BH Series: బీహెచ్ నెంబర్ ప్లేట్స్‌తో బోలెడన్ని ప్రయోజనాలు.. బీమాతో పాటు పన్నుల బాదుడు నుంచి రక్షణ

మోటారు వాహనాల చట్టం ప్రకారం రిజిస్టర్ చేయని రాష్ట్రాల్లో వాహనాన్ని 12 నెలలకు మించి నడపకూడదు. ముఖ్యంగా 12 నెలల లోపు ఆ రాష్ట్రంలోని నెంబర్‌ను పొందాల్సి ఉంటుంది. లేకపోతే భారీగా జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ చాలా సమయం తీసుకోవడంతో పాటు కారు యజమానులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ ఇబ్బందులను పరిష్కరించడానికి కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2021లో భారత్ సిరీస్ నంబర్ ప్లేట్‌లను ప్రారంభించింది.

BH Series: బీహెచ్ నెంబర్ ప్లేట్స్‌తో బోలెడన్ని ప్రయోజనాలు.. బీమాతో పాటు పన్నుల బాదుడు నుంచి రక్షణ
Bh Series
Follow us
Srinu

|

Updated on: Mar 15, 2024 | 3:30 PM

భారతదేశంలో ఉద్యోగం లేదా వ్యాపారం నిమిత్తం మరొక రాష్ట్రంలో స్థిరపడవలసి వస్తే మీరు మీ వాహనాలను కొత్తగా వెళ్లిన రాష్ట్రంలో మళ్లీ నమోదు చేసుకోవాలి. మోటారు వాహనాల చట్టం ప్రకారం రిజిస్టర్ చేయని రాష్ట్రాల్లో వాహనాన్ని 12 నెలలకు మించి నడపకూడదు. ముఖ్యంగా 12 నెలల లోపు ఆ రాష్ట్రంలోని నెంబర్‌ను పొందాల్సి ఉంటుంది. లేకపోతే భారీగా జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ చాలా సమయం తీసుకోవడంతో పాటు కారు యజమానులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ ఇబ్బందులను పరిష్కరించడానికి కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2021లో భారత్ సిరీస్ నంబర్ ప్లేట్‌లను ప్రారంభించింది. భారత్ సిరీస్ నంబర్ ప్లేట్‌ల పరిచయంతో కొత్త రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతానికి వెళ్లేటప్పుడు వాహన యజమానులు తమ వాహనాలను మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం లేదు. బీహెచ్ సిరీస్ మీ పన్నులను ఆదా చేయడంతో బీమా ప్రయోజనాలను అందిస్తుంది. అందువల్ల బీహెచ్ సిరీస్ నెంబర్ ప్లేట్స్ వల్ల కలిగే లాభాలను ఓ సారి తెలుసుకుందాం. 

మీ బీహెచ్ సిరీస్ వాహనంతో కొత్త రాష్ట్రానికి మారిన ప్రతిసారీ మీ కారు బీమా పాలసీని అప్‌డేట్ చేయడం కూడా తప్పనిసరి కాదు. మీరు కొత్త రాష్ట్రానికి మారినప్పటికీ మీ ప్రస్తుత బీమా పాలసీ చెల్లుబాటు అవుతుంది. బీహెచ్ శ్రేణి వాహనాన్ని కలిగి ఉండటం వల్ల రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలకు వెళ్లినప్పుడు యజమానికి రీరిజిస్ట్రేషన్ ప్రక్రియ నుంచి మినహాయింపు లభిస్తుంది. తద్వారా పాలసీ అప్‌డేట్‌ల అవసరాన్ని తగ్గిస్తుంది.

దరఖాస్తు నిబంధనలు

మీరు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకులు, డిఫెన్స్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ మొదలైన వాటిలో పని చేస్తే మీరు బీహెచ్ సిరీస్ లైసెన్స్ ప్లేట్‌ను పొందడానికి అర్హులు. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు/యూటీల్లో కార్యాలయాలు ఉన్న ప్రైవేట్ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు కూడా బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం బీహెచ్ సిరీస్‌ను ప్రవేశపెట్టినప్పుడు ఇది కొత్త కార్ల యజమానులకు మాత్రమే పరిమితం చేశారు. అయితే అనంతరం పాత కార్ల యజమానులు కూడా తమ వాహనాలను BH సిరీస్ కింద నమోదు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

రోడ్డు పన్ను ఆదా

బీహెచ్ శ్రేణి లైసెన్స్ కలిగిన ప్లేట్‌లను కొనుగోలు చేసేటప్పుడు కారు యజమానులు ఇంట్రా-స్టేట్ పన్నును కూడా ఆదా చేయవచ్చు. ఎందుకంటే మీరు కొత్త కారును కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకున్నప్పుడు, మీరు 15 సంవత్సరాల పాటు రోడ్డు పన్నును ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. అయితే బీహెచ్ శ్రేణి లైసెన్స్ ప్లేట్‌లను కలిగి ఉన్న ప్రైవేట్ వాహనాలు రెండు సంవత్సరాలు లేదా నాలుగు, ఆరు, ఎనిమిది సంవత్సరాల్లో సహా దాని గుణిజాలకు రోడ్డు పన్ను విధిస్తారు. అందువల్ల రోడ్డు పన్నును 14 ఏళ్లపాటు ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. 14 సంవత్సరాల తర్వాత, వార్షిక రహదారి పన్ను చెల్లింపు తప్పనిసరి.

బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్ ధర

బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్ ధర వాహనం ధరను బట్టి మూడు ధరల స్లాబ్‌లను కలిగి ఉంటుంది. రూ. 10 లక్షల కంటే తక్కువ ధర ఉన్న వాహనాలకు, దరఖాస్తుదారు ఇన్‌వాయిస్ ధరలో 8 శాతం చెల్లించాలి. రూ. 10-20 లక్షల మధ్య ఉండే వాహనాలకు ఇన్‌వాయిస్ ధరలో 10 శాతం, రూ. 20 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న వాహనాలకు ఇన్‌వాయిస్ ధరలో 12 శాతం ఉంటుంది.

సమగ్ర మోటార్ బీమా కొనుగోలు చేయడం

అనేక బీమా అగ్రిగేటర్ వెబ్‌సైట్‌ల ద్వారా కారు యజమానులు తమ బీహెచ్ సిరీస్ లైసెన్స్ పొందిన ప్లేట్ వాహనాలకు బీమాను సులభంగా కొనుగోలు చేయవచ్చు. మీ కారు బీహెచ్ సిరీస్ కింద రిజిస్టర్ అయినప్పుడు, అది బీమా పాలసీలో ఆమోదం పొందుతుంది. చాలా బీమా సంస్థలు బీహెచ్ సిరీస్ వాహనాలకు మోటారు బీమా కవర్‌లను అందిస్తున్నాయి. అలాగే బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్ బీమా ప్రీమియంలను ప్రభావితం చేయదు. మీరు ఆన్‌లైన్‌లో వివిధ బీమా పాలసీలను సరిపోల్చుకుని మీ అవసరాలకు అనుగుణంగా అత్యంత అనుకూలమైనదాన్ని ఎంచుకోవడానికి మీకు అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!