులో మంటలు ఎగసిపడటం, రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులో మంటలు రగలడం, కారు అద్దాలు బద్దలు కావడం వంటి పలు ఘటనలు తరచూ చోటు చేసుకుంటూ ఉంటాయి. వీటిని చిన్న విషయాలే..
వేసవి ప్రారంభం కాకముందే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఈ ఏడాది తక్కువ వర్షపాతంతో పాటు పొడి వాతావరణం కారణంగా రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వేసవిలో సాధారణంగా కార్లు, బైక్‌లలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎండలో నిలిపిన కారులో మంటలు ఎగసిపడటం, రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులో మంటలు రగలడం, కారు అద్దాలు బద్దలు కావడం వంటి పలు ఘటనలు తరచూ చోటు చేసుకుంటూ ఉంటాయి. వీటిని చిన్న విషయాలే అని తీసిపారేస్తుంటాం కానీ కొద్దిపాటి ముందు జాగ్రత్తలు తీసుకొంటే ఇలాంటి ప్రమాదాలను అరికట్టవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా బయటికి వెళ్లినప్పుడు కొన్ని వస్తువులను కారులో ఉంచకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..
కారులో మంటలు, పేలుడుకు కారణమయ్యేవి ఏవేవంటే..
సన్‌గ్లాస్‌లు
కార్లు డ్రైవింగ్ చేసే వారికి సాధారణంగా సన్‌గ్లాస్‌లు ధరించే అలవాటు ఉంటుంది. అలవాటు ప్రకారం వాటిని తీసి డ్యాష్‌బోర్డ్‌పై పెట్టేస్తుంటారు. కారును ఎండలో పార్క్ చేసిన సమయంలో అవి భూతద్దంలా పనిచేసి అగ్ని ప్రమాదానికి కారణం అవుతాయి. ప్లాస్టిక్ ఫ్రేమ్‌లు అయితే ఎండవేడికి కరిగిపోతాయి.
సన్ క్రీమ్, స్ప్రే క్యాన్లు
సన్ క్రీమ్‌లోని క్రియాశీల పదార్థాలు అధిక ఉష్ణోగ్రతలో విచ్ఛిన్నమవుతాయి. వీటిల్లోని చర్మ రక్షణ సామర్థ్యం తగ్గిపోతుంది. అందుకే వీటిని ఎక్కువ కాలం పాటు కారులో ఎండ తగిలే ప్రదేశంలో ఉంచకూడదు. సన్ క్రీమ్ చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. సెంట్లు, రూం స్ప్రేలు వంటి క్యాన్లు కూడా కారులో ఉంచకూడదు. వీటిల్లోని స్పిరిట్ కారణంగా ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ ఆ డబ్బాల్లో ఒత్తిడి పెరిగి అవి పేలే ప్రమాదం ఉంది.
స్విమ్‌సూట్‌లు, తడి తువ్వాళ్లు వంటి తేమతో కూడిన బీచ్ వస్తువులు
బీచ్‌లో గడిపిన తర్వాత స్విమ్మింగ్ గేర్ లేదా తువ్వాలను తడిగా తీసుకొచ్చి కారులో ఉంచకూడుద. ఇలా చేస్తే వాటిల్లో ఈస్ట్, ఇన్‌ఫెక్షన్ ప్రేరేపించే బ్యాక్టీరియా వృద్ధి చెందే ప్రమాదం ఉంది.
లైటర్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, బ్యాటరీలు
ధూమపానం అలవాటు ఉన్నవారు పొరబాటున కూడా లైటర్లను కార్లలో వదిలేద కూడదు. కారు ఎక్కువసేపు ఎండలో ఉంటే వీటినుంచి మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. అలాగే ఎండలో కారు నిలిపినప్పుడు అందులో ఎలక్ట్రానిక్ వస్తువులేవీ ఉంచకూడదు. ఎలక్ట్రానిక్స్‌లో ఉండే బ్యాటరీలు, ప్రాసెసింగ్ చిప్‌ల వంటి మెకానిజమ్‌లను వేడి ప్రభావితం చేస్తుంది. ఫలితంగా మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. పాత లేదా కొత్త బ్యాటరీలను కూడా కారు లోపల ఉంచకూడదు. అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద వీటిల్లోని యాసిడ్లు లీకై కారు ఇంటీరియర్ దెబ్బతినే ప్రమాదం ఉంది.
హ్యాండ్‌బ్యాగులు/వాలెట్‌లు
బ్యాగులు దొంగలను ఆకర్షిస్తాయి. వీటిల్లో క్రెడిట్ కార్డ్‌లు, నగదు, మొబైల్ ఫోన్‌లు వంటి ఇతర విలువైన వస్తువులు ఉంటాయి. కారులో వీటిని వదిలేస్తే దొంగలు కారును ధ్వంసం చేయొచ్చు. లేదంటే అధిక ఉష్ణోగ్రతల వల్ల వీటిల్లోని ప్రత్యేక బ్యాక్టీరియా సంతానోత్పత్తికి కేంద్రంగా మారుతుంది. ఎందుకంటే ఇవి వెచ్చని పరిస్థితులలో భారీగా విస్తరిస్తాయి.
మొక్కలు
తేలికపాటి ఉష్ణోగ్రతలు కూడా కొన్ని మొక్కలను గంటల్లోనే నాశనం చేస్తాయి. అవి నిర్జలీకరణం అయ్యి త్వరగా చచ్చిపోతాయి. అలాంటిది మీరు వీటిని కారులో వదిలేస్తే అవి కొన్ని గంటల్లోనే వాటిల్లో తేమశాతం పూర్తిగా పడిపోయి చనిపోయే ప్రమాదం ఉంది.
మేకప్ సామగ్రి
మహిళలు వినియోగించే మేకప్ సామగ్రిని వాహనాల్లో వదిలేయకూడదు. లిప్‌స్టిక్‌ల వంటి కొన్ని మేకప్ ఉత్పత్తులు గది ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కరిగిపోతాయి. లోషన్లు, లిక్విడ్, క్రీమ్,ఆయిల్ ఆధారిత ఉత్పత్తులు కూడా అధిక ఉష్ణోగ్రతలో కరిగిపోతాయి. కారులో వెచ్చని వాతావరణంలో వీటిని వదిలేయకపోవడం మంచిది. వేడి ఆల్కహాల్ ఆవిరైపోయేలా చేస్తుంది. అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద వీటికి మండే స్వభావం ఉంటుంది. సూర్యరశ్మికి అనేక పానీయాల రుచి దెబ్బతింటుంది.
కొవ్వొత్తులు, మద్యం
క్రేయాన్‌ల మాదిరిగానే, కొవ్వొత్తులు అధిక ఉష్ణోగ్రతలలో కరుగుతాయి. ముఖ్యంగా గాజు పాత్రలో ఉన్నవి చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే ఇవి అధిక వేడికి పేలి పోతాయి. మద్యం సీసాలు, క్యాన్లు కార్లలో ఉంచి వాటిని ఎండలో పార్క్ చేయడం అత్యంత ప్రమాదకరం. కార్బొనేటెడ్ డ్రింక్స్ అయితే పేలే ప్రమాదం ఉంది.
హ్యాండ్ శానిటైజర్లు
కొవిడ్ పుణ్యమా అని ప్రతి ఒక్కరూ కార్లలో హ్యాండ్ శానిటైజర్లను వినియోగిస్తున్నారు. అయితే ఆల్కహాల్ ఉన్న శానిటైజర్లు అధిక ఉష్ణోగ్రత వద్ద మంటలు సృష్టిస్తాయి. అందుకే వీటిని కార్లలో ఉంచకూడదు.
ఆహారం, పానీయాలు, ప్లాస్టిక్ సీసాలు
ఎండలో నిలిపిన కారులో పిల్లలు, పెంపుడు జంతువులను ఉంచకూడదు. కిటికీలు తీసి ఉంచినా.. లోపల ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయి. అధిక ఉష్ణోగ్రతలు ప్లాస్టిక్ బాటిల్‌లను విచ్ఛిన్నం చేస్తాయి. హార్మోన్ పనితీరుకు అంతరాయం కలిగించే విష రసాయనాలు (BPA, థాలేట్స్) ప్లాస్టిక్ విడుదల చేస్తుంది. వీటివల్ల క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ప్రమాదకర జబ్బులు వస్తాయి. కాబట్టి కారులో ఉంచిన ప్లాస్టిక్ బాటిల్ ఉంచడం ప్రాణాంతకం. అలాగే ఆర్ట్ సామాగ్రి, పెంపుడు జంతువుల ఆహారం, ఔషధాలను కారులో ఉంచొద్దు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.